ప్రతీకాత్మక చిత్రం
నేను 2011నుంచి 2017వరకు హైదరాబాద్‌లో జాబ్ చేసేవాడిని. అలా చేస్తున్న టైంలో ఫేస్‌బుక్ రవి, లాస్య గ్రూపులో ఒక పోస్ట్‌పై ఓ అమ్మాయి కామెంట్ చేసింది. ఆ ఫ్రోఫైల్ చూసి నేను ‘హాయ్’ అని మెసేజ్ పెట్టా. కొద్దిసేపటికే తను కూడా ‘హాయ్’ అని రిప్లై ఇచ్చింది. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి బాగా మెసేజ్‌లు చేసుకునేవాళ్లం. తర్వాత తను ఫోన్ నెంబర్ ఇచ్చింది. తర్వాతినుంచి మెసేజ్‌లు, కాల్స్ చేసుకునేవాళ్లం. ఒకరి ఫోటోస్ ఒకరం పంపుకున్నాం. ఒకరోజు కలుద్దామని అనుకున్నాం. తను పురానాపూల్ దగ్గర ఉంటుంది, నేను కేపీహెచ్‌పీలో ఉంటాను. ఇద్దరం జూపార్క్‌లో కలుసుకున్నాం. తర్వాతినుంచి ఇద్దరి మధ్యా ప్రేమ మొదలైంది.
నేను నా లవ్‌ని చెప్పాను. మొదట్లో తను నో చెప్పినా.. తర్వాత ‘‘ఓన్లీ ప్రేమ మాత్రమే.. పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు! ప్లీజ్’’ అంది. నేను సరే అన్నాను. అలా మేము చాలా హ్యాపీగా ఓ సంవత్సరం ప్రేమించుకున్నాం. తనప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేది. తన చదువు పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తామని అన్నారంట. పెళ్లి చేసుకుందామని బ్రతిమలాడినా కూడా వినలేదు! ఏడ్చాను కూడా. ‘ మన కులాలు వేరు మా ఇంట్లో తెలిస్తే గొడవలు అయిపోతాయి.’ అని చెప్పింది. 2017లో తను మ్యారేజ్ చేసుకుంది.
సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. పెళ్లికి ముందు తను చూపిన ప్రేమ జన్మలో మర్చిపోలేను. తను చాలా చాలా మంచిది. ఇప్పుడు హ్యాపీగా ఉంది అదిచాలు నాకు. నేను నా జాబ్‌లో బిజీ అయిపోయాను.‘‘ నాకు ఫోన్ కానీ, వాట్సాప్ కానీ చేయోద్దు. మా హబ్బీ చూస్తే నాకు డేంజర్’ అంది. సో నేను తనను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే తనంటే నాకు చాలా ఇష్టం. ఆమె హ్యాపీగా ఉంది అది చాలు.
- రామ్, పుట్టపర్తి
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment