
ప్రతీకాత్మక చిత్రం
నేను బీ ఫార్మసీ కోసం ఓ కాలేజ్‌లో అయిష్టంగానే కాలు మోపా. కానీ, మా కాలేజ్‌లో ర్యాంక్ పరంగా నేను టాప్. అంతే కాదు, నేను మా క్లాస్ సీఆర్ ఎలక్షన్లో 50 ఓట్లతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. దీలీప్ అనే మా ఫ్రెండ్ ద్వారా తన అల్లరి గురించి విన్నా. ఆ రోజు మా క్లాస్‌కి ఫేస్‌బుక్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో ఫ్రెండ్‌కు ఫ్రెండ్ ద్వారా ఆడ్ అయిన తను వెంటనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఇక అప్పటినుంచి రాత్రి రెండు వరకు చాటింగ్ చేసుకునే వాళ్లం. తను నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టక ముందు ఆమె పేరుతో ఓ ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసి మా ఫ్రెండ్‌కి రిక్వెస్ట్ పెట్టా. వాడితో ఆడుకుందామని. ఆ తర్వాత తను పరిచయం అయ్యాక తప్పు తెలుసుకుని ఇద్దరికీ నిజం చెప్పా. ఆ సంఘటనతో మా పరిచయం మరింత పెరిగింది. ఆ పరిచయం కాస్తా నా వైపు నుంచి ప్రేమగా మారింది. ఓ రోజు ధైర్యం చేసి ఆమెకు నా ప్రేమ విషయం చెప్పేశా. అంతే! ఆ వారం రోజులు మా ఇద్దరికీ మాటలు లేవు.
తర్వాత ఓ పోలీస్ క్యాంపు ద్వారా మళ్లీ ఇద్దరం కలిశాం. పరిచయం మరింత పెరిగింది. అది ఎంతలా అంటే! చాట్‌నుంచి ఫోన్ల వరకు వచ్చింది. ఇద్దరం కలిసి క్లాస్‌కు బంక్ కొట్టి ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాళ్లం. ఒకసారి ఇద్దరం ఓ గుడికి కూడా వెళ్లాం. నా పుట్టినరోజు నాడు 12 గంటలకు ఫోన్ చేసి విష్ చేసింది. వాలుమ్‌తే(కొరియన్‌లో ఐ లవ్ యూ) అని చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. కానీ, మరుసటి రోజు తను ఫోన్ చేసి ‘ అది కేవలం నీ పుట్టిన రోజు నాడు సంతోష పెడదామని చెప్పా’ అంది. నా మదిలో ఓ కొంటె తలుపు తను సిగ్గుపడుతోందిలే అని. ఇంతలో మా ఫస్ట్ ఇయర్ ఎక్షామ్స్ దగ్గర పడ్డాయి. నేను టాపర్‌ను అయ్యేసరికి రాత్రి నేను చదివి తనకు వివరించేవాడ్ని.
ఒక రోజు మా మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. తను పాపం సారీ చెప్పటానికి ఫోన్ చేసింది. నేను ఆ టైంలో తాగేసి ఉన్నా. మత్తులో తనను తిట్టేశా. అంతే అప్పుడు బ్రేక్ అయిన మా బంధం ఇప్పటికీ కలవలేదు. నేను అప్పటినుంచి మందుకు బానిసయ్యా. క్లాస్‌కు కూడా తాగేసి వెళ్లటం, సార్లతో ర్యాస్‌గా ప్రవర్తించటం చేసేవాడిని. దీంతో ఓ ఆరు నెలలు సస్పెండ్ అయ్యా. ఫన్నీ గాయ్‌ని కాస్తా ఫ్రస్టేటెడ్ గాయ్‌గా మారాను. అలా నాలుగు సంవత్సరాల నుంచి వేయిట్ చేస్తున్నా. తన కోసం మా ప్రేమ కథను చిన్న కథలా ఓ సినిమా తీయబోతున్నాను. ఇంకో మూడు నెలల్లో నా ఫైనల్ ఇయర్ అయిపోతుంది. ఇక నా కనులు తన రూపును చూడలేవు.. నా మనసు తన నవ్వును, నా చెవులు తన మాటలను వినలేవు.
నా ఈ అలుపెరుగని ప్రేమ కథకు ముగింపు పడనుంది. ఈ సందర్భంగా నా బాధలో, నవ్వులో తోడుగా ఉన్న నా ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు. ఫైనల్‌గా నేను నీకో మాట చెప్పాలనుకుంటున్నా మన మొదటి ఎఫ్‌బీ పరిచయం, ఆ తర్వాత చాట్, కాల్స్, ట్రూత్ ఆర్ డేర్ గేమ్, టెంపుల్‌కు వెళ్లటం, చిలకజోష్యం, ఎక్షామ్స్, సీనియర్‌తో నీ గొడవ, వాష్ రూంలో గొడవ, నేను నీ బర్త్‌డేకి నేనిచ్చిన టెడ్డీ, నా బర్త్‌డేకి నువ్విచ్చిన గిఫ్ట్, గురు సినిమాకు వెళ్లి సినిమా చూడకుండా ఇంటర్‌వెల్ వరకు నీతో మాట్లాడుతూ గడిపిన రోజు, నేను నీకు చేసిన ప్రపోజల్, ఇచ్చిన లవ్ లెటర్, టెంప్టేషన్ ఆల్మండ్, నీ ఫ్రెండ్‌గా నాకు పరిచయం అయిన మన జూనియర్, తనతో ముచ్చట్లు, ఫైనల్‌గా మన గొడవ... అన్నీ అలా నా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఇంకొన్ని రోజులే నేను నిన్ను చూసేది. గుర్తు చేసుకుంటే నా కళ్లు తడుస్తున్నాయ్. ఐ లవ్ యూ ఫరెవర్.. మహి
- శ్రీకాంత్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment