ఎదను తడిపే చినుకంటి ప్రేమ కావ్యం | Vaana Romantic Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

ఎదను తడిపే చినుకంటి ప్రేమ కావ్యం

Published Sun, Jan 5 2020 12:04 PM | Last Updated on Sun, Jan 5 2020 12:20 PM

Vaana Romantic Movie Review In Telugu - Sakshi

వాన సినిమాలోని ఓ దృశ్యం

సినిమా : వాన
తారాగణం : వినయ్‌, మీరా చోప్రా, నరేష్‌, సుమన్‌, జయసుధ,సీత
డైరెక్టర్‌ : ఎమ్‌ఎస్‌ రాజు

కథ : అభి(వినయ్‌) ఓ షాపింగ్‌మాల్‌ దగ్గర నందిని(మీరా చోప్రా)ను చూస్తాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.. ఆ వెంటనే ఆమెను అలా చూస్తూ పక్కనే ఉన్న మ్యాన్‌హోల్‌లో పడతాడు. నందిని అతడ్ని మ్యాన్‌హోల్‌ నుంచి బయటకు తీసి రక్షిస్తుంది. అప్పటినుంచి నందినితో  పీకల్లోతు ప్రేమలో పడ్డ అభి ఆమెకోసం వెతుకుతుంటాడు. కొద్దిరోజుల తర్వాత తల్లి(జయసుధ)తో కలిసి అరుకు వెళతాడు. అక్కడ నందిని కనపడుతుంది. తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత నందిని తన తల్లి ఫ్రెండ్‌( సీత) కూతురని తెలుసుకుంటాడు.

అయితే నందినికి మరో రెండు రోజుల్లో పెళ్లని తెలిసి విలవిల్లాడిపోతాడు. బాధతో అక్కడినుంచి తిరిగివెళ్లిపోతుంటాడు. కానీ, నందిని అతన్ని మాటలతో రెచ్చగొట్టడంతో తిరిగొస్తాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న నందినిని అభి తన ప్రేమలో పడేస్తాడా? ఒక వేళ నందిని అతడ్ని ప్రేమించినా రెండు కుటుంబాల పెద్దలు  వీరి పెళ్లికి ఒప్పుకుంటారా? లేదా? ఆ రెండు రోజుల్లో ఇద్దరి మధ్యా చోటుచేసుకునే సంగతులే ఈ సినిమా కథ. 

విశ్లేషణ : 2008లో విడుదలైన వాన ఓ ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ సినిమా. వినయ్‌, మీరా చోప్రాల నటన మనల్ని కట్టిపడేస్తుంది. కథానాయకుడు వినయ్ అభి పాత్రకు జీవం పోశాడు. ప్రియురాలిని దక్కించుకోవటానికి ప్రియుడిగా అభి(వినయ్‌) పడే బాధ అద్భుతంగా ఉంటుంది. మనసును తాకే పాటలు సినిమాకు ప్రాణం పోశాయని చెప్పొచ్చు. 2006లో విడుదలైన ముంగారు మలె సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంగారు మలె  తెలుగులోనే కాదు బెంగాలీ, ఒరియా, మరాఠా భాషల్లో కూడా రీమేక్‌ అయ్యింది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement