ప్రతీకాత్మక చిత్రం
తన పేరు లక్ష్మి! ప్రైవేట్ జాబ్ చేసేది. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. దీంతో మేము బాగా మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఎప్పుడు కూడా లవ్ చేస్తున్నానని తనకు చెప్పలేదు. అప్పుడప్పుడు ‘ఐ లవ్ యూ’ అని లిప్ మూవ్‌మెంట్ ఇచ్చేవాడిని. అది చూసి ఏమీ అనేది కాదు. తర్వాత తను జాబ్ మానేసింది. అలా కొన్ని నెలల తర్వాత ఓ రోజు ‘నీ తో ఓ విషయం చెప్పాలి’ అన్నాను తనతో. ఆ వెంటనే ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పేశాను. ‘ఏంటి వినబడలేదు! ఏమంటున్నారు’ అని నాతో మూడు సార్లు ఐ లవ్ యూ చెప్పించుకుంది. తర్వాత తను అన్న మాటకు నీరసం వచ్చింది. ‘ ఇది చెప్పటానికి ఇంత టైం పట్టిందా. ఎంత ఎదురుచూస్తున్నానో’ అంది. తను ప్రతి రోజూ చాల చక్కగా తయారయ్యేది. నాకు బొట్టుబిళ్లలంటే చాలా ఇష్టం. చాలా ప్యాకేట్లు ఇచ్చేవాడిని.
తనతో ఏ రోజూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. బయట ఎక్కడికీ వెళ్లలేదు. ఒకరోజు మా ఫ్యామిలీల మధ్య గొడవైంది. దాంతో తను నాతో మాట్లాడటం మానేసింది. ‘నీకు నాకు మధ్య గొడవలేమీ లేవు కదా!’ అన్నా నేను. ‘వద్దు! ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది’ అని మాట్లాడేది కాదు. అలా నన్ను చూస్తూ ఉండేది అంతే. మా ఇంటి పనిమనిషికి మా ప్రేమ విషయం తెలుసు. గొడవలు అయినపుడు మా విషయం మా వాళ్లకు చెప్పేసిందనుకుంటా! నా మీద నిఘా పెట్టారు. ఈ లోపు వాళ్ల ఫాదర్ రిటైర్ అయ్యాక సడన్‌గా వేరే ఏరియాకు షిఫ్ట్ అయ్యారు. నేను ఫాలో అవుదాం అని బయటకు వెళ్తుంటే అమ్మ చూసి ‘ఎక్కడికి.. తర్వాత వెళ్లొచ్చు! వచ్చి కూర్చో’ అంది.
అలా వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. తనని మిస్ అయ్యా. చాలా వెతికాను! కొన్ని నెలలకి వాళ్లు ఉండే హౌస్ దొరికింది. నన్ను చూసి ఎంతో సంతోషించి నవ్వింది. ఎలా ఉన్నారని అడిగింది. ఈ లోపు వాళ్ల చెల్లి వచ్చేసింది. వాళ్ల వాళ్లని పిలిచింది. తను ‘శేషు ప్లీజ్ వెళ్లిపో!’ అంది. నేను ఇంటికి వచ్చేశా. తరువాత ఎన్నో సార్లు వాళ్ల వీధిలోకి వెళ్లా. ఎప్పుడూ బయట ఉండేది కాదు. అలా ఒకరికి ఒకరం ఇష్టపడ్డా ఫ్యామిలీల వల్ల వేరయ్యాం. తను ఎక్కడవుందో తెలియదు. మ్యారేజై ఉంటుంది. ‘శేషు! నీ నవ్వు, నువ్వు ఏమిటో.. ఎందుకో..’ అని తను దీర్ఘం తీస్తూ అనే మాటలు ఇప్పటికి మర్చిపోలేదు. ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నా.
.. నీ శేఖర్
చదవండి : ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది!
Comments
Please login to add a commentAdd a comment