ప్రతీకాత్మక చిత్రం
మొదటిసారి తనను ఒక కోచింగ్ సెంటర్‌లో చూశాను. తను యావరేజ్‌గా ఉన్నా ఎందుకో చూడగానే నచ్చేసింది. అక్కడ నన్ను ఇష్టపడేవారు ఎక్కువ ఉన్నా.. నేనెవరినీ పట్టించుకునేవాడినికాదు. అందరినీ చెల్లీ అంటూ పలకరించేవాడిని. కానీ, తనను మాత్రం పేరు పెట్టి పిలిచేవాడిని. అలా పిలవడంతోనే నా ప్రేమ విషయం అక్కడ ఉన్న అందరికీ తెలిసి పోయింది. తను కూడా నాతో చాలా బాగా మాట్లాడేది. అలా మొదలైన మా పరిచయం కోచింగ్ అయిపోగానే ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడేవరకు వచ్చింది. అలా ఒకరోజు తనే నాకు మెసేజ్ చేసి ప్రపోజ్ చేసింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. అలా మొదలైన మా ప్రేమ కథ ఐదేళ్లు కొనసాగింది. ఒక రోజు వాళ్ల ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసి తనను కొట్టారు. వాళ్ల నాన్న తనతో నాకు ఫోన్ చేయించారు. నేను వెంటనే వాళ్లింటికి వెళ్లాను. వాళ్లు మర్యాదగానే ‘నీకు నచ్చితే! మీరు ఒకరినిఒకరు ఒదిలి ఉండలేకపోతే పెళ్లి చేసుకోండి. ఇంటి దగ్గర ఒప్పించి రా’ అని నాకు చెప్పారు.
దీంతో నేను మా వాళ్లను ఒప్పించే పనిలో పడ్డా. మా అమ్మకి అస్సలు ఇష్టం లేకపోవడంతో అదే విషయం వాళ్ల నాన్నకు కాల్ చేసి చెప్పా. ఆయన సింపుల్‌గా ‘సరే! ఇకనుంచి మా అమ్మాయిని మళ్లీ కలుసుకునే ప్రయత్నం చెయ్యెద్దు.’ అని చెప్పి తనను బెదిరించాడు. దాంతో క్లోజ్ అయిందనుకున్న నా ప్రేమ కథ తను మళ్లీ ఫోన్ చేసి‘ బ్రతికున్నంతకాలం ఇలానే ఉందాం!’ అని చెప్పేసరికి మళ్లీ మొదలైంది. అప్పటినుంచి మామూలుగా ఫోన్‌లలో మాట్లాడుకునేవాళ్లం. అలా మా ప్రేమ వ్యవహారం తను పెళ్లి చేసుకోవటంతో ముగిసింది. నేను మా అమ్మ తర్వాత అమ్మ అనుకున్న తను పెళ్లి అయ్యాక మళ్లీ ఫోన్ కూడా చేయకపోవటంతో నా బాధకు అవధులు లేకుండాపోయాయి.
18 నెలలుగా నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో చెప్పలేను. తను నా నుండి విడిపోయినప్పటికి నాతో మాట్లాడతానని చెప్పింది. కానీ, తను ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. కనీపెంచిన అమ్మను కాదనలేక నేను తనను వదులుకున్నా. ఇప్పుడు నేను మనో వేధనతో బాధపడుతున్నా. నరకం చూస్తున్నా. తనని మర్చిపోలేక, వేరే వాళ్లు నన్ను ఇష్టపడి ప్రపోజ్ చేసినా.. నా మనసు అంగీకరించక దూరం పెడుతూ వస్తున్నా. కానీ, నాకు మరో అమ్మవు అవుతావనుకున్న నువ్వు ఇలా మధ్యలో వదిలేస్తావనుకోలేదు బంగారం. నువ్వెక్కడున్నా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
- సురేష్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment