ప్రతీకాత్మక చిత్రం
మాది మధ్య తరగతి కుటుంబం! నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. నేను స్కూల్‌కు వెళ్లే దారిలోనే వాళ్ల ఇళ్లు కూడా ఉండేది. తను కూడా మా ఊరే! నేను పదిలో ఉన్నపుడు తన ఇంటర్ అయిపోయింది. నేను స్కూల్‌కి వెళ్లే టైంకు నా బస్ కోసం ఎదురు చూసేవాడు. అలా ఓ సంవత్సరం ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నాం. అలా ఓ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో ఒకసారి కూడా మేము మాట్లాడుకోలేదు. కానీ, మా కళ్లు చాలా మాట్లాడుకునేవి. తనకి డిఫెన్స్‌లో జాబ్ వచ్చింది. నేను అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నా. తను జాబ్ వచ్చి మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతున్నాడు. అపుడు తను నాకు డేర్ చేసి నెంబర్ ఇచ్చాడు. అప్పటినుంచి మేము ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. అలా మా మధ్య తెలియకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి. తను ఎప్పుడు ఇంటికి వస్తాడా.. ఎప్పుడు తనని చూస్తానా అని చాలా వేయిట్ చేసేదాన్ని. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న మా జీవితం ఒక్కసారిగా తల్లక్రిందులైంది.
వాళ్ల ఇంట్లో మా లవ్ మ్యాటర్ తెలిసిపోయింది. వాళ్ల పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఎంత చెప్పి చూసినా వాళ్లు వినలేదు. అయినా మేము మాట్లాడుకోవటం మానుకోలేదు. ఎప్పటికైనా ఒప్పుకుంటారని చిన్న ఆశ. మా ఇంట్లో మా అమ్మకు మాత్రమే ఈ విషయం తెలుసు. తర్వాత తను కూడా నా నెంబర్ బ్లాక్ చేశాడు. నేను వేరే నెంబర్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒక రోజు మా ఫ్రెండ్ నెంబర్ నుండి కాల్ చేశాను. అప్పుడు లిఫ్ట్ చేశాడు. ‘‘ నన్ను వదిలేయ్! నీకే మంచిది. లేకపోతే నువ్వే చాలా బాధపడతావు. నేను మా ఇంట్లో వాళ్లని కాకుండా నిన్ను పెళ్లి చేసుకోలేను.’’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను మళ్లీ చాలా సార్లు కాల్ చేశాను.
కానీ, నో రిప్లై. నేను బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నపుడు అతనికి వేరే అమ్మాయితో పెళ్లైంది. ఆ విషయం తెలిసాక నేను చాలా బాధపడ్డాను. మా అమ్మతో చెప్పి ఏడ్చేదాన్ని. అలా ఏడుస్తూనే నా బీటెక్ కంప్లీట్ చేశాను. నన్ను చేసుకోకపోయినా పర్లేదు తను హ్యాపీగా ఉంటే చాలు అనుకునేదాన్ని. కానీ, లోపల చాలా బాధపడ్డాను. నా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇంకా బ్రతికేఉన్నా. వాళ్ల ఆశలన్నీ నా మీదే పెట్టుకుని ఉన్నారు. మా లవ్ విషయం ఇంత వరకు మా నాన్నకు తెలియదు. తనది కూడా మా ఊరే కాబట్టి ఎప్పడైనా భార్యతో చూసినపుడు నాకు చాలా బాధవేసేది.
నేను ఉండాల్సిన స్థానంలో వేరే అమ్మాయి ఉందేఅని. బీటెక్ అయిపోయిన వెంటనే క్యాంపస్ సెలక్షన్‌లో నాకు మంచి జాబ్ వచ్చింది. జాబ్, నా ఫ్యామిలీ ఇదే నా లైఫ్ అయిపోయింది. నాకు సడెన్‌గా ఒక రోజు తన నుండి ఫోన్ వచ్చింది. నేను లిఫ్ట్ చేసి మాట్లాడాను. ‘ నేను నీకు చాలా మోసం చేశాన్‌రా! నువ్వు నాకు కావాలి. నిన్ను పెళ్లి చేసుకోనందకు దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు.’ అని ఏడ్చాడు. నేను ఏమైందని అడిగా. ‘ నా వైఫ్ నన్ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తన క్యారెక్టర్ అసలు మంచిది కాదు. మా పేరేంట్స్ చెప్పారని పెళ్లి చేసుకున్నా. సరేరా నాక నువ్వు కావాలి. మనం పెళ్లి చేసుకుందాం.’ అని అన్నాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక కాల్ కట్ చేశా. తను నాకు మళ్లీ కాల్ చేశాడని మా అమ్మకు చెప్పలేదు.
ఎందుకంటే అతను వేరే అమ్మాయిని చేసుకున్నపుడు నా కంటే తనే ఎక్కువగా బాధపడింది. ఒక పక్క తనకు అలా అయ్యిందనే బాధ, ఇంకో పక్క తనని పెళ్లి చేసుకుంటే మా పేరేంట్స్‌కు చెడ్డపేరు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. లాస్ట్‌కు నా లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుందో నాకే అర్థం కావటం లేదు. కానీ, నేను మాత్రం ఈ సారి మా అమ్మని బాధపెట్టాలని అనుకోవటం లేదు. ఈ విషయం మా అమ్మకు చెప్పి మా అమ్మ ఏం చెయ్యాలని చెప్తే అదే చెయ్యాలని డిసైడ్ అయ్యా. నేను చేస్తోంది కరెక్టో రాంగో నాకు తెలియడంలేదు. మా పేరేంట్స్‌ను ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయ్యా. నా జీవితం మా పేరేంట్స్ మీద ఆధారపడి ఉంది.
- అనిత, కడప
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment