తన పేరు మౌనిక (పేరు మార్చాం). టెన్త్ క్లాస్‌లో తనతో ప్రేమలో పడిపోయా. అది ప్రేమో ఏమో కూడా తెలియని వయసు. కానీ తనంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఆరేళ్లలో తను నా ప్రేమని అంగీకరించడం, అలా వన్‌సైడ్ లవ్ కాస్తా టూ సైడ్ లవ్‌గా మారింది. తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ మళ్లీ నన్ను ఒంటరి వాడ్ని చేసి వెళ్లిపోయింది. తన ఙ్ఞాపకాలతో రోజులు కూడా సంవత్సరాలుగా గడిచేవి. అలాంటి నా జీవితంలో మళ్లీ ప్రేమ చిగురించేలా చేసింది మానస (పేర్లు మార్చాం). మా ఆఫీస్‌లో నా సీనియర్ తను. నేను ఉద్యోగంలో చేరిన ఆర్నెళ్ల తర్వాత కానీ తనతో మట్లాడే అవకాశం రాలేదు. ఎలాగోలా తన నెంబర్ సంపాదించా. మెసేజ్‌లతో ప్రారంభమై.. తర్వాత రెగ్యులర్‌గా ఫోన్ చేసేవాడ్ని. నువ్వంటే నాకిష్టం అని చెప్పాలనిపించేది. కానీ ఏదో సందిగ్దత.
తనకి నా ప్రేమను ఎలా వ్యక్తపరచాలో ఆలోచించేలోపే తనకి ఎవరేం చెప్పారో తెలీదు కానీ నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. నిన్ను ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఊహించుకోలేను నీకు వేరే ఉద్దేశం ఉంటే మనం మాట్లాడుకోకూడదు అని చెప్పేసి మాట్లాడటం ఆపేసింది.. కాని తనకి ఎలా చెప్పాలో అర్దం కావడం లేదు నేను తన కోసం ఏదైనా చేస్తా అని. నా జీవితంలో తనను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేను. తన కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను. ఎప్పటికైనా తను నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఓ ప్రేమ పిపాసి
Comments
Please login to add a commentAdd a comment