ప్రతీకాత్మక చిత్రం
నాకు మా మామయ్య ఆది నారాయణ అంటే చాలా ఇష్టం. ఆయన చిన్న కూతురు దుర్గ శ్రీ అంటే చెప్పలేని ప్రేమ. తను ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను తనకి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేయగానే నా వైపు చాలా కోపంగా చూసింది. ‘నువ్వంటే నాకూ ఇష్టమే! కానీ, మా నాన్నని అడుగు’ అంది. నాకు మా మామయ్యను నేరుగా అడిగేంత ధైర్యం లేదు. ఆయనను అడిగితే ఏం అంటాడేమోనని భయమేసింది. ఒక సారి మా మామయ్య పెద్ద అల్లుడు శ్రీను అన్నతో అడిగించాను. అప్పుడు మామయ్య అన్నాడట ‘వాడంటే నాకూ ఇష్టమే’ అని. ఈ విషయమే అన్న నాకు చెప్పాడు.
ఇక నా ఆనందానికి అవధులు లేవు. తను కూడా నా ప్రేమని అంగీకరించింది. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు. తనకి ఓ వాలెంటైన్స్ డేన చాక్లెట్ ఇస్తే వద్దు అంది. ‘ఎందుకు వద్దు’ అని అడిగాను. అప్పుడు ఇలా అంది ‘ప్రతి ప్రేమికుల దినోత్సవం రోజున ఒక 5గురు అనాథ పిల్లలకి భోజనం పెడదాం’ అని. అప్పుడు నేను తనని హగ్ చేసుకుని ‘చాలా మంచి ఆలోచన’ అని చెప్పి ‘అలానే చేద్దాం’ అన్నాను. అప్పటినుండి ప్రతి వాలెంటైన్స్ డేకు ఐదుగురు అనాథ పిల్లలకి భోజనం పెట్టేవాళ్లం. ఈ వాలెంటైన్స్ డేన కూడా అలానే చేస్తాం.
- సుబ్బు, పెద్ద దేవరంపాడు
Comments
Please login to add a commentAdd a comment