వాలెంటైన్స్‌ వీక్‌! ఈ వారం మీ ప్రేమ జాతకం | Weekly Love Horoscope In Telugu | Sakshi
Sakshi News home page

ప్రేమజాతకం 7-02-20 నుంచి 13-02-20వరకు

Published Fri, Feb 7 2020 9:48 AM | Last Updated on Fri, Feb 7 2020 11:53 AM

Weekly Love Horoscope In Telugu - Sakshi

మేషం : ఓర్పుతో తీసుకునే నిర్ణయాలు మీరు ఇష్టపడే వారిని ఆకట్టుకుంటాయి. శుక్ర, బుధవారాలు మీ అభిప్రాయాలను అవతలి వారికి వెల్లడించేందుకు అనుకూలం. అవతలి వారి వైపు నుంచి కూడా సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం. ఈ సమయంలో ఎరుపు, గులాబీ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.

వృషభం : మీరు ఇష్టపడే వారికి మీ ప్రేమను తెలియజేసేందుకు ఆది, గురువారాలు అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి కూడా అనుకూలత వ్యక్తవుతుంది. ఈరోజుల్లో మీరు ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు ధరించండి. ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, సోమ, బుధవారాలు ఇటువంటి వాటికి స్వస్తి చెప్పండి. 

మిథునం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ అభిప్రాయాలను శని, మంగళవారాలలో వెల్లడిస్తే మంచిది. అవతలి వారు కూడా అనుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు ఎరుపు, నేరేడు రంగు  దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం : మీ ప్రతిపాదలను ఇష్టులైన వారికి ఆది, గురువారాలలో వెల్లడించండి శుభదాయకంగా ఉంటుంది. అవతలి వారు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఈ సమయంలో మీరు గులాబీ, నేరేడు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి తూర్పుఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. 

సింహం : మీ మనస్సులోని భావాలను శుక్ర, శనివారాలలో ఇష్టపడే వారికి తెలియజేయండి ఆశింఛిన ఫలితం కనిపిస్తుంది. అవతలి వారు కూడా అనుకూల సమాచారం అందించే వీలుంది. ఈరోజుల్లో మీరు నీలం, తెలుపు రంగు దుస్తులు «ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, దక్షిణ ఆగ్నేయదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే, సోమ, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

కన్య : మీలోని భావాలను బుధ, గురువారాలు ఇష్టులకు తెలియజేయండి. వారి నుంచి  కూడా సానుకూల స్పందనలు రావచ్చు. మీ మంచితనం, ప్రేమను గుర్తిస్తారు. ఈ సమయంలో మీరు ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరండి శుభప్రదంగా ఉంటుంది. అయితే, ఆది, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.

తుల : మీరు ఇష్టపడే వారికి మీ మనస్సులోని అభిప్రాయాలను ఆది, బుధవారాలలో వెల్లడిస్తే ఫలితం ఉంటుంది. అవతలివారు మీ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేస్తారు. ఇటువంటి సమయంలో మీరు ఎరుపు, ఆకుపచ్చ రంగులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, మంగళవారాలు మీ ప్రతిపాదనలకు స్వస్తి చెప్పండి.

వృశ్చికం : మీ మనోగతాన్ని, అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. అవతలి వారు కూడా మీపట్ల ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తారు. ఈ సమయంలో మీరు గులాబీ, నేరేడు రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, సోమవారాలు వీటికి దూరంగా ఉండండి.

ధనుస్సు : మీరు ఇష్టపడే వారికి మీ ప్రతిపాదనలను శని, బుధవారాలు అందించండి. అవతలి వారు కూడా తగినట్లుగా స్పందించి ప్రేమను పంచే  వీలుంటుంది. ఈ సమయంలో మీరు ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అనుకూల ఫలితాలు ఉండవచ్చు. అలాగే, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి, శుభదాయకంగా ఉంటుంది. ఇక, ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.

మకరం : మీలోని భావాలను అత్యంత ఇష్టపడే వారికి తెలిపేందుకు శుక్ర, ఆదివారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రతిపాదనలకు అవతలి వారు కూడా అనుకూలంగా స్పందిస్తారు. ఈ సమయాల్లో మీరు పసుపు, గులాబీ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభవార్తలు వింటారు. ఇక, బుధ, గురువారాలు వీటికి స్వస్తి చెప్పండి. 

కుంభం : మీ అభిప్రాయాలు, ప్రేమసందేశాలను సోమ, బుధవారాలలో ఇష్టులకు తెలియజేయండి. అవతలి నుంచి కూడా మీరు ఊహించిన సందేశాలు రావచ్చు. అలాగే, ఇంటి నుంచి ఎరుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి ఉత్తరఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే, శని, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

మీనం : మీ ప్రతిపాదనలను, అభిప్రాయాలను ఇష్టపడే వారికి మంగళ, గురువారాలు వెల్లడిస్తే మంచిది. ఈ ప్రతిపాదనలను అవతలి వారు ఆమోదించే వీలుంటుంది. ఈ సమయంలో గులాబీ, పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, ఆదివారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement