
నా పేరు సునీల్. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నా ప్రేమను మా అమ్మానాన్న ఒప్పుకోకపోవడంతో పిచ్చివాడిలా సుసైడ్‌కి కూడా ప్రయత్నించాను. విధి ఆడిన నాటకంలో మా ప్రేమ..పెళ్లి పట్టాలెక్కలేదు. కొన్నాళ్లకు తనకు వేరే వ్యక్తితో పెళ్లయ్యింది. ఆరోజే నిర్ణయించుకున్నా. ఇంక నా జీవితంలో పెళ్లి అనే పదానికి చోటివ్వకూడదని. ఉద్యోగరీత్యా నేను మలేషియా వెళ్లాల్సి వచ్చింది. మా కంపెనీలోకి కొత్తగా జాయిన్ అయ్యింది ఓ అమ్మాయి. తనకు పెళ్లయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయి..ఇద్దరు పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తుంది.
ఎందుకో తెలీదు కానీ తను వచ్చాక నాలో కొత్త ఆశలు చిగురించాయి. వాళ్ల పిల్లల్ని కూడా నాకు పరిచయం చేసింది. తన మీద నాకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచాను. కానీ తన నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. నా ప్రపోజల్‌ను ఒప్పుకోలేదు. అలా అని నో కూడా చెప్పలేదు. ఇప్పటికీ ఇద్దరం మునుపటిలానే మాట్లాడుకుంటున్నాం. ఏదో ఒకరోజు నా ప్రపోజల్‌ను ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుంది. తనుంటే నా జీవితం మరింత అందంగా మారనుందన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నా..
--సునీల్ ( మలేషియా)
Comments
Please login to add a commentAdd a comment