మేషం : మీ మనోగతాన్ని ఇష్టులకు తెలిపేందుకు శని, ఆదివారాలు అద్భుతమైన రోజులని చెప్పవచ్చు. ఈ కాలంలో మీ ప్రయత్నాలు సఫలమై శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.
వృషభం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ భావాలను వ్యక్తం చేసేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. ఈ సమయంలో అవతలి వైపు నుంచి కూడా సానుకూల స్పందనలు రావచ్చు. ఈరోజుల్లో మీరు గ్రీన్, పింక్ రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది.
మిథునం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని అభిప్రాయాలను తెలిపేందుకు ఆది, సోమవారాలు అనుకూలమని చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సఫలమై అవతలి వారు కూడా అనుకూల సందేశాలు ఇచ్చే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభాలు కలుగుతాయి. అయితే, శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండడం ఉత్తమం.
కర్కాటకం : మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు చెప్పేందుకు మంగళ, బుధవారాలు అత్యంత అనుకూల సమయాలు. ఇటువంటి సమయంలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తే అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు చేసే రోజుల్లో గ్రీన్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలు విరమిస్తే మంచిది.
సింహం : మీ భావాలను మనస్సులోని వారికి తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ ప్రతిపాదనల సమయంలో మీరు ఎల్లో, బ్లాక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక, మంగళ, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.
కన్య : మీ అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు సోమ, మంగళవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలపై అవతలి వారి నుంచి అనుకూలత వ్యక్తం కావచ్చు. ఈ రోజుల్లో మీరు పింక్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు ప్రయత్నాలు విరమించడం మంచిది.
తుల : మీరు అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను తెలిపేందుకు శుక్ర, సోమవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి వైపు నుంచి కూడా సానుకూల వైఖరి వ్యక్తం కావచ్చు. ఈ సమయంలో మీరు గ్రీన్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. అయితే, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.
వృశ్చికం : మీలోని అభిప్రాయాలను మీరు ఇష్టపడే వారికి తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఇక ఈరోజుల్లో ఆరెంజ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, శని, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.
ధనుస్సు: మీ మనస్సులోని అభిప్రాయాలను మీరు ఇష్టపడే వారికి తెలియజేసేందుకు శుక్ర, సోమవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వ్యక్తుల నుంచి శుభవార్తలు అందే వీలుంటుంది. ఈ సమయంలో మీరు ఆరెంజ్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలలో ఈ వ్రయత్నాలు విరమించండి.
మకరం : మీరు కోరుకున్న వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు శని, గురువారాలు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. ఈ సమయంలో అవతలి వారు కూడా సానుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు వైట్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే మంచిది. అయితే, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.
కుంభం : మీ అభిప్రాయాలను ఇష్టమైన వారికి తెలిపేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా శుభవర్తమానాలు అందించే వీలుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే మంచిది. ఇక, మంగళ, బుధవారాలు మీ ప్రయత్నాలు విరమిస్తే మంచిది.
మీనం : మీరు కోరుకున్న వారికి మనస్సులోని అభిప్రాయాలను తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత శుభదాయకమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలపై అవతలి వ్యక్తులు సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి.
ప్రేమజాతకం... 13-03-20 నుంచి 19-03-20 వరకు
Published Fri, Mar 13 2020 1:39 PM | Last Updated on Fri, Mar 13 2020 3:31 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment