
నేను ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. ఫ్రెండ్స్ కూడా తక్కువే. నా ధ్యాస ఎప్పుడూ చదువు మీదే ఉండేది. హైదరాబాద్‌లో ఎంసీఏ పూర్తిచేశాక..ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా. ఇప్పుడున్న టెక్నాలజీ రంగంలో ఏ బిజినెస్ అయినా ప్రమోట్ చేసుకోవాలంటే సోషల్ మీడియా చాలా మంచి ఫ్లాట్‌ఫామ్‌గా భావించి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా.చాలా మంది బిజినెస్ ఆడ్స్ కోసం టీవీ చానెల్ వాళ్ళను సంప్రదిస్తారు , లేదా సోషల్ మీడియా ద్వారా చేరువవుతారు. ఇంకొంత మంది తమ వెబ్‌సైట్ డిజైన్ కోసం ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీని సంప్రదిస్తారు. వాళ్ళ అందరి కోసం నేను ఒక ఫేస్‌బుక్ పేజీని సైన్స్ & టెక్నాలజీ పేరుతో ప్రారంభించాను.
అలా నేను సోషల్ మీడియాలో లీనం అయ్యాను. సరిగ్గా నాలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. తను కూడా నాలాగే ఓ బిజినెస్‌పేజీని రన్ చేస్తుండేది. ఆమెతో పెద్దగా మాట్లాడేది కాదు కానీ తను పెట్టే ప్రతీ పోస్ట్‌కు లైక్, కామెంట్ చేసేవాడిని. ఎవరైనా నెగటివ్ కామెంట్ పెడితే నేను హీరోలాగే వాళ్లను తిట్టేవాడ్ని. అప్పుడప్పుడు మాట్లాడేది. నేనంటే తనకు కూడా ఇష్టమేమో అని తనకి లవ్ ప్రపోజ్ చేశా. నువ్వు జస్ట్ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌వి. ఏదో సరదాగా మాట్లాడితే ఇంక లవ్ అయిపోతుందా అనేసరికి కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లాను. నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను.తను నాతో మాట్లాడేసరికి అదే ప్రేమనుకున్నా. ఇప్పడు నేను సోషల్ మీడియాను పక్కన పెట్టి జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ప్రేమ అంటేనే చాలా భయం వేస్తుందిప్పుడు.
--వెంకట హరిచరణ్ (హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment