ప్రతీకాత్మక చిత్రం
నేను చిన్నప్పటినుంచి హాస్టల్‌లో ఉండేవాడిని. అయితే అక్కడ ఉండలేక ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు హాస్టల్‌నుంచి వచ్చేశా. కొత్తగా ఒక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చేరా. రోజూ ఇంటికి వెళ్లి వచ్చేవాడిని. అక్కడ అంతా కొత్తపరిచయాలు. అప్పుడే నాకో అమ్మాయి బాగా నచ్చింది. పేరు శ్రవంతి! ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయికి సైట్ కొట్టని వారు లేరు. నేను కొద్దిగా బాగా చదువుతాను. అందువల్ల నాతో అందరికీ అవసరం ఉంటది. అలా అమ్మాయి ఫ్రెండ్ ఒక రోజు నన్ను మ్యాథ్స్ హోమ్ వర్క్ బుక్ అడిగింది. నేను శ్రవంతి మీద ప్రేమతో ఆ అమ్మాయికి ఇచ్చాను. ఇలా రోజురోజుకు మా పరిచయం పెరుగుతూ పోయింది. ఒక రోజు ధైర్యం చేసి నేను తనకిచ్చే పుస్తకంలో ఇద్దరి పేర్లు రాసి లవ్ సింబల్ వేసి ఇచ్చాను. అది తను చూసి మరుసటి రోజు సార్ దగ్గరకు వెళుతున్నానని భయపెట్టింది.
అప్పుడు నేను రివర్స్ గేమ్ ఆడాను. తనే ఆ పేరు రాసిందని. అప్పుడు తను ఒక్కసారిగా షాక్ అయ్యింది. నేను ధైర్యం చేసి తను ఇంటికి వెళ్లే దారిలో ఐ లవ్ యూ చెప్పా. తను మాత్రం ‘నేను నీకు బుక్ రాసి చెప్తా’ అంది. నేను ఒప్పుకోలేదు. పట్టుదలగా అప్పుడే తనతో ఐ లవ్ యూ టూ చెప్పించుకున్నా. ఇక నాకైతే అప్పుడు గాల్లో తేలిపోయినట్లు అనిపించింది. ఇద్దరం పదవ తరగతికి వచ్చాం. ఇద్దరి మధ్యా ఎన్నో గుర్తులు.. ఎన్నెన్నో మాటలు.
క్లాస్‌లో తను చూసే చూపులు. ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఇద్దరం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుదామనకున్నాం. కానీ, నా తప్పు వల్ల తను చెప్పిన కాలేజ్‌లో చేరలేకపోయా. టెన్త్‌లో నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థం అయింది. అమ్మాయి ప్రేమిస్తే ప్రాణం ఇస్తుందని. ఒక రోజు నేను మాట్లాడకపోతే తను క్లాస్‌లోనే ఏడ్చేసింది. ఆ రోజు నుండి ఆ అమ్మాయి అంటే నాకు బాగా నచ్చింది. మేము అనుకున్న కాలేజ్‌లో నేను చేరకపోయేసరికి తను మధ్యలోనే వచ్చేసింది. ఇక అమ్మాయికి మ్యారేజ్ చేశారు. నేనిప్పటికీ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా.
-రఫి,కువైట్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment