
ప్రతీకాత్మక చిత్రం
మాది నెల్లూరు! నేను వైజాగ్ వెళ్లినపుడు తను పరిచయం అయింది. మేము చాలా మందిమి కలిసి అరకు ట్రిప్ వెళ్లాము. బాగా ఎంజాయ్ చేశాము. నేను మాత్రమే ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాను. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంది. తను కూడా నేను తనని చూడటం గమనిస్తూ ఉంది. తను చూసినపుడు నేను పక్కకి తిరిగిపోతున్నా. మొత్తానికి ఆ అమ్మాయితో మాట్లాడాను. తన పేరు చెప్పమన్నాను కానీ, తను చెప్పలేదు. ఎలాగోలాగ తన ఫ్రెండ్స్‌ని అడిగి తన పేరు తెలుసుకున్నాను. ట్రిప్ అయిపోయింది! అరకునుంచి వచ్చేశాము. మళ్లీ రేపు కలుద్దామని వెళ్లిపోయాను. నేను రూమ్‌కు వచ్చేశాను. పది గంటలకు నా ఫోన్ రింగ్ అయింది. ఎత్తాను.. ఓ ఆడ గొంతు ‘మీ పేరు సాయి కదా?’ అని అడిగింది. నేను అవును అన్నాను. ‘మీరు ఎవరు’ అని అడిగాను. ‘నేను తెలియదా నీకు?’ అని అడిగింది. తెలియదు అన్నాను. ‘బాగా ఆలోచించు’ అని అంది. గుర్తుకు వచ్చింది. ‘మీ పేరు అనిత’ అని అడిగాను. అవునంది! తన పేరు ఎలా తెలిసిందని అడిగింది. ‘ నా పేరు, నెంబర్ ఎలా తెలిసిందో చెప్పండి ముందు’ అన్నాను. ‘ఎలాగోలా తెలుసుకున్నాను మీకెందుకు’ అంది. నేను ‘సరే చెప్పండి! ఎందుకు కాల్ చేశారు’ అని అడిగాను. ‘ఏం లేదు ఊరికే చేశాను’ అంది.
సరే ఉంటానని చెప్పి కాల్ కట్ చేశాను. మళ్లీ కాల్ రింగ్ అయింది! కట్ చేశాను.. మళ్లీ రింగ్ అయింది! కట్ చేశాను. మళ్లీ రింగ్ అయింది! అప్పుడు కాల్ లిఫ్ట్ చేశాను. ‘ఎందుకు కాల్ కట్ చేస్తున్నారు’ అని అడిగింది. ‘ ఊరికే చేశానన్నారు కదా! అందుకే కట్ చేశా.’అన్నాను. తను కోప్పడింది. నేను సారీ చెప్పాను. తర్వాత ఎందుకు ఫోన్ చేశావని అడిగాను. ‘ మీరు రేపు ఎక్కడికి వెళుతున్నారు’ అని అడిగింది. తెలియదు అన్నాను. ‘రేపు మా ఫ్రెండ్స్‌మి ఆర్కే బీచ్‌కు వెళుతున్నాము! వస్తారా?’ అని అడిగింది. మా ఫ్రెండ్స్‌ని అడిగి చెప్తానన్నాను. వస్తే గనుక తన నెంబర్ కాల్ చేయమంది. సరే అన్నాను. ఎలాగోలా మా ఫ్రెండ్స్‌ను ఒప్పించాను. అందరం కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లాము.
బాగా ఎంజాయ్ చేశాము. అలా నాలుగు రోజులు ఎంజాయ్ చేశాము. వైజాగ్ మొత్తం తిరిగి ట్రిప్ కంప్లీట్ చేశాము. మేమిద్దరం తిరగని చోటు లేదు, తిరగని వీధిలేదు. మర్చిపోలేని జ్ఞాపకాలవి. ఆ తర్వాత తను ఇంటికి వెళ్లిపోవటానికి రెడీ అయింది. వెళ్లబోయే ముందు నన్ను పలకరించింది. నేను ‘సరే వెళ్లు!’ అన్నాను. ‘ఏంటి అలా మాట్లాడుతున్నావు?’ అని అడిగింది. ‘మరి ఇంకెలా మాట్లాడాలి’ అన్నాను. సరే వెళుతున్నాను’ అంది కోపంగా. బై అని చెప్పి వెళ్లబోయింది. నేను ఆగమనన్నాను. ఎందుకంటూ సీరియస్‌గా చూసింది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ‘ అనితా! నేను నీకో మాట చెప్పాలి.’ అన్నాను. ఆ వెంటనే‘ ఐ హేట్ యూ’ అన్నాను. తను షాక్ అయింది. ‘అదేంటి అలా అన్నావు’ అంది. నేను నీ వల్ల ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నా! మరి ఇప్పుడు నువ్వు వెళ్లిపోతుంటే ఇంక ఏమనాలి చెప్పు! ’ అన్నాను. అక్కడే ఉండిపోమన్నాను. కుదరదంది.
ఇంటికి పోయిన తర్వాత కాల్ చేస్తానంది. వెళ్లిపోయింది. చాలా రోజుల తర్వాత కాల్ చేసింది! వేరే నెంబర్ నుంచి. ‘ఎవరు’ అని అడిగితే పేరు చెప్పింది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ‘ఇప్పుడు గుర్తుకు వచ్చానా?’ అని అడిగాను. కాలేజ్ ఉండటం వల్ల ఇన్ని రోజులు కుదర్లేదని, మొబైల్ పోవటం వల్ల ఇప్పుడు చేస్తున్నానని చెప్పింది. కుశల ప్రశ్నల తర్వాత ఎక్కడ ఉన్నావని అడిగితే కటక్‌లో అని చెప్పింది. ఎందుకని ప్రశ్నించాను. మళ్లీ ఎప్పుడు కలుద్దామని అడిగాను. రెండేళ్లు గడిచిపోయింది. చాలా మాట్లాడుకున్నాం, బాగా దగ్గరయ్యాం. తను మా లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పేసింది. ఇద్దరి కులాలు ఒకటే అవ్వటం వల్ల కొంచెం లేటుగానైనా ఒప్పుకున్నారు. ఇంకో రెండు నెలల్లో మా పెళ్లి. ఐ లవ్ యూ అనితా! ఐ లవ్ యూ!
- సాయి, నెల్లూరు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment