
ప్రతీకాత్మక చిత్రం
ఫేసు చూసి వారి క్యారెక్టర్ చెప్పేయటం మనలో చాలా మందికి అలవాటు. అయితే ‘డోన్ట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అన్నట్లు కొందరి విషయంలో మన అంచనాలు తప్పొచ్చు. కానీ, కొంతమంది మగాళ్ల ముఖతీరును బట్టి వారి స్వభావాన్ని చెప్పేయొచ్చని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా బలమైన దవడలు, చిన్న పెదాలు ఉన్నవారు భాగస్వాములను ఎక్కువగా మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారని వెల్లడైంది. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్సెస్‌లో ఈ సర్వే ప్రచురితమైంది. కొంతమంది పరిశోధకుల బృందం దాదాపు 1500 మంది మగ,ఆడవారిపై ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. వీరంతా 18నుంచి 75 సంవత్సరాల వయసు కలిగిన వారే. 299 మంది మగవారి ఫొటోలను 452 మంది ఆడవారికి చూపించి వారెలాంటి వారో చెప్పాలని కోరారు. అంతేకాకుండా ఆ మగవారు ఎంత తరచుగా మోసాలకు పాల్పడతారో రేటింగ్ ఇవ్వమన్నారు.
‘మీరు ఎంత తరచుగా ఇతరుల భాగస్వాములను లోబర్చుకోవటానికి చూస్తారు’ అంటూ ఆ 299 మంది మగవారినే అడిగారు. మగవారు చెప్పిన వివరాలు ఆడవారు చెప్పిన వివరాలతో సరిపోలాయి. దీంతో మగవారి ముఖతీరును బట్టే వారి స్వభావాన్ని అంచనా వేయొచ్చని తేలింది. అయితే ఇదే సర్వేను ఆడవారిపై నిర్వహించినపుడు వారి ముఖతీరును బట్టి ఓ అంచనాకు రాలేమని తేలింది. కాగా, వ్యక్తుల స్వరాన్ని బట్టి వారు మంచివారా కాదా అన్నది అంచనా వేయొచ్చని మరో సర్వేలో తేలింది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment