ప్రతీకాత్మక చిత్రం
అది 2016 సంవత్సరం! నేను హైదరాబాద్‌లో అప్పుడే ఓ కొత్త కంపెనీలో జాబ్‌లో జాయిన్ అయ్యాను. చాలా ఏళ్లనుంచి నేను హైదరాబాద్లో ఉన్నా! అప్పడే ఓ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారిపోయాను. మా కంపెనీలో కొత్తగా ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు. నా ఎదురుగా ఓ అమ్మాయి కూర్చునేది. తన పేరు అనూష క్రిష్ణ, తన పేరు తెలుసుకోవటానికి నాకు వారం రోజులు పట్టింది. నిజంగా చెప్పాలంటే తొలిచూపులోనే తనను చూసి ప్రేమలో పడిపోయా! అంతలా నచ్చేసింది. ఆ అమ్మాయిని చూడటానికి కావాలనే సీటులోనుంచి పైకి లేచేవాడిని. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒక రోజు వేరే వాళ్ల ద్వారా తన నెంబర్ సంపాదించా. నెంబర్ అయితే దొరికింది కానీ, ఫోన్ చేయాలంటే భయం. ధైర్యం తెచ్చుకుని రాత్రి 11:30కి తనకు మెసేజ్ చేశా ‘హాయ్’ అని.. రిప్లై లేదు. తను పడుకుందనుకుంటా. తను మరుసటి రోజు ఆఫీసుకు రాగానే స్కైప్‌లో మెసేజ్ చేశా. నైట్ డిస్ట్రబ్ చేసుంటే సారీ అని. అంతే తను తిట్టేసింది.. ‘ ఎవడు నిన్ను ఆ టైంలో మెసేజ్ చేయమన్నాడు.’ అంది.
నా ముఖం మాడిపోయింది. ఆరోజు ఆఫీసు అయిపోగానే నేను రూంకు వెళదామని బస్‌లో ఉండగా తన నుండి మెసేజ్ వచ్చింది.‘ సారీ! అలా అన్నందకు. అయినా ఆ టైంలో మెసేజ్ చేయోచ్చా.’ అని. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అప్పటినుంచి మా ఇద్దరి మధ్యా రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. నాకైతే ఆ ధ్యాసలో పడి ఓ సంవత్సరం ఇంటి ముఖమే చూడలేదు. తనకి అంతలా అడిక్ట్ అయిపోయా. పరిచయం అయినా ఓ వారానికి తనకు ప్రపోజ్ చేశా. తను సీరియస్‌గా తీసుకోలేదు. రోజులు గడుస్తున్న తన పైన ప్రేమ పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఏమైందో ఏమో సడెన్‌గా అవాయిడ్ చేయటం మొదలుపెట్టింది. అది నేను తట్టుకోలేకపోయా. ఆఫీసులోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. ఆఫీసులో అందరూ వచ్చారు నన్ను చూడటానికి.
అనూష మాత్రం రాలేదు. ఇంత చేసినా నాపైన తనకు ప్రేమ కలగలేదు. ఎందుకంటే నాకు ఇదివరకే మా ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేశారు. అది తనకు చెప్పి కన్‌విన్స్ చేద్దామనేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన వల్ల జాబ్ వదులుకున్నా. నా జీవితం నాశనం అయింది. అయినా తననే కావాలనుకుంటున్నా. కానీ, తన మనసు కరగలేదు. అమ్మలా చూసుకుందామనుకున్నా. తన వల్ల జీవితమే లేకుండా పోయింది. అన్నీ పోయాక నాకు అర్థమైంది. ఆ అమ్మాయి మాత్రం ఏదీ పట్టనట్లు జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తోంది. ఇంత జరిగాక ఒకటే అనిపించింది. అమ్మానాన్న కోసం ఇష్టంలేని అమ్మాయి మెడలో తాళి కట్టానని. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి వల్ల జీవితం నాశనం చేసుకున్నా. నిజమైన ప్రేమకు ఎప్పటికైనా ఓటమి తప్పదు.
- బాలు, చిత్తూరు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment