‘మీ ఆయనకు విడాకులిచ్చేయ్‌..’ | Breakup Love Stories In Telugu Lovely Sad Love | Sakshi
Sakshi News home page

‘మీ ఆయనకు విడాకులివ్వు! పెళ్లి చేసుకుందాం’

Published Sat, Feb 8 2020 8:58 AM | Last Updated on Sat, Feb 8 2020 1:13 PM

Breakup Love Stories In Telugu Lovely Sad Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

2017లో డిగ్రీ కంప్లీట్‌ చేసి గవర్నమెంట్‌ జాబ్‌కి ప్రిపేర్‌ అవుతున్నా. అప్పుడే ఆర్‌ఆర్‌బీ పోస్టులు పడితే అప్లై చేసి కోచింగ్‌ తీసుకుంటున్నాను. కోచింగ్‌ సెంటర్‌లో చేరినపుడు స్టడీ.. హోమ్‌ తప్ప ఇంకేమీ ఉండేది కాదు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా మంది నాకు ప్రపోజ్‌ చేశారు. బట్‌ పెద్దగా పట్టించుకునేదాన్ని కాను. ఓ రోజు మధ్యాహ్నం ఒక అబ్బాయి నాతో మాట్లాడటానికి ట్రై చేశాడు. సైన్స్‌ బుక్‌ గురించి అడుగుతున్నాడు.. మా ఫ్రెండ్‌ రెస్పాండ్‌ అవుతోంది‘ మేము తీసుకోలేదు.. వేరే వాళ్ల దగ్గర జిరాక్స్‌ ఉంది తీసుకోండి’ అంది. తర్వాత తను నాకు సైట్‌ కొడుతున్నాడని తెలిసింది. ఓ రోజు ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలు అడిగాడు. ఇవ్వాలా? వద్దా? అనుకున్నా.. తను ఫ్రెండ్లీగా అడుగుతున్నాడేమో అనుకుని చెప్పేశా. తర్వాతి రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్‌ చేశాడు. ‘హాయ్‌’  అని. అలా పరిచయం మొదలైంది. ఎంతో రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్‌ చేశాడు. నేనపుడు ఒప్పుకోలేదు. తను ఏప్రిల్‌లో ప్రపోజ్‌ చేస్తే నేను డిసెంబర్‌లో ఓకే చెప్పాను. ప్రేమించుకున్నప్పటికి ఎప్పుడు కూడా మేము బయట తిరగలేదు! కాల్స్‌, చాటింగ్స్‌ అంతే.. తనకు డిసెంబర్‌లో జాబ్‌ వచ్చి వెళ్లిపోయాడు.

మా మధ్యలో అంత స్ట్రాంగ్‌ బాండింగ్‌ ఉండేది కాదు. ఏదో మాట్లాడుకున్నామా అంతే! అలా మా రిలేషన్‌లో గొడవలు కూడా అయ్యేవి. ఒకసారి ఓ నెల రోజులు ఏమీ మాట్లాడుకోలేదు. తర్వాత మాట్లాడుకున్నాం. ఇంట్లో వాళ్లు నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తనకు చెప్పా! పెద్దగా రియాక్ట్‌ కాలేదు. ‘ అనవసరమైన విషయాలు నాకెందుకు చెబుతున్నావ్‌!’ అన్నాడు ఒకసారి. ఆ రోజునుంచి నేను తనతో మ్యాచెస్‌ గురించి చెప్పటం మానేశాను. కొన్ని రోజులకు నాకు పెళ్లి ఫిక్స్‌ అయింది. పెళ్లి కుదిరిన రెండురోజులకు తనకి మెసేజ్‌ చేశా. శుభాకాంక్షలు చెప్పాడు. ఏమీ అనలేకపోయా! తర్వాతి రోజు నాతో‘ మ్యారేజ్‌ క్యాన్సిల్‌ చేస్కో! నువ్వు నాకు కావాలి.’ అనటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఏమైంది అనుకున్నా మనసులో. నిజానికి తనంటే నాకు కూడా ఇష్టమే.. తనే చాలా నార్మల్‌గా ఉండేవాడు మా రిలేషన్‌లో. నేను కూడా అలాగే ఉండేదాన్ని. ‘నేనిపుడు ఏమీ చేయలేను! ఇప్పుడంతా అయిపోయింది. మా వాళ్లు అబ్బాయి వాళ్లకు డౌరీ కూడా ఇచ్చేశారు. అందరికీ చెప్పేసుకున్నారు.

నాకసలు ఈ పెళ్లి ఇష్టంలేదు. కానీ, మా వాళ్లు బలవంతపెట్టేసరికి ఒప్పుకోవల్సి వచ్చింది’  తనకు అంతా క్లియర్‌గా చెప్పేశాను. అతను చాలా ఏడ్చాడు! సూసైడ్‌ అటెంప్ట్‌ కూడా చేశాడు. కానీ, నా పెళ్లి అయిపోయింది. నేనిప్పుడు ఢిల్లీలో ఉంటున్నా. ఓ రోజు ఓ ఈవెంట్‌ ఉంటే ఊరికి వచ్చాను. ఆ విషయం తెలుసుకుని ఆ ఈవెంట్‌కు వచ్చేశాడు. నేను ఆటో దిగేసరికి అక్కడ ఉన్నాడు. ‘అతనేంటి ఇక్కడ’ అని షాక్‌ అయ్యాను. ‘నీతో కొంచెం మాట్లాడాలి! బైక్‌ ఎక్కు బయటకు వెళదాం’ అన్నాడు. నేను వినిపించుకోలేదు. అతన్ని వెళ్లిపోమని చెప్పి లోపలికి నడిచా. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. మా స్నేహితులు వార్నింగ్‌ ఇద్దామనుకున్నారు. మేము బయటకు వచ్చేలోపు వెళ్లిపోయాడు. చాలాసార్లు కాల్‌ చేశాడు. ఏంటో అని నేను లిఫ్ట్‌ చేశా. ‘నాకు నువ్వు కావాలి. నువ్వులేకుండా ఉండలేను’ అని చెప్పుకుంటుపోయాడు. నేను నచ్చచెప్పటానికి ఎంతో ట్రై చేశా. వాడికి తెలుసు.. వాడంటే నాకు చాకు చాలా ఇష్టం అని. ఆ రోజు మాకు గొడవ కాకుండా ఉండిఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదేమో.. వాడు ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యత, చూపిస్తున్న ప్రేమ అప్పుడు చూపించి ఉంటే అసలు ఈ పెళ్లి జరగకపోయేది.

మ్యారేజ్‌ గురించి చెప్పినా ఎందుకు రెస్పాండ్‌ అవ్వలేదని అడిగా. ‘నాకు నీపై నమ్మకంరా నువ్వు వేరే మ్యారేజ్‌ చేసుకోవని, అందుకే రియాక్ట్‌ కాలేదు. సరే నా తప్పు ఒప్పుకుంటున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుందాంరా! మీ ఆయనకు విడాకులు ఇచ్చేయ్‌’ అన్నాడు. వాడిని చూస్తుంటే ఏం చేసుకుంటాడో అని భయం వేస్తోంది. ‘ సరే చేసుకుందాం. నువ్వేమీ చేసుకోకు’ అన్నా. అప్పటినుంచి పిచ్చిపిచ్చిగా చేయటం మానేశాడు. నేను ఇప్పటికీ చెబుతూనే ఉన్నా మన మ్యారేజ్‌ జరగదురా అని కానీ తను అస్సలు అర్థం చేసుకోవటం లేదు. డైలీ ఏదో ఒకటి చేసుకుంటున్నాడు.. ఏడుస్తున్నాడు. ఎప్పుడైనా వీడియో కాల్‌ చేస్తే! చాలా ఎమోషనల్‌ అయిపోతాడు. వాడికి ఎలా నచ్చచెప్పాలో అర్థంకావటం లేదు. పోనీ మొత్తానికే వదిలేద్దామనుకుంటే ఏమన్నా చేసుకుంటాడేమోనని భయం. ఏమైనా అంటే ‘నువ్వు నా దానివి అంతే’ అంటాడు. తను కోరుకున్న చిరునామా తనది కాదని చెప్పినా అర్థంకాదు. నేను మా భర్తతో దిగిన ఫొటోలు ఎఫ్‌బీలో చూసినపుడు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ ఫొటోలు తీసేదాకా ఊరుకోడు.

వాడికి కోపం ఎక్కువే.. ప్రేమ ఎక్కువే. చాలా సార్లు చెప్పా‘ నీకు మంచి జాబ్‌ ఉంది. పెళ్లైన అమ్మాయిని చేసుకోవల్సిన అవసరం ఏముంది. చక్కగా వేరే అమ్మాయిని చేసుకో.. నువ్వు అనుకుంటున్నవి ఏవీ జరగవు’అని. నాకు పెళ్లైందన్న మాట వింటేనే అతడికి చాలా కోపం వస్తుంది. ‘ నా దృష్టిలో నీకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు ఆ టాపిక్‌ తీయకు’ అంటాడు. ‘ ఈ ప్రేమ మనం ప్రేమించుకునే సమయంలో చూపించాల్సింది. ఇప్పుడుకాదు’ అంటే. ‘ అపు​డు నువ్వు నాతోనే ఉంటావనుకున్నా’ అని అంటాడు. ఏది ఏమైనా వాడికి ఇంకా అర్థం కావటం లేదు. రీసెంట్‌గా మిర్రర్‌ పగులగొట్టి చెయ్యి మొత్తం కోసుకున్నాడు. అర్థం చేసుకోవట్లేదు. నా మాట అస్సలు వినటం లేదు. ఈ విలువలు కట్టుబాట్లు తెంచుకుని నీ కోసం రాలేనురా! నన్ను క్షమించు.. దయచేసి నాపై కాకుండా నీ కెరీర్‌పై దృష్టి పెట్టు. నీకు మంచి వైఫ్‌ వస్తుంది. ఇదంతా నీకు అర్థం కావాలని కోరుకుంటున్నా. 
.. నీ లవ్‌లీ స్వీటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement