ప్రతీకాత్మక చిత్రం
నేను మా ఊర్లో స్కూలింగ్ కంప్లీట్ చేసి, ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లాను. ఒక రెండు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా నాతో స్కూల్లో చదువుకున్న అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాను. అలా చాలా రోజులు మాట్లాడుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కోపంగా ఉన్నా.. బాధ అనిపించినా తనతోనే పంచుకునేవాడిని. తనతో మాట్లాడకుండా ఒక రోజైనా ఉండేవాడిని కాదు. నాలైఫ్‌లో జరిగిన ప్రతీచిన్న విషయాన్ని తనతో పంచుకునే వాడిని. తను నాతో మాట్లాడకపోతే మరుసటి రోజు నేను తనని తిట్టేవాడిని.
తనునాకు చాలా సపోర్టివ్‌గా ఉండేది. చాలా కేరింగ్‌గా ఉండేది. నేనంటే తనకు ఇష్టం.. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు నా మరదలితో ఎంగేజ్‌మెంట్ అయింది. అప్పటికి కూడా తనతో చాలా క్లోస్‌గా ఉండేవాడిని. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. నేను తనని ముద్దగా సెల్ఫీ అని పిలిచేవాడిని. నా ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్లికి మధ్యకాలంలో మరింత క్లోజ్ అయ్యాం. మ్యారేజ్ తర్వాత మాట్లాడుకోవటం మంచిది కాదని చెప్పేవాడిని. తను మాత్రం ఎంగేజ్‌మెంట్‌కు ముందు ఎలా ఉండేవాళ్లమో అలానే ఉండాలి అనేది. తనతో మాట్లాడటం మా భార్యకు నచ్చనం లేదు. తనకు తెలియకుండా మాట్లాడుతూ ఉండేవాడ్ని.
కానీ, తను మాత్రం ప్రతీదానికి అలగటం నువ్వు మారిపోయావ్ అని గొడవ పెట్టడం చేసేది. ఏం జరిగినా తను ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టుకుని అలగటం మొదలుపెట్టేది. తను చేసేది నాకు కోపం వచ్చి గట్టిగా అరిచేవాడిని. మూడు నెలలక్రితం కూడా అదే జరిగింది. తను ఏమనుకుందో ఏమో నాతో మాట్లాడటం మానేసింది. నేను తనను చాలా మిస్ అవుతున్నా. ఎక్కడ ఉన్నా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..
.. నీ చిన్నా
Comments
Please login to add a commentAdd a comment