ప్రతీకాత్మక చిత్రం
మాది సిద్దిపేట జిల్లా! 2003లో ఓ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఒకరితోఒకరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. అందరు ప్రేమికుల్లానే మమ్మల్ని కూడా సమస్యలు వెంటాడాయి. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయే సరికి నేను ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించా. అయితే కొద్ది కాలానికే తనకు వేరే వ్యక్తితో పెళ్లైంది. ఆ తర్వాతి నుంచి ఎవర్నీ ప్రేమించకూడదని డిసైడ్ అయ్యా. 2014లో ఓ పని మీద మలేషియా వెళ్లాను. అక్కడే నాకు మంచి ఉద్యోగం కూడా దొరికింది.
2017లో కొత్తగా ఓ అమ్మాయి మా ఆఫీసులో చేరింది. మేమిద్దరం ఒకే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండటం వల్ల ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. తనకు ఇది వరకే పెళ్లై విడాకులు కూడా అయ్యాయి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అది తెలిసినా కూడా నేను తనతో ప్రేమలో పడ్డా. తను దానికి ఒప్పుకోలేదు. ఒంటరిగా ఉండటానికే సుముఖత వ్యక్తం చేసింది. తను మా ఆఫీసు వదలి వెళ్లిపోయింది. అయినా తనతో టచ్‌లోఉన్నా. ఇదివరకటికంటే క్లోజ్‌గా ఉంటున్నాం. ఆమె తన పిల్లలను నాకు పరిచయం చేసింది. వాళ్లు చూడముచ్చటగా ఉన్నారు.
తను నా ప్రపోజల్‌ను అంగీకరించలేదు. అలాగని తిరష్కరించనూ లేదు. తనెప్పుడూ ఓ మాట అనేది‘ భవిష్యత్ ఏంటో మనకు తెలీదు’ అని. ప్రతీరోజూ ఈ మాటను నేను వల్లెవేసుకుంటున్నాను. భవిష్యత్తులో తను అంగీకరిస్తుందో లేదో తెలియదు. కానీ, తను ఒప్పుకుంటుందనే నమ్మకంతోటే ఉన్నా. ఈ కొత్త సంవత్సరం నేను అనుకున్నట్లు నా జీవితంలో సంతోషాలను నింపుతుందా లేక, నా జీవితమే ముగుస్తుందా..
- సునీల్ కుమార్, మలేషియా
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment