ప్రతీకాత్మక చిత్రం
నేను 2010లో 10వ తరగతి మా మావయ్య వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నా. మావయ్యకి ఒక అమ్మాయి ఉంది. తన పేరు రేణుక తను నా కన్నా 2 ఏళ్లు చిన్నది. తనంటే నాకు చాలా ఇష్టం! నేనంటే కూడా తనకి చాలా ఇష్టం. మేము ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్లం. నా 10వ తరగతి అయిపోయాక నేను మా ఊరికి వెళ్లిపోయా. వాళ్ల ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నా మరదలే గుర్తొచ్చేది. తనకి ఎలాగైనా నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నా. ఒక రోజు వాళ్ల ఇంటికి వెళ్లా. ’నీతో మాట్లాడాలి’ అని అన్నా. తను ‘ఏంటి చెప్పు!’ అంది. నాకు ధైర్యం చాలలేదు.. చాలా భయం వేసింది. మేము భోజనం చేసే టైమ్‌లో నా దగ్గర ఉన్న కీ పాడ్ సెల్ ఫోన్‌లో ఐ లవ్ యూ సింబల్స్ చూపించా. అది చూసి నా మరదలు ‘ఏంటి’ అని నవ్వింది. నేను కొంచెం ధైర్యం చేసి ‘నేను నిన్ను ప్రేమస్తున్నాను’ అని చెప్పేశా. తను ఏం మాట్లాడలేదు. ఆ రోజు నేను మా ఇంటికి వెళ్లిపోయాను.
రెండురోజుల తర్వాత తను నాకు ఫోన్ చేసింది! వాళ్ల నాన్న ఫోన్ నుండి. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది 2010 నవంబర్ 15. ఆ రోజు తను ఫోన్ చేసి ‘నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం’ అని చెప్పింది. ఇక చూడు నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ రోజు అంతా నిద్ర కూడా పట్టలేదు. తన గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది. 2012లో నేను పాలిటెక్నిక్ మూడో సంవత్సరం. తనేమో పదో తరగతి చదువుతోంది. అప్పుడే మా విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది. మా మావయ్య నా మరదలని కొట్టాడు కూడా. ఇంట్లో ఎంత తిట్టినా, కొట్టినా నేనే కావాలని చెప్పేసింది. ‘పెళ్లంటూ చేసుకుంటే బావనే చేసుకుంటా’ అని చెప్పింది.
ఆ రోజు నుంచి వాళ్ల ఇంటికి వెళ్లడం మానేశా. ఓ సంవత్సరంనర్ర పాటు మేము ఒకరినొకరం కలవలేదు, మాట్లాడుకోలేదు. మా ప్రేమ గురించి మా ఇంట్లో.. వాళ్ల ఇంట్లో మా బంధువులందరికీ తెలిసిపోయింది. 2013లో పాలిటెక్నిక్ కంప్లీట్ అయ్యాక నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఆ అమ్మాయిని తలుచుకుంటూ అలా రోజులు గడిచిపోయాయి. తను ఇంటర్ కాలేజ్‌లో జాయినయ్యింది. ఒకరోజు తను నాకు ఫోన్ చేసింది. వాళ్ల ఫ్రెండ్ మొబైల్ నుంచి. ఆ రోజు మేము చాలా మాట్లాడుకున్నాం. వాళ్ల ఇంట్లో ఏమంటున్నారో చెప్పింది. ‘తనకి ఇష్టమైన వాళ్లనే ఇచ్చి పెళ్లి చేస్తా’ అని వాళ్ల నాన్న అన్నాడని చెప్పింది. నాకు చాలా ఆనందం వేసింది.
అప్పటినుంచి మేము మళ్లీ డైలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునే వాళ్లం. నేను డైలీ వాళ్ల కాలేజీ దగ్గరకు వెళ్లి కలిసేవాడిని. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. 2015లో నేను ఇంటిదగ్గరలో జాబ్ చేస్తే వాళ్ల నాన్నకి ఎక్కువుగా కనిపిస్తూ ఉంటానని హైదరాబాద్‌లో జాబ్ చూసుకుని వెళ్లిపోయా. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది. 2018 నా మరదలు డిగ్రీ అయిపోయింది. తనకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. విప్రో కంపెనీ హైదరాబాద్‌లో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను హైదరాబాద్ వచ్చేసింది. మేము డైలీ మీట్ అయ్యేవాళ్లం. ఫోన్ కాల్స్, మెసేజెస్ ఇలా మేము చాలా దగ్గరైపోయాం.
- రాజు, కాకినాడ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment