ప్రతీకాత్మక చిత్రం
వాలెంటైన్స్ వీక్ మొదలై ఓ రోజు గడిచిపోయింది. వారంలోని రెండో రోజు రానే వచ్చింది! అదే ప్రపోజ్ డే. ప్రేమలో ఉన్నవారు భాగస్వామి మెచ్చేలా తమ మదిలోని ప్రేమను వ్యక్తపరచటం.. కొత్తగా ప్రేమలో పడ్డవారైతే తమకిష్టమైన వారి మనసును గెలిచేలా ప్రపోజ్ చేయటం ఈ రోజు ప్రత్యేకత. ఎలా ప్రపోజ్ చేయాలన్న దానిపైన ప్రతీఒక్కరికి ఓ ఆలోచన ఉంటుంది. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే అందరూ ట్రెండ్‌లో ఉన్నవాటినే ఫాలో అవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, మీరు అలా చేయకండి. ఓల్ట్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కొంచెం కొత్తగా.. పాత పద్దతుల్ని అవలంభించండి. మీ ప్రేమను ఆలోచనలుగా మలిచి.. భావాల్ని అక్షరాలుగా చేసి చక్కటి ప్రేమలేఖ రాయండి. ఆ ప్రేమలేఖ మీ మనసు ప్రతిబింబించాలని మాత్రం మర్చిపోకండి. ఎదుటి వ్యక్తి ఇంప్రెస్ అయ్యేలా కవితలు, కొటేషన్లు రాసినా మంచిదే. ఇక పెళ్లైన మగవాళ్లైతే మీ భాగస్వామి కోసం ప్రేమగా వండిపెట్టండి! కాసేపు వారితో సరదాగా గడపండి.
బెస్ట్ ప్రపోజ్ డే కొటేషన్స్ :
- ప్రేమంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమను వెతుక్కోవటం కాదు! నిన్ను వెతుక్కోవటం
- నాదో కోరిక! ఆ సూర్యుడు భూమిపై తెగిపడే దాకా నేను నీ తోడుగా ఉండాలని
- నేను నిన్నెందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలియదు.. ఓ క్షణం నువ్వు కనిపించకపోతే ఎందుకు బాధపడుతున్నానో తెలియదు.. కానీ, నువ్వు లేకుండా నేను లేనని మాత్రం తెలుసు!
- నా హృదయాన్ని ఉంగరం చేసి అందించా.. ఎన్నడూ నువ్వు ఒంటరిగా నడవకూడదని ఆశించా.. నా హృదయాన్ని నీ నివాసం చేసి.. గది బయట నా ఆలోచనల్ని కాపలా ఉంచా..
Comments
Please login to add a commentAdd a comment