
నా పేరు అఖిల. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఒక అబ్బాయిని కలిశా. మా డాడీ, వాళ్ల డాడీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మేం కూడా అలానే ఉండేవాళ్లం. నాకు తనంటే చాలా ఇష్టం. తనకి కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు ఫ్యామిలీ టుగెదర్ జరిగినా నాతోనే ఉండేవాడు. నన్ను చాలా బాగా ప్యాంపర్ చేసేవాడు. మా విషయం ఇంట్లో తెలిసి రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. సంవత్సరం అయ్యాక తను కాల్ చేశాడు. కానీ రెగ్యులర్‌గా మాట్లాడుకునేవాళ్లం కాదు. నాకు నమ్మకం ఉండేది ఎప్పటికైనా తను నాకోసం వస్తాడని.
అలా ఐదేళ్లయ్యాక మళ్లీ తను కనిపించాడు. వాళ్ల ఫ్రెండ్ ద్వారా తన నెంబర్ తీసుకున్నా. నేనే మెసేజ్ చేశా. తర్వాత తను చాలా క్యాజువల్‌గా మాట్లాడాడు. తనకి నేనంటే ఇష్టం లేదేమో అని నేను ఫోన్ చేయడం మానేశా. పది రోజులయ్యక తన నుంచి కాల్ వచ్చింది. నేను కూడా తన లాగే చాలా కూల్‌గా మాట్లాడా. తనకి అర్థమైపోయింది. నేనేదో నిన్ను ఏడిపిద్దాం అనుకుంటే నువ్వు కూడా నాలానే చేస్తున్నావేంటి అని నాతో గొడవపడ్డాడు. మా ప్రేమను ఇంట్లో ఒప్పుకోరు అని తెలుసు కానీ తనలా నన్ను ప్రేమించేవాడు దొరకడని మాత్రం చెప్పగలను. తనతో ఉంటే ఈ లోకాన్నే మర్చిపోతా. అంత ప్రేమ కురిపిస్తాడు. పెద్ద వాళ్లకి ఇష్టం లేకుండా మేం పెళ్లి చేసుకోలేం. అలా అని ఇష్టంలేని వ్యక్తితో నా జీవితాన్ని ముడిపెట్టలేను. మా ప్రేమను అర్థం చేసుకోండి నాన్నా.
--అఖిల (చిన్నారి)
Comments
Please login to add a commentAdd a comment