ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి! | Weekly Love Horoscope In Telugu | Sakshi
Sakshi News home page

ప్రేమ జాతకం 03-01-20 నుంచి 09-01-20 వరకు

Published Fri, Jan 3 2020 11:20 AM | Last Updated on Fri, Jan 3 2020 12:16 PM

Weekly Love Horoscope In Telugu - Sakshi

మేషం : ఈ రాశి వారు ఇష్టమైన వారికి ప్రేమ సందేశాలు అందించేందుకు, పెళ్లి ప్రతిపాదనలు చేసేందుకు ఆది, గురువారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై ఆవతలి వారు కూడా సానుకూలత వ్యక్తం చేయవచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, రెడ్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్యదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక శని, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

వృషభం : మీ భావాలను ప్రియమైన వ్యక్తులకు తెలియజేసేందుకు శని, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజులలో మీరు అందించే ప్రతిపాదనలకు ఆవతలి నుంచి ఆమోదం లభించే వీలుంటుంది. ఈ సమయాల్లో మీరు గ్రీన్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే ఫలితం కనిపిస్తుంది. అయితే ఆది, గురువారాలు మౌనం వహించడం మంచిది.

మిథునం : మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలు మీరు కోరుకున్న వ్యక్తులకు అందించేందుకు శుక్ర, గురువారాలు అత్యంత అనుకూల కాలమని చెప్పాలి. ఈ సమయంలో మీ సందేశాలపై ఆవతలి వారి నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. ఈ రోజుల్లో మీరు ఎల్లో, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే,  ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభసూచకాలే. ఇక సోమ, మంగళవారాలు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం : ఇష్టమైన వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, మంగళవారాలు అత్యంత అనుకూలమైన సమయాలు. ఈ రోజుల్లో  మీరు చేసే ప్రతిపాదనలకు స్పందించి అనుకూల సమాచారాలు వచ్చే వీలుంది. అలాగే, ఈ సమయంలో మీరు రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక శని, సోమవారాలు ఇటువంటి ప్రతిపాదనలు చేయకుండా ఉండడమే మంచిది.

సింహం : మీకు ఇష్టులైన వారికి ప్రేమ ప్రతిపాదనలు చేయటానికి సోమ, బుధవారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై ఆవతలి వారి నుంచి సానుకూల స్పందనలు రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు పింక్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరితే మంచిది. ఇక శుక్ర, ఆదివారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

కన్య : మీ మనస్సులోని భావాలను ఇష్టమైన వారికి తెలిపేందుకు శుక్ర,శనివారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ అభిప్రాయాలను ఆవతలి వారు మన్నించే అవకాశముంది. ఇటువంటి సమయంలో ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. కాగా, ఆది, మంగళవారాలు మీ ప్రతిపాదనలపై మౌనం వహించడం మంచిది.

తుల : మీ అభిప్రాయాలను ఇష్టులకు వెల్లడించేందుకు శని, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీపై ఆవతలి వైపు నుంచి కూడా అనుకూల వైఖరి స్పష్టం కావచ్చు. ప్రతిపాదనల సమయంలో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే మంచిది. ఇక మంగళ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.

వృశ్చికం : మీ మనస్సులోని భావాలు ఇష్టమైన వారికి వెల్లడించేందుకు ఆది, మంగళవారాలు అనుకూలం. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలకు ఆవతలి వారు అనుకూలత వ్యక్తం చేసే వీలుంది. ప్రేమ ప్రతిపాదనలు చేసే సమయంలో మీరు పింక్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే సత్ఫలితాలు ఉండవచ్చు. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి.

ధనుస్సు : మీరు ఎంతగానో ఇష్టపడే వారికి ప్రేమ సందేశాలు అందించేందుకు బుధ,గురువారాలు అనుకూలమైన రోజులు. ఈ సమయంలో మీ సందేశాలకు ఆవతలి వారి నుంచి అనుకూల స్పందనలు వచ్చే వీలుంటుంది. అలాగే ప్రపోజ్‌ చేసే సమయంలో రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ దిశగా ఆగ్నేయదిశగా బయలుదేరితే మంచిది. ఇక శని, సోమవారాలు వీటికి దూరంగా ఉండండి.

మకరం : మీ ప్రియమైన వారికి మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శుక్ర, గురువారాలు అత్యంత అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలకు ఆవతలి వారు సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఈ సమయంలో మీరు వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభవార్తలు వింటారు. అయితే ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

కుంభం : మీ అభిప్రాయాలు ఇష్టమైన వారికి తెలియజేసేందుకు ఆది, సోమవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలపై మీరు కోరుకున్న వ్యక్తుల నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు బ్లూ, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి ఉత్తరఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక శని, గురువారాలు మీ ప్రతిపాదనలకు విరామం ఇవ్వండి.

మీనం : మీరు అభిమానించే వారికి మీ మనస్సులోని భావాలను తెలియజేసేందుకు శుక్ర, బుధవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు ఆవతలి వారు సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. అలాగే, ఇటువంటి సమయాల్లో మీరు పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే, ఆది, గురువారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement