ప్రతీకాత్మక చిత్రం
2016 అక్టోబర్ 12న ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా తనతో పరిచయం ఏర్పడింది. తను నా ఫ్రెండ్ వాళ్ల కజిన్ సిస్టర్. ఉద్యోగం కోసం నా ఫ్రెండ్ తనకు నా ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వమంది. అందుకే తను నాకు మెసేజ్ చేసింది. వాట్సాప్‌లో తన డీపీ చూడగానే తనతో ప్రేమలో పడిపోయా. బహుశా అది లవ్ ఆట్ ఫస్ట్ సైట్ అనుకుంటా. ఇలా డైలీ మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో మా పరిచయం ప్రేమగా మారింది. ఓ రోజు నేను తనకు ప్రపోజ్ చేశా. తను నా ప్రేమను అంగీకరించింది. ఓ సంవత్సరం పాటు డీప్ లవ్‌లో ఉన్నాము. లేట్ నైట్ చాటింగ్స్, ఫోన్లు మాట్లాడుకునేవాళ్లం. ఓ రోజు నేను మా పేరెంట్స్‌కు మా ప్రేమ విషయం చెప్పేశాను. మా వాళ్లు ఒప్పుకున్నారు.
మా పేరెంట్స్ వెళ్లి తన పేరెంట్స్‌తో మాట్లాడారు. అయితే వాళ్లు ఒప్పుకోలేదు. మేము మా పేరెంట్స్‌కు తెలియకుండా మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. తను ఎప్పుడైనా నన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉండేది. కానీ, నేను కొద్దిగా టైం తీసుకుని పెళ్లి చేసుకుందాం అని కన్విన్స్ చేస్తూ వచ్చాను. అలా 2019 ఆగస్టు వరకు టైం వేస్ట్ చేశాను. తను సడెన్‌గా నా మెసేజ్‌లకు, కాల్స్‌కు రిప్లై ఇవ్వటం మానేసింది.
నేను తన రిప్లై కోసం ఓ రెండు, మూడు రోజులు ఎదురుచూశాను. కానీ, లాభం లేకపోయింది. నేను వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న కారణంగా తనని నేరుగా కలవటం వీలుకాలేదు. ఓ వారం తర్వాత తనని కలిశాను. ‘ఏంటి ప్రాబ్లమ్’ అని తనని అడిగా.’ అప్పుడు తను ‘నాకు ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయింది.’ అని షాకింగ్ న్యూస్‌ను కూడా చాలా కూల్‌గా చెప్పింది. ఆ నిమిషం నేనేం చేయాలో అర్థం కాలేదు. తనను కన్విన్స్ చేయటానికి చాలా ట్రై చేశాను. తను ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఫోన్ నెంబర్ మార్చేసింది.
నేరుగా వాళ్ల ఇంటికి వెళితే.. తన పేరెంట్స్ నన్ను తనతో మాట్లాడనివ్వటం లేదు. గత డిసెంబర్ 12న తన ఎంగేజ్‌మెంట్ అయింది. ఇప్పటికీ నేను తనని ప్రేమిస్తున్నాను. ఈ బాధనుంచి నేనెలా బయటపడాలో అర్థం కావటం లేదు. అమ్మాయిలు మారిపోవటానికి ఒక్కక్షణం కూడా పట్టదు. తను మాత్రం చాలా హ్యాపీగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. నా గురించి ఒక్క నిమిషంకూడా ఆలోచించలేదు. నేను మాత్రం తన ప్రేమలోనుంచి బయటకు రాలేకపోతున్నా. ఇప్పటికైనా తను నాకోసం వస్తుందనే నమ్మకంతో..
- శ్రీకాంత్‌రెడ్డి, కడప
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment