
నా పేరు శ్రీనివాసులు. మాది నెల్లూరు. నేను వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్. ఒక రోజు పని మీద ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. తను చాలా అందంగా ఉండేది. తను ఎదుటివారి పట్ల చూపించే గౌరవం చాలా నచ్చింది. అలా అమ్మాయిని చూస్తూ చూస్తూ నేను ప్రేమలో పడ్డాను. వాళ్ళ ఇంటి దగ్గర్లోనే మేము కూడా ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక అప్పటి నుంచి వాళ్లతో పరిచయం పెరిగింది. అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్లడం వాళ్ళతో మాట్లాడడం జరిగేది. ఒక రోజు నేను దైర్యం చేసి తన ఫోన్ నెంబర్ అడిగాను, కానీ తను ఇవ్వలేదు. ఎలాగోలా నెంబర్ తెలుసుకున్నాను. ఇక అప్పటి నుంచి తనతో ప్రతి రోజు మాట్లాడే వాడిని.
మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది అయినా తను నాతో మాట్లాడకుండా ఉండేది కాదు. అలా మా ప్రేమ ఆరు నెలల పాటు సంతోషంగా సాగింది. తర్వాత వాళ్ళ బంధువుల అమ్మాయి మా ఇద్దరి గురించి చెడ్డగా ఊరిలో ప్రచారం చేసింది. అయినా కూడా తను నాతో మాట్లాడకుండా ఉండేది కాదు. అలా ఒక రెండు నెలల పాటు చాలా హ్యాపీగా ఉన్నాం. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ తను నాకు ఫోన్ చేయడం మానేసింది. కొన్ని రోజులకు నా ఫోన్ చేసి నాకు పెళ్లి కుదిరింది నాకు ఫోన్ చేయవద్దు అని చెప్పింది. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను ఎక్కడ ఎప్పుడు చూసినా నీ ముఖం పై చిరునవ్వు ఉండాలని కోరుకుంటున్నాను. నిరంతరం నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను.
ప్రేమతో
-- నీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment