ప్రతీకాత్మక చిత్రం
నా మరదలు అంటే నాకు చిన్నప్పటి నుంచి మహా ఇష్టం. ఆమె గుణం మంచిది! అందుకే ఇష్టపడేవాడ్ని. మేము పెద్దగా మాట్లాడుకోలేదు కానీ ఫంక్షన్స్‌కు వెళ్లినపుడు ఆమెని చూసేవాడిని. కాలం గడిచింది. ఆమె డిగ్రీ చేసే టైంలో ఫోన్లో మాట్లాడేవాడిని. సంతోషంగా అనిపించేది. ఆమె గురించి ఇంకా ఎక్కువ తెల్సింది. ఇంకా ఇష్టపడ్డాను. నాకు పెళ్లి సంబంధాలు చూసే సమయం అది. నా మరదలిని చేసుకోవటం నాకు ఇష్టం. కానీ, ఆమెకి నేను అంటే ఇష్టమో కాదో తెలీదు. మా మధ్య వయస్సు కూడా పది సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. ఇంకోటి ఆమె ఇంకా చదువుతూనే ఉంది. వాళ్లకి మాకు కూడా అప్పట్లో అంత మంచి సంబంధాలు లేవు. అందుకే ఆ అమ్మాయి నా జీవితంలోనుంచి మిస్ అయిపోయింది.
కొంత కాలానికి గాని నాకు అర్ధం కాలేదు! జీవితంలో ఒక విలువైన ముత్యాన్ని కోల్పోయా అని. ఇప్పటికి ఆమెతో మాట్లాడే అవకాశం ఉంది. కానీ నా ప్రేమను మాత్రం ఆమెకి వ్యక్తపర్చలేను. అమ్ములు నిన్ను నా మనసులో నుంచి.. హృదయంలో నుంచి ఎప్పటికీ తీసివేయలేను. అది నా వల్ల కాదు. అతి ప్రేమ వల్ల నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను. నన్ను క్షమించి అర్ధం చేసుకో. నాకు ఇక ఎవరూ లేరు. నీ స్థానం భర్తీ చేసేవాళ్లు కూడా లేరు.
- ప్రేమ్ సాగర్, ఖమ్మం
చదవండి : నా మీద కేసు పెట్టింది.. భయంగా ఉంది
షాకింగ్ న్యూస్! చాలా కూల్‌గా చెప్పింది!
Comments
Please login to add a commentAdd a comment