
చిన్నప్పటినుంచి నేను, సౌమ్య (పేరు మార్చాం) ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. 9వ తరగతిలో ఉన్నప్పుడూ నువ్వంటే ఇష్టమని, నేను నిన్ను లవ్ చేస్తున్నా అంది. తనంటే నాకు కూడా చాలా ఇష్టం. అలా మా ప్రేమ ఇంటర్ వరకు హ్యాపీగా సాగింది. ఒకరోజు మా గురించి వాళ్ల అక్కకి ఎవరో చెప్పారు. దీంతో చాలా గొడవలు జరిగాయి. ఆ మరుసటి రోజే తను మా ఇంటికి వచ్చింది. తనకు ఎలాగోలా సర్ది చెప్పి వాళ్లింటికి పంపాను. తర్వాత సౌమ్యని కాలేజీ మాన్పించేశారని తెలిసింది. ఈ గొడవల వల్ల అలా జరిగిందేమో, కొన్ని రోజులకి అంతా మామూలైపోతుందిలే అనుకున్నా.
కానీ అదే సంవత్సరం సౌమ్యకి పెళ్లి సంబంధాలు చూడటం, పదిహేను రోజుల్లో పెళ్లి..ఇలా అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. అప్పుడు నాకు 17 సంవత్సరాలు. ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి. తన ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేశారు అని చాలా బాధపడ్డా. ఐదేళ్ల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో తనని చూడగానే కన్నీళ్లు ఆగలేదు. నా వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది కదా అని నా మీద నాకే కోపమొచ్చింది. తను ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీ శివ రాథోడ్.
--శివ రాథోడ్