ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి! | Weekly Love Horoscope In Telugu | Sakshi
Sakshi News home page

ప్రేమ జాతకం 21-02-20 నుంచి 29-02-20 వరకు

Published Fri, Feb 21 2020 2:44 PM | Last Updated on Fri, Feb 21 2020 2:59 PM

Weekly Love Horoscope In Telugu - Sakshi

ప్రేమజాతకం.. 21.02.20 నుంచి 29.02.20 వరకు
––––––––––––––––––––––––––––––––
మేషం : మీకు ఇష్టులైన వారికి సందేశాలు అందించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతుంది. ఇక ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుముఖంగా బయలుదేరండి శుభాలు జరుగుతాయి. అయితే, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.

వృషభం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు సోమ, బుధవారాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శని, మంగళవారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది.

మిథునం: మీరు అత్యంత అభిమానించే వారికి మీ అభిప్రాయాలను తెలిపేందుకు బుధ, గురువారాలు అనుకూలమని చెప్పాలి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలివారి నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ఈ సమయంలో మీరు గ్రీన్, బ్రౌన్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక, శుక్ర,ఆదివారాలు వీటికి దూరంగా ఉండండి.


కర్కాటకం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శుక్ర, శనివారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అనుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయ దిశగా బయలుదేరండి. ఇక ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి.

సింహం: మీరు అత్యంత అభిమానించే వారికి మీ ప్రేమసందేశాలు అందించేందుకు శని, ఆదివారాలు అత్యంత సానుకూలమని చెప్పాలి. ఈరోజుల్లో మీకు అవతలి వైపు నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలు ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.


కన్య : మీ ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు ఇష్టులకు అందించేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజులలో మీరు పంపే ప్రతిపాదనలపై అనుకూల సందేశాలు రావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు వైట్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే, శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండండి.

తుల: మీ మనస్సులో దాగిన ప్రేమసందేశాలను అత్యంత ఇష్టపడే వారికి అందించేందుకు బుధ, గురువారాలు విశిష్ఠమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలివారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే ఇంటి నుంచి ఉత్తర ఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలు విరమించండి.

వృశ్చికం: మీరు ఆరాధించే వ్యక్తులకు మీ మనస్సులోని అభిప్రాయాలను వెల్లడించేందుకు శని, ఆదివారాలు అత్యంత అనుకూలం. ఈ రోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. ఇక, మంగళ, బుధవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

ధనుస్సు: మీ అభిప్రాయాలను, ప్రతిపాదనలు ఇష్టులకు తెలియజేసేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ప్రతిపాదనలు అందించే సమయంలో మీరు ఎల్లో, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి.

మకరం: మీ మనస్సులోని భావాలను మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే  అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో గ్రీన్, బ్రౌన్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. ఇక, శని, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. 

కుంభం: మీరు ఆరాధించే వ్యక్తులకు మీ ఆభిప్రాయాలను తెలియజేసేందుకు సోమ,మంగళవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు వైట్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, శని, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.

మీనం: మీ మనోగతాన్ని ఇష్టపడే వారికి తెలియజేసేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలమైనవిగా భావించాలి. ఈ సమయంలో మీ సందేశాలకు అవతలి వైపు నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ఇటువంటి సమయంలో పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, ఆది, సోమవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement