Breakup Love Story
-
Raashi Khanna: లవ్ బ్రేకప్...
-
తొలి సినిమా రిలీజ్‌కు ముందే సూపర్‌స్టార్‌తో పెళ్లి.. పిల్లలు పుట్టాక..
భారతీయ సినిమా తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన సూపర్ స్టార్లలో రాజేశ్ ఖన్నా ఒకరు. వరుసగా 15 హిట్లు కొట్టిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న రోజులవి.. ఆ సమయంలో బాబీ(1973) సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసింది డింపుల్ కపాడియా. ఇది ఆమె తొలి చిత్రం. అయితే ఈ సినిమా రిలీజవడానికి ముందే తన అందచందాల గురించి జోరుగా ప్రచారం జరిగింది. అది రాజేశ్ ఖన్నా చెవిన పడింది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. తన చేయి పట్టుకుని నడిచాడు. అలా 1973లో తనకంటే రెట్టింపు వయసున్న రాజేశ్‌ను పెళ్లాడింది డింపుల్. పెళ్లి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ దంపతులు 1984లో విడిపోయారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అప్పటికే వీరికి ట్వింకిల్ ఖన్నా, రింఖీ ఖన్నా జన్మించారు. భర్తతో విడిపోయిన తర్వాత 1985లో సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది డింపుల్. ఆ సినిమా రిలీజ్ సమయంలో తను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 'ఓసారి నేను, రాజేశ్ ఖన్నా చార్టెడ్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్ వెళ్తున్నాం. అతడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. విమానం దిగడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో అతడు నా కళ్లలోకి సూటిగా చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అప్పుడు నా వయసు 16 మాత్రమే! పెళ్లికి సరిగ్గా ఏడు రోజుల ముందు అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చాలా త్వరత్వరగా మా పెళ్లి జరిగిపోయింది. ఏ రోజైతే ఆయనతో నా వివాహం జరిగిందో అప్పుడే నా సంతోషం, జీవితం ముగిసిపోయినట్లనిపించింది. బాబీ సినిమా తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు రూ.5 లక్షలిస్తామని ఆఫర్ చేశారు. కానీ ఆ వయసులో కెరీర్ ప్రాధాన్యత అర్థం కాలేదు. రాజేశ్ ఇంట్లో అడుగుపెట్టి ఆశీర్వాదం తీసుకున్న రోజు నాకెందుకో ఈ పెళ్లి వర్కవుట్ కాదేమో అనిపించింది. పలువురు మహిళలు ఆయన జీవితంలోకి వస్తున్నారని తెలిసినా బాధేయలేదు. కానీ మా బంధం బలంగా లేదని మాత్రం అర్థమైంది. పైగా సమానత్వం అనే మాట మా విషయంలో నిజం కాలేదు. అతడి కెరీర్ నెమ్మదిగా డౌన్ అవడంతో మా మధ్య పోట్లాటలు మరింత పెరిగాయి. చివరికి ఇద్దరం విడిపోయాం' అని చెప్పుకొచ్చింది డింపుల్. చిత్రపరిశ్రమలో అందరూ కాకాజీ అని పిలుచుకునే రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో 2012 జూలై 18న మరణించారు. దంపతులుగా విడిపోయినప్పటికీ డింపుల్.. రాజేశ్ ఖన్నాతో స్నేహితురాలిగానే మెదిలేవారు. ఆయన చివరి రోజుల్లోనూ వారిద్దరూ కలిసే ఉన్నారు. చదవండి: డైరెక్టర్ నమ్మలేదు, రెండు ఆడిషన్స్ ఇచ్చాను: హీరోయిన్ -
'అనితా ఓ అనితా' సింగర్ గుర్తున్నాడా?.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనితా ఓ అనితా నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద.' ఈ పాట వినని వారు ఉండరేమో. అంతలా యువతను ఊపేసింది ఆ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ మార్మోగిపోయింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరినీ ఊర్రూతలూగించింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో ఓ రేంజ్లో ఫేమస్ అయినా ఈ సాంగ్ రాసిన యువకుడు పేరు నాగరాజు. ఒక్క పాటతో సంచలనం సృష్టించిన నాగరాజు గురించి తెలుసుకుందాం. నాగరాజు మాట్లాడుతూ..'ఒక వీడియో సాంగ్ పాటకు అనితా పాటను అటాచ్ చేశారు. నిజంగా నేను చనిపోయానని అప్పుడు రూమర్స్ వచ్చాయి. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. హైదరాబాద్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది. భయంతో నేను మా ఊరికి వెళ్లిపోయా. ఇప్పుడు అనితకు పెళ్లి అయిపోయింది. నాకు కూడా పెళ్లి జరిగింది. నిజంగా అనితకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె వల్లే నేను ఈ పాట రాయగలిగాను. అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడం వల్ల మా లవ్ బ్రేకప్ అయింది.' అని అన్నారు. నా ప్రేమను ఓ పాట రూపంలో చెబుదామని ప్రయత్నించానని నాగరాజు తెలిపారు. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని ఆయన అన్నారు. పెద్దబ్బాయికి మూగ, చెవుడు తన కుటుంబం గురించి నాగరాజు మాట్లాడుతూ.. 'ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయికి మూగ, చెవిటి. మాటలు రావు. చిన్నబ్బాయి కూడా అన్నతో పాటే సైగలే చేస్తుంటాడు. ఇంతకుముందు ఒక చిన్న పాన్‌షాపు పెట్టుకుని జీవనం కొనసాగించా. ఎవరన్నా పిలిస్తే వెళ్లి పాటలు పాడేవాన్ని. నా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనితో పాటే ప్రస్తుతం నేను హైదారాబాద్‌లోనే ఉన్నానని' తెలిపారు. కాగా ప్రస్తుతం అనితా పాటకు సీక్వెల్‌గా అనిత-2 సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు నాగరాజు వెల్లడించారు. 'నా ప్రాణమా నిను మరిచిపోనులే.. ఊపిరి ఆగినా నీ మీద ప్రేమ చావదే'. అంటూ సాగే సాంగ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. -
రోహిత్ శర్మతో డేట్ చేశా: నటి బ్రేకప్ లవ్ స్టోరీ
రోహిత్ శర్మ.. క్రికెట్ మైదానంలో హిట్మన్గా ప్రసిద్ధుడు. ఇండియన్ ఒపెనింగ్ బాట్స్మన్. సోఫియా హయత్.. సంచలనాలకు మారుపేరు. బ్రిటిష్ మోడల్, సింగర్, యాక్ట్రెస్.. టెలివిజన్ పర్సనాలిటీ.. బిగ్‌బాస్ (హిందీ) పోటీదారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విరబూసి జీవితాలను పండించేలోపే వాడిపోయింది. ఆ ఫెయిల్యూర్ స్టోరీ ఎలా మొదలైందంటే.. 2012.. లండన్‌లోని ఓ క్లబ్లో రోహిత్‌ను కలిసింది సోఫియా. ఆమె నటించిన సినిమా పూర్తయిన సందర్భంగా ఇస్తున్న పార్టీలో. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రోహిత్ ఆ పార్టీకి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అది మొదలు లండన్, ముంబై, ఢిల్లీలో జరిగిన ఇంకెన్నో పార్టీల్లో కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా మారారు. ఇంకొన్నాళ్లకే ప్రేమికులయ్యారు. చెట్టాపట్టాల్.. చెట్టుపుట్టల్.. హాలిడేయింగ్స్.. సర్వసాధారణమే! కానీ ఆ ప్రేమను బయటపడనివ్వకుండా గుట్టుగానే దాచుకున్నారు. కాదు.. దాచుకున్నామని అనుకున్నారు. మీడియా పట్టేసింది. ఆ వార్తలను హెడ్‌లైన్స్‌గా మార్చి బాగా ప్రచారం చేసింది. ఇటు క్రికెట్ ఫీల్డ్‌లో.. అటు సినిమా, మోడలింగ్ ఫీల్డ్‌లో ఈ జంట ప్రేమ చర్చనీయాంశమైంది. అది ఆ ఇద్దరి చెవిన పడినా రూమర్ అన్నట్టుగానే పట్టించుకోలేదు. ఏనాడూ మీడియా ముందు గానీ.. సోషల్ మీడియాలో గానీ ప్రస్తావించలేదు. ఆ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యాకే తమ మధ్య ప్రేమవ్యవహారం నడిచిందని ట్విటర్ వేదికగా ప్రకటించింది సోఫియా... ‘ఓకే.. ఈ వదంతులకు నేటితో.. ఫుల్స్టాప్ పెడుతున్నాను. యెస్..రోహిత్ శర్మతో నేను డేట్ చేశాను. కానీ ఇప్పుడా ప్రేమ బ్రేక్ అయిపోయింది. మళ్లీ మేం కలిసేది లేదు.. మా ఆ అనుబంధాన్ని పునరుద్ధరించుకునే ఆసక్తీ లేదు. ఇప్పుడు నేనో మంచి మనిషి తోడు కోసం వేచి చూస్తున్నాను’ అంటూ. నువ్వంటే నువ్వని.. మూడేళ్ల ముచ్చటగా 2015లో ముగిసిపోయిన ఆ బ్రేకప్‌కు కారణం రోహిత్ శర్మ అంటుంది సోఫియా. ‘సోఫియానే’ అంటారు రోహిత్ శర్మ సన్నిహితులు. ‘నా గురించి మీడియా ఎప్పుడు వివరం అడిగినా.. సోఫియా నా ఫ్యాన్ అనే చెప్పాడు తప్ప లవ్ అని చెప్పలేదు. నా గురించి నిజం చెప్పడానికి అంతగా ఇబ్బందిపడే వ్యక్తితో ప్రేమేంటి అని బ్రేకప్ చేసేసుకున్నా’ అని చెప్పింది సోఫియా ఒక ఇంటర్వ్యూలో. రోహిత్ శర్మ సన్నిహితుల కథనం ప్రకారం.. సోఫియా, విరాట్ కొహ్లీల స్నేహం. ఆమె.. విరాట్‌తో చెలిమి పెంచుకొని అతనితో చనువుగా మసలుకోవడం వల్లే రోహిత్.. సోఫియాకు దూరమయ్యాడని అంటారు. సోఫియాతో కలిసి ఉన్నప్పుడు రోహిత్ శర్మ తమ ప్రేమానుబంధం గురించి ఎలా పెదవి విప్పలేదో విడిపోయిన తర్వాతా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం సోఫియా ట్వీట్లకు కౌంటర్ కూడా ఇవ్వలేదు. చదవండి: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్ని ‘రోహిత్‌ను పరిచయం చేస్తూ అతను క్రికెటర్ అని చెప్పాడు నా ఫ్రెండ్. అతను నాకు పరిచయం అయ్యేవరకు అతనో క్రికెటర్ అని నాకు తెలియదు. ఎందుకంటే క్రికెట్ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు.. మ్యాచెస్‌ను చూడలేదు కూడా. కాని తొలి పరిచయంలోనే రోహిత్ నచ్చాడు. వాట్ ఏ కూల్ మ్యాన్ అనుకున్నాను. మా స్నేహం పెరిగే కొద్దీ నిజంగానే అతను మంచి మనిషిగానే కనిపించసాగాడు నాకు. చాలా సెన్సెటివ్. క్రికెట్ గురించి, ఫ్యాన్స్ గురించి చెప్పేవాడు. బాగా ఆడకపోతే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పేవాడు. ఆ భావోద్వేగాల గురించి గంటలు గంటలు డిస్కస్ చేసుకునే వాళ్లం. అంతా బాగానే ఉంది.. సజావుగా సాగిపోతోంది అనుకుంటున్నప్పుడే రోహిత్‌ను ఒకసారి మీడియా అడిగింది ఆయన లైఫ్‌లో నేనేంటి అని. దానికి రోహిత్ అసలేం తడుముకోకుండా తను జస్ట్ ఫ్యాన్ అంతే. అంతకుమించి మరేం లేదు అని ఆన్సర్ చేశాడు.ఆ జవాబు.. చెప్పిన తీరును ఎందుకో రిసీవ్ చేసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఇక ఆ ప్రేమ ముందుకు సాగదని అర్థమైంది. అందుకే వద్దనుకున్నాను’ అని ట్విటర్ ముఖంగా వెల్లడించింది. సోఫియాతో విడిపోయాక 2015లోనే రితికా సజ్దేను ప్రేమ వివాహం చేసుకున్నాడు రోహిత్. ఇప్పుడు వాళ్లకొక పాప సమైరా. సోఫియా.. తన జీవితాన్ని పుస్తకంగా రాసే పనిలో ఉంది. అందులో రోహిత్ శర్మతో తన ప్రేమ జీవితం కూడా ఉంటుందని చెప్పింది. - ఎస్సార్ చదవండి: వెబ్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ -
భార్య పోయాక సుష్మితతో క్రికెటర్ సహజీవనం, కానీ!
క్రికెట్, సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదంటే.. పచ్చగడ్డిని భగ్గున మండించే వైరాన్ని కూడా పక్కకు తోసేసి ప్రేమించేలా చేస్తుంది! మన బాలీవుడ్, పాక్ క్రికెట్టే దీనికి ఉదాహరణ! ఆ ఆటగాళ్లు.. ఈ తారల మధ్య నడిచిన ప్రేమ కథలే ప్రత్యక్ష సాక్ష్యాలు! అవునవును.. జీనత్ అమన్ – ఇమ్రాన్ ఖాన్, రీనా రాయ్ – మొహ్సిన్ ఖాన్... వీళ్ల సరసన ఉన్న మరో జంటే సుష్మితా సేన్, వసీమ్ అక్రమ్! ఆ ఇద్దరిదే ఈ మొహబ్బతే అని అర్థమయ్యే ఉంటుంది. ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్. ఆ ఆకర్షితుల్లో వసీమ్ అక్రమ్ కూడా ఉన్నాడు. క్రికెట్లో ఆల్ రౌండర్ వసీమ్ అక్రమ్‌కు జగమంతా అభిమానులున్నారు. అందులో సుష్మితా సేన్ ఉందో లేదో తెలియదు కానీ.. అతని పేరు మాత్రం ఆమెకు తెలుసు. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలో ల్యాండ్ అయింది. తెర మీద కనిపించిన సుష్మితాకూ, ఆమె నటనకూ అభిమానిగా మారాడు వసీమ్. అప్పటిక్కూడా ఆ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం లేదు. సినిమా, క్రికెట్ ఈవెంట్లలో కలవలేదు. మరి ఎక్కడ కలుసుకున్నారు? ‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ సెట్స్‌లో. అది సినిమా కాదు. ఓ ప్రైవేట్ చానెల్లో ప్రారంభమైన రియాలిటీ షో. దానికి న్యాయనిర్ణేతలుగా సుష్మితా సేన్, వసీమ్ అక్రమే వ్యవహరించారు. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆమె మీద అతనికున్న అభిమానాన్ని ఆ సందర్భంలోనే ఆమెతో చెప్పాడు అతను. అతని ఆదరాన్ని ఆమె స్వీకరించింది. ఆ రియాలిటీ షోతో వాళ్ల మధ్య స్నేహం కుదిరింది. వాళ్లు హాజరవ్వాల్సిన ఫంక్షన్లు, పార్టీలకు కలసే వెళ్లడం.. జంటగా కనిపించడం మొదలుపెట్టారిద్దరూ. దాంతో వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందనే గుసగుసలు వినిపించసాగాయి బాలీవుడ్లో. దాన్ని మీడియా మరింత ముందుకు తీసుకెళ్లింది.. ఆ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ. ఆ ప్రచారాన్ని కానీ.. మీడియా కథనాన్ని కానీ ఆ జంట కలసి కానీ.. విడివిడిగా కానీ ఖండించలేదు. అసలు వాటిని వాళ్లు పట్టించుకోనే లేదు. వీళ్ల మౌనాన్ని తమ కథనానికి అంగీకారంగా అనుకుందో ఏమో మరి ఆ జంట త్వరలోనే పెళ్లీ చేసుకోబోతోందనే వార్తనూ వ్యాప్తి చేసింది మీడియా. అప్పుడు ఉలిక్కిపడ్డారు ఆ ఇద్దరూ. ‘వసీమ్ అక్రమ్‌కు, నాకూ పెళ్లంటూ వస్తున్న వార్తలను చదివాను. అందులో రవ్వంత కూడా నిజం లేదు. ఇలాంటి విషయాలను పత్రికల్లో చదివినప్పుడు, టీవీ చానళ్లలో చూసినప్పుడే అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు మీడియా ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందోనని. ఇలాంటి వార్తల వల్ల కుటుంబాలు కూలిపోతాయి. వసీమ్ అక్రమ్ నాకు మంచి స్నేహితుడు. అద్భుతమైన సహధర్మచారిణితో చక్కటి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇలాంటి వార్తలతో వాళ్ల కాపురంలో కలతలు రేపొద్దు. ఇంకో విషయం.. నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు ఆ విషయం మొదట మీకే చెప్తాను’ అంటూ ట్విట్టర్లో తన స్పందనను తెలియజేసింది సుష్మితా. అటు వసీమ్ అక్రమ్ కూడా ‘ఈ వదంతులు వినీ వినీ విసుగొచ్చేసింది. ‘మరో పెళ్లి’ గురించిన ఆలోచనలు నాకు లేవు. నా ఫోకస్ అంతా నా పిల్లల (ఇద్దరు అబ్బాయిలు) మీదే. వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. తండ్రిగా నా అవసరం వాళ్లకిప్పుడు ఎంతో ఉంది. అందుకే ఏడాది పాటు ఐపీఎల్ నుంచి కూడా విరామం తీసుకుని నా పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులో మాటను మీడియాకు స్పష్టం చేశాడు. నాకు వసీమ్ అంటే చాలా ఇష్టం.. ఓ స్నేహితుడిగా మాత్రమే. నా దృష్టిలో రిలేషన్షిప్ అనేది బిగ్ డీల్. నిజంగానే నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇలా మీ ఊహలకు వదిలేయను – సుష్మితా సేన్ అయితే... ఒక పత్రిక (హిందుస్థాన్ టైమ్స్) కథనం ప్రకారం.. ‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ మొదలైన కొన్నాళ్లకు అంటే 2009లో వసీమ్ భార్య హుమా చనిపోయింది. అతను విషాదంలో మునిగిపోయాడు.. దిగులుతో కుంగిపోయాడు. ఆ బాధను పంచుకుంటూ వసీమ్‌కు సొలేస్ అయింది సుష్మితా. ఆమె స్వాంతనతో వసీమ్ ఊరట చెందాడు. అది ప్రేమగా మారింది. సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా సేన్ షెడ్యూల్ వల్ల వసీమ్ అక్రమ్ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్ అయింది. కొన్నాళ్ల తర్వాత.. సుష్మితా సేన్ .. ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. వసీమ్ అక్రమ్ ఓ అస్ట్రేలియన్ మోడల్ని పెళ్లి చేసుకున్నాడు. - ఎస్సార్ -
ఇద్దరితో బ్రేకప్, వివాహితుడైన టెన్నిస్ స్టార్‌తో నటి పెళ్లి!
మిస్ యూనివర్స్, మోడల్, నటిగా లారా దత్తా జగమంతా పరిచయం. టాప్ టెన్నిస్ స్టార్‌గా మహేశ్ భూపతి కూడా ప్రపంచానికి తెలుసు! ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎదురుపడే వరకూ ఒకరి గురించి ఒకరు వినే ఉన్నారు.. ముఖ పరిచయం తక్షణమే ఒకరి ప్రేమలో ఒకరు పడ్డారు! ఆ కథే ఇక్కడ ‘మొహబ్బతే’గా.. విశ్వసుందరిగా లారా దత్తా ప్రపంచానికి తెలిసేటప్పటికే ఆమె జీవితంలో ఉన్న స్నేహితుడు, సహచరుడు కెల్లీ దోర్జీ. భూటాన్ దేశస్థుడు. ముంబై బేస్డ్ మోడల్. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని భావించారు వారి అనుబంధం గురించి తెలిసినవాళ్లంతా. తొమ్మిదేళ్ల డేటింగ్ తర్వాత హఠాత్తుగా లారా ప్రవర్తనను విమర్శించడం మొదలుపెట్టాడు కెల్లీ. ప్రముఖ మోడల్, నటుడు డినో మోరియాతో ఆమె సన్నిహితంగా మెదులుతోందంటూ. ఆ విమర్శలు తర్వాత ఆరోపణలుగా మారి.. ఆఖరకు ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. కెల్లీ ఊహించినట్టుగా డినో మోరియాతో లారా పెద్దగా కలసిలేదు. సంతోషంగానూ ఉన్నట్టు లేదు. డినో పక్కన నందితా మహంతి అనే అమ్మాయి పేరు జత కూడింది. ఆ రూమర్‌ని డినో మోరియా ఖండించలేదు. లారా హర్ట్ అయింది. అతనితోనూ తెగతెంపులు చేసుకుంది. అలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే మహేశ్ భూపతితో ఆమెకు ములాఖాత్ అయింది. మహేశ్ భూపతి స్పోర్ట్స్ కంపెనీలో ఈ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం అయింది. ఆ మీటింగ్ ఏదో యాడ్‌కి సంబంధించి అని ప్రచారంలో ఉంది కానీ.. నిజానికి లారాను కలవడానికే మహేశ్ ఆ మీటింగ్‌ను ఏర్పాటు చేశాడు.. యాడ్ అనేది ఓ మిష మాత్రమే అని అంటారు మహేశ్ భూపతి సన్నిహితలు. మొత్తానికి తొలి పరిచయంలోనే మహేశ్ సింప్లిసిటీకి ముగ్ధురాలైపోయింది లారా. అప్పటికే లారా మీద మనసు పడి ఉన్నాడు కాబట్టి మహేశ్ కూడా ఆమె పట్ల మరింత ఆకర్షితుడై పోయాడు. అలా వాళ్ల ప్రేమ మొదలైంది. కొన్ని రోజుల్లోనే పరస్పరం ఆ ప్రేమను ప్రకటించుకు న్నారు. కానీ అంతా సవ్యంగా సాగడానికి అదివరకే మహేశ్ వివాహితుడవడం ఓ అడ్డంకిగా మారింది. లారా.. మహేశ్ ఊహకు అందకముందే (2002) అతనికి మోడల్ శ్వేతా జైశంకర్‌తో పెళ్లయింది. ఏడేళ్ల ఆ బంధం మహేశ్‌కు లారా మీద పుట్టిన ప్రేమతో పలచనైంది. లారాతోనే తతిమా జీవితపు ప్రయాణం అని మహేశ్ నిర్ణయించుకునేసరికి.. విడాకులతో శ్వేత అతనికి ఆ నిర్ణయాన్ని అమలుపర్చుకునే స్వేచ్ఛనిచ్చింది. కానీ లారాకు ‘హోమ్ బ్రేకర్’ అనే అపవాదు తప్పలేదు. మహేశ్ భూపతి కోసం ఆ అపవాదును మోసింది ఆమె. ‘ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే నేను, మహేశ్ ఇద్దరం ఓ ఒప్పందం చేసుకున్నాం. సాధ్యమైనంత వరకు ఇద్దరం కలిసే బిడ్డను పెంచాలి. అది సాధ్యంకాని పక్షంలో మా ఇద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరైతే బిడ్డను చూసుకోవాలని. పదేళ్లుగా ఆ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నాం’ అని చెప్పింది లారా దత్తా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత... 2011, ఫిబ్రవరి 16న.. అంటే వాలంటైన్స్ డే అయిన రెండు రోజులకు మహేశ్ భూపతి, లారా దత్తా ఒకింటివారయ్యారు. ముంబైలో ఫిబ్రవరి పదహారున అత్యంత సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత ఫిబ్రవరి 20న గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మహేశ్ భూపతి మాజీ భార్య శ్వేత కూడా చెన్నైకి చెందిన రఘు కైలాస్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మహేశ్ భూపతి, లారా దత్తా దంపతులకూ ఓ కూతురు. పేరు సైరా. - ఎస్సార్ -
నీ వరకు వస్తే తప్పు కాదా?..షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్-దీప్తి సునైనాల బ్రేకప్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ షో కారణంగానే వీళ్లు విడిపోయారా? షణ్ముఖ్ సిరితో క్లోజ్‌గా మూవ్ కావడం వల్లే దీప్తి బ్రేకప్ చెప్పిందా? ఐదేళ్లుగా కలిసి ఉన్న వీళ్లు ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడం ఏంటి? అనే నెటిజన్స్ చర్చించుకుటున్నారు. తాజాగా వీరి బ్రేకప్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. బిగ్‌బాస్ షోలో సిరితో షణ్ముఖ్ క్లోజ్‌గా ఉండడం వల్లే బ్రేకప్ చెబితే.. మరి అదే షోలో దీప్తి కూడా ఒక పర్సన్‌తో క్లోజ్‌గా ఉంది. నీ వరకు వచ్చేసరికి అది తప్పుకాదా? అని దీప్తిని ప్రశ్నించింది శ్రీరెడ్డి. ‘షణ్ముఖ్-దీప్తిలది చూడచక్కని జంట. అలాంటి వారు బ్రేకప్ చెప్పుకోడం అందిరితో పాటు నన్ను కూడా కలచివేసింది. మనం ఎన్ని చేసినా భారతీయులమనేది మరిచిపోవద్దు. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదు. టెక్నాలజీ పరంగా మీరు డెవలప్ అవ్వండి. కానీ కొన్ని విషయాల్లో చాలా సెన్సిటీవ్ అయిపోతున్నారు.తట్టుకునే గుణం ఈ కాలం పిల్లలకు చాలా తక్కువగా ఉంది. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. దీప్తి.. షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని నువ్వే చెప్పావు. బిగ్‌బాస్‌లో జరిగినదానికి షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పావని క్లియర్‌గా అర్ధం అవుతుంది.. మరి నువ్వు బిగ్ బాస్‌కి వెళ్లినప్పుడు ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నావో.. మీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశాం.. ఇది లవ్ ఏమో అని జనాలకి అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు. నీ వరకూ వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా? షణ్ముఖ్‌తో పెళ్లి కాలేదు కాబట్టి.. బ్రేకప్ చెప్పింది. అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్‌ని వదిలేసేదా? మనిషి అన్నాక తప్పులు చేస్తుంటారు.. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి తప్పుల్ని ఒకర్ని క్షమించుకోవాలి. ఓపికతో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి’అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. అలాగే టాటూల గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లికి ముందు టాటూలు వేయించుకున్న చాలా మంది విడిపోయారు. పెళ్లైన తరువాత వంద వేషాలు వేయండి.. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి’అని శ్రీరెడ్డి తనదైన స్టైల్లో చెప్పేసింది. -
ఆమె కోసం షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడు..రవి శాస్త్రి బ్రేకప్ స్టోరీ
ఆల్‌రౌండర్ రవి శాస్త్రి.. సినిమా హీరోకున్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు! అతని ఆటతోపాటు అపియరెన్స్నూ ఆరాధించారు అమ్మాయిలు! అతను బాలీవుడ్ నటి అమృతా సింగ్‌ను ప్రేమించాడు.. ఆమె కూడా రవి శాస్త్రి తోడును కోరుకుంది.. కానీ ఆ ప్రేమ .. పెళ్లి ఆహ్వానాన్ని పంపలేదు..ఆ బ్రేకప్‌కు కారణమేంటో తెలుసుకోవాలంటే ఇంకో బ్రేకప్ దగ్గర మొదలైన ఈ లవ్‌స్టోరీ చదవాలి.. పెళ్లయిందన్న విషయాన్ని దాచిపెట్టి తనతో ప్రేమ నటించిన సన్నీ డియోల్ మోసాన్ని తట్టుకోలేకపోయింది అమృతా సింగ్. కాస్త కటువుగానే అతనితో తెగతెంపులు చేసేసుకుంది. ఆ బాధను, దిగులును మరచిపోవడానికి కెరీర్ మీద ఏకాగ్రతను పెంచుకుంది. ఏ కాస్త వీలు దొరికినా స్నేహితులతో కలసి పార్టీలకు వెళ్లి సేద తీరేది. అలాంటి ఓ సందర్భంలోనే రవి శాస్త్రి పరిచయమయ్యాడు. అప్పటికి రవి శాస్త్రి గురించి కాస్తయినా అమృతాకు తెలుసు కానీ.. అమృతా గురించి ఆ క్రికెటర్‌కు ఏమీ తెలీదు. అయినా అమృతా నచ్చింది అతనికి.. తొలి చూపులోనే. మొదటి పరిచయంలోనే ఇద్దరూ చాలా సన్నిహితులైపోయారు. టెలిఫోన్ నంబర్లూ ఇచ్చిపుచ్చుకున్నారు. తెల్లవారి నుంచి టెలిఫోన్ సంభాషణలూ స్టార్ట్ చేశారు. తీరిక వేళల్లో.. అమృతా సింగ్ నటించిన సినిమాలు చూడకపోయినా.. ఆమె షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడు రవిశాస్త్రి. అమృతా అంతే.. క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా రవిశాస్త్రి కోసం అతనితో కలసి క్రికెట్ టూరింగ్ చేసింది. కాఫీ డేట్లు, డిన్నర్ మీట్లు సాధారణమయ్యాయి. వీళ్ల తీరుకి అది ప్రేమే అని గ్రహించిన మీడియా కథనాలు రాయసాగింది. అవునని కానీ.. కాదని కానీ కామెంట్ చేయలేదు ఆ జంట. చూసీ చూడనట్టే ఉండిపోయింది. కొన్నాళ్లకు జంటగా ‘సినీ బ్లిట్జ్’ మ్యాగజైన్ కవర్ మీద కనిపించింది ఆ జంట.. తమ మధ్య ప్రేమానుబంధం నిజమే అని ప్రకటిస్తూ! ‘చూశారా మేం చెప్పింది నిజమే’ అంటూ పేజ్‌త్రీ కాలమ్స్ థమ్స్ అప్ చేశాయి. నిశ్చితార్థం కూడా అయిపోయిందని చెప్పాయి. దీని గురించి కూడా మీడియా రాసింది.. ‘న్యూయార్క్‌లోని ఓ హోటల్లో రవిశాస్త్రి.. అమృతాకు ఉంగరం తొడిగాడు.. బహుశా అది ఎంగేజ్మెంట్ రింగ్ కావచ్చు’ అని. ఎవరు చెబితేనేం .. ఆ ఇద్దరి ప్రేమ నిజం.. వాళ్లిద్దరూ ఒక్కింటివాళ్లవ్వబోతున్నది మాత్రం అబద్ధంగా తేలింది. ఎందుకలా? వాళ్ల నిశ్చితార్థం సమయానికి ఇంకా చెప్పాలంటే ఆ జంట ఇష్క్‌లో ఈదుతున్నప్పటికీ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. అమృతా క్యాలెండర్ ఖాళీ లేనంత బిజీ. అదే రవి శాస్త్రికి ఇబ్బంది అనిపించింది. పెళ్లి కానంత వరకు అమ్మాయిలకు ఉద్యోగాలు ఉండొచ్చు కానీ పెళ్లయ్యాక ఇల్లాలికి ఇల్లే ప్రపంచం కావాలనే స్థిరమైన అభిప్రాయం అతనిది. అడిగాడు అమృతాను సినిమాలు మానేయమని. అప్పుడప్పుడే సక్సెస్‌ను.. స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న ఆమెకు అతని డిమాండ్ సమంజసమనిపించలేదు. అందుకే ‘సారీ’ అంది. అతనూ ‘సారీ’ అన్నాడు పెళ్లికి. అలా బ్రేక్ అయిపోయింది ఆ బంధం. ఎవరి దారిలో వారు.. అమృతాను కాదనుకున్నాక 1990లో రీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు రవి శాస్త్రి. సరిగ్గా ఏడాదికి అంటే 1991లో సైఫ్ అలీ ఖాన్ ఇల్లాలైంది అమృతా సింగ్. అయితే తమ పెళ్లయిన 22 ఏళ్లకు రీతూకు విడాకులిచ్చాడు రవి శాస్త్రి. తమ పెళ్లయిన పదమూడేళ్లకు అంటే 2004లో సైఫ్ అలీ ఖాన్‌తో వివాహబంధాన్ని రద్దు చేసుకుంది అమృతా సింగ్. రీతూ విడిపోయాక.. బాలీవుడ్ నటి.. లంచ్ బాక్స్ ఫేమ్ నిమ్రత్ కౌర్‌తో ప్రేమలో పడ్డాడని సోషల్ మీడియా మాట. దాన్నీ నిజంగా సమర్థించలేదు.. వదంతిగానూ కొట్టి పారేయలేదు ఆ ఇద్దరూ! జీవిత భాగస్వామి విషయంలో నాక్కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాస్త పురుషాహంకారిని కూడా. పెళ్లయ్యాక భార్యకు ఇల్లే లోకం కావాలని బలంగా నమ్ముతాను. అందుకే సినీ నటిని నా భార్యగా నేనాడూ ఊహించలేదు. – రవి శాస్త్రి క్షణం తీరికలేకుండా కెరీర్ సాగుతున్న టైమ్‌లో దాన్ని వదులుకునేందుకు నేనూ సిద్ధపడలేదు. కొన్నాళ్లు వేచిచూస్తే తెలిసేది.. భార్యగా.. తల్లిగా నేను సిద్ధమో..కాదో! – అమృతా సింగ్ - ఎస్సార్ -
పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి
నీనా గుప్తా.. నటనకు నిర్వచనం! వివియన్ రిచర్డ్స్.. క్రికెట్ సంచలనం! ఆమె అతని ఫ్యాన్.. అతని జీవన సహచరిగా కూడా కావాలనుకుంది.. కుదరలేదు.. ఆ వైఫల్యం మనసు నిండా బాధను నింపింది.. ఆ ప్రేమ ఇచ్చిన గుర్తును గుండెకు హత్తుకొని ముందుకు సాగింది.. అలా మొదలైంది.. 1980ల నాటి సంగతి.. ఇండియాతో సిరీస్ ఆడ్డానికి వెస్ట్ ఇండీస్ టీమ్ ఇక్కడికి వచ్చింది. ఆ సమయంలో వెస్ట్ ఇండీస్ టీమ్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్. ఆటగాడిగా ఎంత ఫేమస్సో లేడీస్ మన్‌గానూ అంతే పాపులర్. మ్యాచ్ షెడ్యూల్లో భాగంగా ముంబై చేరుకుందా టీమ్. ఒకరోజు పేజ్ త్రీ పార్టీకి హాజరయ్యాడు రిచర్డ్స్. ఆ పార్టీకి నీనా గుప్తా కూడా వచ్చింది. రిచర్డ్స్ అంటే వెర్రి అభిమానం ఆమెకు. అక్కడ అతను కనిపించేసరికి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతలోనే నీనా సన్నిహితులు ఆమెను రిచర్డ్స్కు పరిచయం చేశారు ‘మీ అభిమాని’ అంటూ. తనను చూసినప్పుడు నీనా కళ్లల్లో మెరిసిన మెరుపు అతణ్ణి కట్టిపడేసింది. నీనా అభిమానం ఆమె ముందు నుంచి కదలనివ్వకుండా చేసింది. ఆ ఇద్దరి మధ్య స్నేహం ఇంకా నిలదొక్కుకోకముందే ఆకర్షణ ఆ జంటను ప్రేమలోకి తోసింది. అప్పటికే రిచర్డ్స్ ఇద్దరు పిల్లల తండ్రి కూడా.. రిచర్డ్స్ అప్పటికే వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా! ‘నువ్వంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నాను’ అని నీనా అన్నప్పుడే తనకు పెళ్లయిన విషయం చెప్పేశాడు అని అంటారు ఆ జంట లవ్ స్టోరీ తెలిసిన సన్నిహితులు. అయినా నీనా .. రిచర్డ్స్ ప్రేమను ఆస్వాదించింది. సిరీస్ అయిపోయాక రిచర్డ్స్ స్వదేశం వెళ్లిపోయాడు. షూటింగ్స్ లేని ఖాళీ సమయాలను రిచర్డ్స్‌తోనే వెచ్చించింది.. అతని దేశంలో. ఆ సమయంలో రిచర్డ్స్ తన భార్యకు దూరంగా.. విడాకుల ఆలోచనలో ఉన్నాడని.. అయినా నీనా, రిచర్డ్స్‌ల మధ్య పెళ్లి ప్రస్తావన రాలేదని అప్పటి మీడియాలో వార్త. రిచర్డ్స్ ప్రేమలో ప్రపంచాన్ని మరచిపోయింది. ఆ సంతోషంలో ఆమె గ్రహించిన విషయం.. తాను తల్లిని కాబోతున్నానని. సంబరపడాల్సిందే కానీ.. పెళ్లి కాకుండా .. కరెక్ట్కాదు.. అన్నారు నీనా కుటుంబ పెద్దలు. మసాబా పుట్టింది.. రిచర్డ్స్ నుంచి ఏదైనా అనుకూలమైన నిర్ణయం వస్తుందేమోనని చూసింది నీనా. రాలేదు.. ‘పెళ్లి చేసుకోలేను’ అనే మాటను మార్చలేదు రిచర్డ్స్. అది నీనా మనసును కష్టపెట్టింది. అతని తీరు చూసి నీనా స్నేహితులూ హెచ్చరించారు..‘నువ్వు నీ గురించే ఆలోచించుకుంటున్నావ్ తప్ప పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించట్లేదు. పుట్టబోయే ఆ బిడ్డను సఫర్ చేయడం తప్ప నువ్వేం సాధించలేవు’ అని. వినలేదు నీనా. బిడ్డను కనాలనే తీర్మానించుకుంది. మసాబా పుట్టింది. సింగిల్ పేరెంట్.. ఒంటరి తల్లిగానే మసాబాను పెంచింది. ఆ ప్రయాణంలో నీనా తండ్రి ఆమెకు అండగా ఉన్నాడు. అయినా చాలా సమస్యలు ఎదుర్కున్నారు ఇటు నీనా.. అటు మసాబా కూడా. 42ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమ పండిట్ జస్రాజ్ కొడుకు శారంగ్దేవ్ పండిట్ నీనాతో ప్రేమలో పడ్డాడు. నిశ్చితార్థమూ జరిగింది. కానీ ఎందుకో అది పెళ్లిదాకా రాలేదు. దాంతో నీనా చాలా కుంగిపోయింది. ఇంక పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ.. తన 42వ ఏట.. అంటే 2002లో ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మిశ్రా.. నీనాతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లు కొనసాగిన ఆ ప్రేమ 2008లో పెళ్లిగా మారింది. ఆ వైవాహిక బంధం సంతోషంగా సాగిపోతోంది. ఒకసారి ముంబై మిర్రర్ ప్రతినిధి నీనా గుప్తాను ‘గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో దేని గురించైనా పునరాలోచించాల్సివస్తే దేన్ని పరిగణనలోకి తీసుకుంటారు?’ అని అడిగితే.. ‘పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది. ప్రతి బిడ్డకు తల్లి, తండ్రి ఇద్దరి ఆప్యాయత, సంరక్షణ అత్యంతవసరం. సింగిల్ పేరెంట్‌గా నేను ఏలోటు రానివ్వకుండా మసాబాను పెంచినా చెంత తండ్రి లేకుండా తనెంత సఫర్ అయిందో నాకు తెలుసు’ అని చెప్పింది. నాకు అమ్మ, నాన్న ఇద్దరి పట్లా అంతే ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇద్దరు ఎవరికి వారే గొప్ప వాళ్లు. నా చిన్నప్పుడు నాన్నతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. ఆయనతో మేము, మాతో ఆయన ఉండిపోలేదు కానీ సెలవుల్లో మాత్రం నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో గడిపేవాళ్లం. – మసాబా గుప్తా జీవితంలో నాకు రిగ్రెట్స్ ఉన్నాయి. పెళ్లి కాకుండా బిడ్డను కనేకంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సింది. అలా చేసుంటే నా జీవితం ఇలా ఇన్ని మలుపులు తిరిగుండకపోయేది! – నీనా గుప్తా ‘సచ్ కహూ తో’ అనే తన ఆత్మకథలో నిర్భయంగా, నిజాయితీగా చాలా విషయాలనే రాసింది నీనా గుప్తా. ∙ఎస్సార్ చదవండి: శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు 'స్పిరిట్'కు ప్రభాస్ రికార్డు స్థాయి పారితోషికం! -
సారికతో కపిల్‌దేవ్ బ్రేకప్ లవ్‌స్టోరీ
ఇద్దరు సెలబ్రిటీలు కలిస్తే భలే ముచ్చటగా ఉంటుంది.. అందునా భిన్నరంగాలకు చెందిన ఇద్దరు. అలా కలసిన వాళ్లే క్రికెట్ స్టార్.. హర్యానా హరికేన్ కపిల్‌దేవ్.., ఫిల్మ్‌స్టార్.. బాలీవుడ్ బ్యూటీ సారిక. వీళ్లిద్దరూ ములాఖాత్ అయ్యేలా చేసింది వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ భార్య. ఒక పార్టీలో సారికను కపిల్‌దేవ్‌కు పరిచయం చేసింది. అలా మొదలైంది ఆ ఇద్దరి మధ్య స్నేహం. విరామ సమయాల్లో కలుసుకోవడమూ స్టార్ట్ చేశారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. బంధంగా ఇమిడేందుకూ సిద్ధపడింది. ఆ టైమ్‌లో వీళ్ల లవ్ స్టోరీ హల్చల్ కూడా చేసింది. సారిక ముందే రోమీతో ప్రేమాయణం కపిల్‌దేవ్, సారిక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలనూ మోసింది మీడియా. నిజమే అన్నట్టుగా సారికను తన ఊరికి తీసుకెళ్లాడు కపిల్. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఇంకేం.. ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం అన్నంతగా కుతూహలం రేగింది ఇరువురి అభిమానుల్లో. కానీ.. కపిల్ బ్రేక్ చేసుకున్నాడు ఆ బంధాన్ని. కారణం.. సారికకు అతనికి స్పర్థలు రావడం కాదు. రోమీతో స్పర్థలు సర్దుకోవడం. అవును..సారిక.. కపిల్ జీవితంలోకి రాకముందే రోమీతో అతనికి ప్రేమాయణం ఉంది. రోమీ భాటియాను కపిల్‌కు పరిచయం చేసింది అతని అత్యంత ఆప్తమిత్రుడు సునీల్ భాటియా. సారికకు సారీ చెప్పీ రోమీతో లవ్ తొలి చూపులోనే రోమీతో ప్రేమలో పడిపోయాడు కపిల్. ఆమె చురుకుదనం అతన్ని కట్టిపడేసింది. ఆ ప్రేమ అలా సాగుతుండగా.. స్పర్థలు వచ్చాయి. దానికి కారణం.. సారికతో పరిచయం సన్నిహితంగా మెలిగేంత స్నేహంగా మారడమే అంటుంది హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం. అందువల్లే రోమీ మనసు నొచ్చుకొని సైలెంట్‌గా ..కపిల్‌కు దూరంగా ఉండిపోయిందనీ అంటారు కపిల్, రోమీ దోస్తులు కూడా. కాదు.. కపిల్ ప్రపోజ్ చేస్తే ఏమీ చెప్పకుండా మిన్నకుండిపోయింది. ఆ మౌనాన్ని కపిల్ అపార్థం చేసుకుని సారికకు దగ్గరయ్యాడనీ చెప్తారు కపిల్ మిత్రులు. సారికతో కపిల్ పెళ్లి అనే వార్తలు వినే రోమీ మళ్లీ కపిల్‌ను చేరుకుందనీ అంటారు. రోమీని మరచిపోలేని కపిల్ అందుకే వెంటనే సారికకు సారీ చెప్పేసి రోమీ చేయి అందుకున్నాడు.. అని వివరణ ఇస్తారు. కమల్ హాసన్‌తో ప్రేమలో పడ్డ సారిక ఏమైనా ఈ మొత్తం వ్యవహారం సారికను షాక్‌కి గురిచేసింది. జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. కమల్ హాసన్ స్నేహంతో త్వరగానే అందులోంచి బయటపడింది. అదే సమయంలో కమల్‌తో ప్రేమలోనూ పడింది సారిక. మళ్లీ రోమీ, కపిల్ ప్రేమ కథకు వస్తే.. పెళ్లి ప్రపోజల్‌ను ఈసారి కొంచెం సినిమా స్టయిల్లో రోమీ ముందు ఉంచాడట కపిల్. ఎలాగంటే.. ఒకసారి ఇద్దరూ కలసి రైల్లో ప్రయాణిస్తున్నారు (బహుశా ముంబై నుంచి కావచ్చు). సినిమా స్టైల్లో లవ్ ప్రపోజ్ చేసిన కపిల్‌దేవ్ రైలు ఒక అందమైన ప్రదేశానికి రాగానే.. కపిల్ వెంటనే సీట్లోంచి లేచి.. రోమీ ముందు మోకాళ్ల మీద వంగి.. కిటికీలోంచి ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ‘ఈ బ్యూటిఫుల్ ప్లేస్‌ను ఫొటో తీయగలవా డియర్.. భవిష్యత్‌లో మన పిల్లలకు ఈ ఫొటోస్ చూపిస్తూ మన ఈ ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా వాళ్లతో పంచుకోవచ్చు!’ అంటూ! ఆ మాట విన్న రోమీ సిగ్గు పడిపోయిందట.. పెళ్లికి ఓకే చెప్పేసిందట. అలా కపిల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త రోమీ భాటియాను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. పెళ్లి కాకముందు తండ్రి వ్యాపారాలు చూసుకున్న రోమీ పెళ్లయ్యాక కపిల్దేవ్కున్న హోటల్ వ్యాపారాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం ఇండియన్ సెలబ్రిటీస్‌లోనే అన్యోన్యమైన జంటగా పేరు కపిల్, రోమీ దంపతులకు. - ఎస్సార్ -
అర్జున్‌కపూర్-షాహిద్‌తో సోనాక్షి బ్రేకప్ స్టోరీ
థప్పడ్ సే డర్ నహీ లగ్తా సాబ్.. ప్యార్ సే లగ్తా హై! (చెంప దెబ్బంటే భయం లేదు సర్.. ప్రేమంటేనే భయం!) డైలాగ్‌తో పాపులర్ అయిన కథానాయిక.. అర్థమైపోయి ఉంటుంది ఎవరో?! అవును.. సోనాక్షీ సిన్హా. ఈ వారం ‘మొహబ్బతే’కి నాయిక కూడా! ఆమె ప్రేమ జీవితం.. అందులో వైఫల్యం.. సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. హిందీ, ఇంగ్లిష్ పత్రికలు, వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు.. వంటి రూమర్స్‌ని కూర్చి ఇస్తున్న కథనం ఇది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్. రాజ్‌కుమార్’ సినిమా గుర్తుందా? అందులో సోనాక్షీ సిన్హా, షాహిద్ కపూర్ హీరోహీరోయిన్లు. ఆ సెట్స్‌లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పుకారు. ‘నా జీవితంలో ఇద్దరే ఇద్దరిని ప్రాణప్రదంగా ప్రేమించాను’ అని షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా.. ఇంకొకరు సోనాక్షీ అనే నిర్ధారణకొచ్చారు షాహీద్, సోనాక్షీ జంటను అభిమానించే కొంతమంది. ఇందుకు కారణం లేకపోలేదు. ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి షాహిద్ కపూర్ ఆ సమయంలో తను ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడో ఆ సహచరితో వచ్చేవాడని.. అలా సెకండ్ సీజన్లో కరీనా కపూర్, థర్డ్ సీజన్లో ప్రియాంక చోప్రా, ఫోర్త్ సీజన్లో సోనాక్షీ సిన్హా, చివరకు భార్య మీరా రాజ్‌పుత్‌తో వచ్చాడని కామెంట్ చేశాడు షో హోస్ట్ కరణ్ జోహార్. ఇదే విషయమై షాహిద్‌ను అడిగాడు కూడా.. ‘నువ్వు కరీనా, ప్రియాంకతో డేట్ చేశావ్ కదా.. సోనాక్షీతో కూడా డేటింగ్లో ఉన్నావని రూమర్స్ వినిపిస్తున్నాయి’ అని. కాదని తోసిపుచ్చలేదు షాహిద్ కపూర్. అంతేకాదు ‘ఆర్. రాజ్‌కుమార్’ సెట్స్‌లో షూటింగ్ తర్వాత సోనాక్షీ, షాహిద్ సరదాగా షికారుకెళ్లేవారని, పార్టీలూ చేసుకున్నారనీ బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీనికి ఉదాహరణగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ‘షాహిద్‌ను ముద్దు పెట్టుకుంటున్న సోనాక్షీ సిన్హా’ ఫొటోను చూపిస్తారు. ఇదంతా నిజమే అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు ఎందుకు రాలేదో.. వాళ్లెందకు విడిపోయారో తెలియదు. కానీ వాళ్లిద్దరు మాత్రం విడివిడిగా ‘మేం మంచి స్నేహితులం.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ’ అని చెప్తారు మీడియా ఎప్పుడు ప్రశ్నించినా! ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్ సోనాక్షీ సిన్హా, అర్జున్ కపూర్ జంట కలసి నటించిన ‘తేవర్’ సినిమా షూటింగ్ అప్పుడే వాళ్లు ప్రేమలో పడ్డారని బాలీవుడ్ సినిమా పత్రికల కథనం. షూటింగ్ ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్, ముంబై శివారులోని థియేటర్లలో సినిమాలకూ వెళ్లేవారట. ఆ టైమ్‌లో పాపరాజీ కెమెరాలకూ చిక్కారనీ మీడియా కవరేజ్. అయితే ‘తేవర్’ సినిమా పూర్తవడంతోనే వీళ్ల ప్రేమా ముగిసిపోయిందనీ బాలీవుడ్ మాట. ఈ ఇరువురి మనస్తత్వాల్లోని వైరుధ్యమే ఆ బ్రేకప్‌కి రీజన్ అని ఇద్దరి సన్నిహితులు చెప్తారు. సోనాక్షీది అలాంటి తత్వమే.. ‘సోనాక్షీ చాలా ఎమోషనల్. ఏ ఫీలింగ్స్‌నూ దాచుకోలేదు. బేషరతుగా ప్రేమిస్తుంది. అర్జున్ కపూర్ ఇందుకు కాస్త భిన్నం. అతను గుంభనంగా ఉంటాడు. సోనాక్షీ స్ట్రాంగ్ ఎమోషన్స్‌ను సంభాళించలేకపోయాడు’ అని ఒక సోర్స్ కామెంట్. ‘ప్రేమ విషయంలో సోనాక్షీది సాధారణ అమ్మాయిల తత్వమే. అర్జున్ చుట్టే తన ప్రపంచాన్ని అల్లుకుంది. ఇది అర్జున్ను ఊపిరాడనివ్వకుండా చేసింది. ఏమైనా వాళ్ల బ్రేకప్‌కు ఆ ఇద్దరిలో ఎవరినీ బ్లేమ్ చేయలేం.. అదలా జరిగిపోయింది అంతే!’ అంటూ ఇంకో సోర్స్ విశ్లేషణ. సోనాక్షీ మాత్రం.. ‘సినిమా రంగంలోని అబ్బాయిని కాకుండా కాస్త మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని చూసుకోమని మా పేరెంట్స్ చెప్తుంటారు. చూద్దాం.. అలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా నా ప్రేమ విషయాన్ని ముందు మీకే షేర్ చేస్తాను’ అంటూ మీడియా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటూ ఉంటుందెప్పుడూ! ∙ఎస్సార్ -
ఆమెకు వీడ్కోలు.. శ్రద్ధాతో రొమాన్స్, చివరకు.. ఆదిత్య రాయ్ బ్రేకప్ స్టోరీ
ఆదిత్య రాయ్ కపూర్..సినిమా హీరోగా కన్నా ప్రేమికుడిగానే ఫేమస్. అతని విఫల ప్రేమ గాథే ఈ ‘మొహబ్బతే’లో... సిద్ధార్థ రాయ్ కపూర్ తమ్ముడిగా కాకుండా సొంత గుర్తింపుతోనే రాణిస్తున్నాడు ఆదిత్య రాయ్ కపూర్. అలాంటి ఐడెంటిటీ, సింప్లిసిటీ తోవలోనే నడుస్తున్న అహానా డియోల్ అంటే మనసు పడ్డాడు. అహానా ఎవరంటే.. ధర్మేంద్ర, హేమమాలినిల రెండో కూతురు. అమ్మ, నాన్న ఫేమ్‌తో కాకుండా స్వీయ ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం.. ప్రయత్నం ఆమెది. అందుకే సంజయ్ లీలాభన్సాలీ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ‘గుజారిష్’ సినిమాకు పనిచేయసాగింది. ఆ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ది కూడా ముఖ్య భూమిక. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరి ఆలోచన, ఆచరణ ఒకటే అవడంతో త్వరగానే స్నేహం కుదిరింది. ‘గుజారిష్’ విడుదలయ్యేలోపు ఆ ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. చెట్టపట్టాల్, చాటింగ్, అవుట్స్కట్స్లో హ్యాంగవుట్స్ ఈ లవ్ స్టోరీలోనూ షెడ్యూల్ అయ్యాయి. ఈ ప్రేమను ఆశీర్వదించే వాళ్లకంటే ఆ జంటను చూసి ఆందోళన చెందిన వాళ్లే ఎక్కువ.. అయ్యో.. చక్కటి కెరీర్‌ను ప్రేమ పాశంతో కట్టేసుకుంటున్నారే అని. అయినా నాలుగేళ్లు ఆ మోహంలో పడి కొట్టుకుపోయారిద్దరూ. అప్పుడు కలగజేసుకున్నారు ఇరువైపు పెద్దలు. పని మీదే దృష్టిపెట్టండని హెచ్చరించారు. లక్ష్యం గుర్తొచ్చింది ఇద్దరికీ. కలల్లోంచి బయటకు వచ్చారు. ఇద్దరి గమ్యం ఒకటే అయినా కలిసి చేయాల్సిన ప్రయాణం కాదని అర్థం చేసుకున్నారు. స్నేహపూర్వకంగానే వీడ్కోలు చెప్పుకున్నారు తమ ప్రేమకు. విడివిడిగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఆ బ్రేకప్ తర్వాత.. ఆదిత్య రాయ్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. శ్రద్ధా కపూర్‌తో. ‘ఆశికీ 2’ సినిమా సెట్స్ మీద. ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి సినిమా అది. ఆ జంట కెమిస్ట్రీకి బాక్సాఫీస్ బ్రహ్మరథం పట్టింది. ఆ సినిమా విషాదంతం కావడంతో బాధపడ్డారు. నిజ జీవితంలో ఈ ఇద్దరు జతకూడితే బాగుండు అని ఆశపడ్డారు అభిమానులు. వాళ్లు ఆశించినట్టుగానే మిత భాషి అయిన ఆదిత్యకు గలగలా మాట్లాడుతూ చలాకీగా ఉండే శ్రద్ధా అంటే ఇష్టం ఏర్పడింది. అలా ఆమె తన ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే చాలు.. అంతకన్నా జీవితానికింకేం కావాలి అనుకున్నాడు. ఆ మాటే ఆమెతో చెప్పాడు. స్వచ్ఛమైన నవ్వుతో ‘ఓకే’ అంది. ఆ ప్యార్ కంటిన్యూ అయింది. లేట్ నైట్ పార్టీలు.. ఏ కొంచెం టైమ్ దొరికినా ఏకాంతవాసాలు.. హాలీడేయింగ్లతో కాలాన్ని క్వాలిటీగా మలచుకున్నారు. పెళ్లితో శుభం కార్డ్ వేసుకుంటారనే భావించారు బాలీవుడ్ జనాలు. అయితే.. ‘ఆశికీ 2’ సినిమా స్క్రిప్ట్లాగే సాగింది వాళ్ల ప్రేమ కథ. శ్రద్ధా కపూర్ నటించిన సినిమాలు సక్సెస్ అవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్లిపోయింది. ఆదిత్య రాయ్ కపూర్‌కు మాత్రం ఇంకా స్ట్రగుల్ తప్పలేదు. అతని మనసులో ఎక్కడో ఓడిపోతున్న భావన. తగ్గట్టుగానే శ్రద్ధా తల్లిదండ్రులు ఆమె మీద ఆంక్షలు పెట్టారట.. ఆదిత్యతో చెలిమికి హద్దులు పెట్టుకోమని. శ్రద్ధా లెక్క చేయకపోయినా.. ఆదిత్య గ్రహించాడు. ఏ చలాకితనాన్నయితే జీవితాంతం తోడుగా కావాలనుకున్నాడో ఆ చలాకితనం నుంచి దూరం కోరుకోసాగాడు. ఆమె సక్సెస్ అతనిలో ఆత్మన్యూనత పెంచసాగింది. అది అసూయగా మారకముందే ఆ బంధంలోంచి బయటపడాలనుకున్నాడు. ఆదిత్యను అర్థం చేసుకున్న శ్రద్ధా అతనికి స్పేస్ ఇచ్చింది. పక్కకు తప్పుకున్నాడు. అతని నిర్ణయాన్ని గౌరవించింది ఆమె. అలా ఇద్దరూ విడిపోయారు. కాని మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. అయితే..ఈ జంట తమ ప్రేమ కథను ఎప్పుడూ ఒప్పుకోలేదు. చాలా పత్రికలు.. చానెళ్లు వాళ్ల మధ్య ఉన్న చనువు గురించి ప్రశ్నల వర్షం కురిపించినా బయటపడలేదు. ‘నేను సింగిలే. నా రిలేషన్షిప్ స్టేటస్ మారలేదు. నా దృష్టిలో ప్రేమ ఒక బాధ్యత. ఆ బాధ్యతను మోసేందుకు సిద్ధమయ్యాకే నచ్చిన మనిషితో కమిట్ అవుతా. ప్రస్తుతానికి నేను, శ్రద్ధా గుడ్ ఫ్రెండ్స్‌మి అంతే’ అని ఆదిత్య రాయ్ కపూర్, ‘ఆశికీ 2 సినిమా షూటింగప్పుడు, తర్వాత.. మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. మాకు అంటే నాకు, ఆదిత్యకే కాదు మోహిత్ సూరి (దర్శకుడు)కి కూడా. అలా ఆ సినిమా మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చింది. స్నేహం తప్ప మా మధ్య ఇంకేం లేదు. ఆ స్నేహాన్ని జీవితాంతం కాపాడుకుంటాం’ అని శ్రద్ధా కపూర్ చెప్పారు. - ఎస్సార్ -
రణ్వీర్ను పిలిచి, సోనాక్షీతో వేషాలేంటంటూ ఫైర్.. అనుష్క బ్రేకప్ స్టోరీ
రణ్వీర్ సింగ్ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. దేన్నయినా సరదాగా తీసుకొని ముందుకెళ్లిపోవడమే తెలుసు అతనికి! అనుష్కా శర్మ .. స్ట్రిక్ట్ అండ్ సీరియస్! బోల్డ్ అండ్ బ్యూటీఫుల్! నిజానికి ఈ పరస్పర విరుద్ధమైన స్వభావాలు కలిస్తే అద్భుతమైన గ్రామర్ క్రియేట్ అయ్యేది ప్రేమకు! కానీ స్వభావాలే గెలిచాయి కలవకుండా! ‘మొహబ్బతే’కు మరో బ్రేకప్ స్టోరీనిచ్చాయి.. Ranveer Singh&Anushka sharma Breakup Story: ఓ సినిమా స్క్రీనింగ్ జరుగుతోంది.. దానికి రణ్వీర్ సింగ్, అనుష్కా శర్మ హాజరయ్యారు. అందరూ సీరియస్‌గా సినిమాలో లీనమయ్యారు. ఇంతలోకి ఒక ప్రేక్షకుడు లేచి అనుష్కా దగ్గరకి వచ్చి మోకాళ్ల మీద వంగి ‘మీరంటే నాకు చాలా ఇష్టం. రబ్ నే బనాదీ జోడీ చూసి పిచ్చి ఫ్యాన్ అయిపోయా మీకు’ అన్నాడు ఉద్విగ్నంగా! ఊహించని ఆ చర్యకు అనుష్కా ముందు కంగారు పడ్డా ఆ అభిమాన్నాన్ని ఆస్వాదిస్తూ ‘ఇప్పటికీ ఇష్టపడుతున్నావా?’ అని అడిగింది అతన్ని. ‘ఇప్పటికీ.. ఎప్పటికీ’ అన్నాడా ఫ్యాన్ తన గుండె మీద చేయి వేసుకుంటూ! ఈ సీన్ చిరాకు తెప్పించింది ఆమె పక్కనే కూర్చున్న రణ్‌వీర్‌కు. ఒకింత కోపాన్నీ కూడా! వెంటనే అతని మీద విరుచుకుపడ్డాడు ‘ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆమె నా గర్ల్‌ఫ్రెండ్! ఇష్టం గిష్టమంటూ వాగితే మూతి పగులుతుంది జాగ్రత్త’ అంటూ! రణ్వీర్ ప్రతిస్పందనకు అక్కడున్న వాళ్లంతా హతాశులయ్యారు అనుష్కా సహా! ∙∙ 2011 .. ఐఫా అవార్డ్స్ ఫంక్షన్.. సోనాక్షీ సిన్హాతో కలసి ఆ ఫంక్షన్‌ను హోస్ట్ చేస్తున్నాడు రణ్వీర్. సరదా సంభాషణలు, మాటల చమక్కులు, జోకులతో ఆ వేడుకను రక్తి కట్టిస్తోందా జంట. ప్రేక్షకుల ఉత్సాహం చూసి రణ్వీర్ కాస్త చొరవ తీసుకున్నాడు సోనాక్షీ దగ్గర. దానికి ఆమేమీ ఇబ్బంది పడలేదు కానీ నటుల గ్యాలరీలో కూర్చున్న అనుష్కాకు మాత్రం ఇబ్బంది అనిపించింది. లేచి గ్రీన్ రూమ్‌లోకి వెళ్లి వేదిక మీదున్న రణ్వీర్ను పిలిపించింది.. ‘సోనాక్షీతో నీ వేషాలేంటీ? హద్దులో ఉండి హోస్ట్ చేయలేవా?’ అంటూ గట్టిగా అరిచింది అతని మీద అక్కడున్న అందరి ముందూ. చిన్నబుచ్చుకున్నాడు.. ఆవేశంతో ముక్కుపుటాలదరించాడు.. అవమానంతో ఆమెతో మాట్లాడ్డం మానేశాడు. ఆ మానేయడం కొన్నాళ్లపాటు సాగింది. దాంతో ఆ స్నేహం.. ప్రేమ బ్రేక్ అయిపోయాయి. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... రణ్వీర్ తొలి చిత్రం బ్యాండ్ బాజా బారాత్. అందులో కథానాయిక అనుష్కా. ఆ సెట్స్ మీదే వాళ్ల ప్రేమ మొదలైంది. నవ్వుతూ.. తుళ్లుతూ తన చుట్టూ వాతావరణాన్ని వైబ్రెంట్‌గా మార్చే రణ్వీర్.. మొదటి పరిచయంలోనే తెగ నచ్చేశాడు అనుష్కాకు. ఆమె స్వచ్ఛమైన నవ్వు.. ముక్కుసూటి తనం అతనికీ ఇష్టమయ్యాయి. ఊసులతో కాలక్షేపమే కాదు ‘ఈ ప్రేమ.. మనకు బలమవ్వాలే తప్ప బలహీనతగా మారకూడదు’ అంటూ బాసలూ చేసుకొని కెరీర్ వైపు కార్యోన్ముఖులూ అయ్యారు. ఆ జంట లవ్‌స్టోరీ స్టార్ట్ అయ్యేనాటికి అనుష్కా బాలీవుడ్లో నిలదొక్కుకుంది.. రణ్‌వీర్‌ది ఇంకా స్ట్రగ్లింగే! అయినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. సపోర్ట్ ఇచ్చుకుంటూ ప్రేమను కాపాడుకోసాగారు. కాగితం మీద రాసుకున్నంత.. గ్రాఫ్ గీసుకున్నంత సాఫీగా ఉండదు కదా ప్రాక్టికాలిటీ! అది ఆ ఇద్దరికీ ఇంకో సినిమా చూపించింది. వాళ్ల నిలకడ, సహనం, భద్రతకు పరీక్ష పెట్టింది. ముందు చెప్పుకున్న సంఘటనలే దానికి ఉదాహరణలు. ఇద్దరూ ఓడిపోయారు. ఒకే లక్షణంతో. దాన్ని అందరికీ అర్థమయ్యే ‘అభద్రత’ అనుకోవచ్చు.. ప్రేమ భాషలో ‘పొసెసివ్‌నెస్’గానూ చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరి మధ్య కొనసాగిన మౌనమే బ్రేకప్‌గా స్థిరపడిపోయింది. ఎవరి కెరీర్ గొడవల్లో వాళ్లు పడి ఆ ‘సైలెన్స్’ డ్యూరేషన్ను పొడిగించారు. తర్వాత రణ్వీర్ ఇంకో తోడును వెదుక్కున్నాడు.. అనుష్కాకూ ఇంకో చెలికాడితో జత కుదిరింది. అయితే రణ్వీర్ చాలా సందర్భాల్లో అనుష్కాను మిస్ అయినట్టు ఒప్పకున్నాడు. 2013లో ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ‘యెస్ ఐ మిస్ హర్. అనుష్కాను చాలా మంది అపార్థం చేసుకుంటారు కానీ తనలాంటి ఆనెస్ట్ పర్సన్‌ని నేనెక్కడా చూడలేదు. మనసులో ఉన్నదే మాటల్లో చెబుతుంది. చేతల్లో చూపిస్తుంది. నా గురించి నెగెటివ్‌గా రాసినా ఆవేశపడను కానీ.. అనుష్కా గురించి ఒక్క నెగటివ్ ఆర్టికల్ చదివినా కోపంతో రగిలిపోతాను. ఆమె అంటే నాకు చాలా అడ్మిరేషన్. షి ఈజ్ వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ అండ్ ఆనెస్ట్ పీపుల్’ అని చెప్పాడు. ఇప్పటికీ రణ్వీర్.. ఆమె అంటే అంతే గౌరవంతో ఉన్నాడు. అనుష్కా కూడా స్నేహభావంతోనే ఉంది. ఎక్కడ ఎదురుపడ్డా సాదరంగా పలకరిస్తుంది. ∙ఎస్సార్ -
ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్!
రోహిత్ శెట్టి.. మోడర్న్ బాలీవుడ్లో కమర్షియల్లీ ఎంటర్టైనింగ్ సినిమా ఫార్ములాను కనిపెట్టిన దర్శకుడు! హీరో వర్షిప్‌ను డైరెక్టర్ వర్షిప్‌గా బదలాయించిన వాడు.. టెక్నీషియన్స్ ఇమేజ్ను ఇనుమడింప చేసినవాడు! కెరీర్ గ్రాఫ్‌లో ఆకాశంతో పోటీపడ్తున్న ఈ ఫిల్మ్ మేకర్ ప్రేమ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్‌గానే ఉండిపోయాడు! అతని ప్రేమిక పేరు ప్రాచీ దేశాయ్. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్. ఈ ప్రేమ కథా సాదాసీదాగానే ప్రారంభమైంది. ఆ సంగతి చెప్పుకునే ముందు రోహిత్ శెట్టి పెళ్లి జీవితం గురించి తెలుసుకోవాలి. అతనిది పెద్దలు కుదిర్చిన వివాహం. భార్య పేరు మాయా. ఒక కొడుకు కూడా. ఇషాన్ శెట్టి. బాలీవుడ్‌లోని రోహిత్ శెట్టి పరిచయస్తుల ప్రకారం.. మరీ అన్యోన్య దాంపత్యం కాకపోయినా పొరపొచ్చాలతో సతమతమవుతున్న సంసారమేం కాదు. ప్రాచీతో ప్రేమలో పడ్డాడు రోహిత్. ‘బోల్ బచ్చన్’ సమయంలో. ఆ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌కు చెల్లెలుగా నటించింది ప్రాచీ దేశాయ్. నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా జెనీలియా డిసూజాను అనుకున్నారు. ఆమె సైన్ కూడా చేసింది. ఎందుకనో సినిమా మొదలయ్యే టైమ్‌కి జెనీలియా తప్పుకుంది. ప్రాచీ చేరింది. రోహిత్ ప్రేమ మొదలైంది. ఫిదాకాక తప్పలేదు ‘బోల్ బచ్చన్’ చిత్రీకరణ జైపూర్‌లో జరుగుతోంది. సీన్స్ వివరిస్తున్నప్పుడు ప్రాచీని చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది రోహిత్‌కు. వృత్తిపట్ల ఆమె నిబద్ధత.. పాపులారిటీ మాయని పట్టించుకోని ఆమె స్థితప్రజ్ఞత అతనికి బాగా నచ్చాయి. ఆకర్షణకులోను చేసే అందమెలాగూ ఉండనే ఉంది. ప్రేమ పెంచుకోవడానికి ఈ కారణాలు చాలు కదా! ప్రాచీని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెను ప్రత్యేకంగా ట్రీట్ చేయసాగాడు. షూటింగ్ ప్యాకప్ అవగానే డిన్నర్ డేట్స్, రొమాంటిక్ ఈవెనింగ్స్‌ను ఆస్వాదించసాగాడు ప్రాచీతో. రోహిత్‌కు పెళ్లయిన విషయం తెలిసున్న ఆమె తొలుత అతనితో ముభావంగానే ఉంది. కానీ హాస్య చతురతతో అతను ఇంప్రెస్ చేసిన తీరుకు ఫిదాకాక తప్పలేదు ఆమెకు. విడాకులకూ సిద్ధం ప్రాచీ ప్రాణమైపోయింది రోహిత్‌కు. సినిమా వర్క్ పూర్తయినా ఆమె చేయి వదల్లేదు. ఇంటికి వెళ్లడమే మానేశాడు. వాళ్లిద్దరూ సహజీవనం చేశారని చెప్తాయి బాలీవుడ్ వర్గాలు. వదంతులుగానూ ప్రచారం అయింది. అయితే ఆ విషయం మాయాకూ తెలిసింది రోహిత్ సన్నిహితుల ద్వారా. భార్యకు ప్రశ్నించే అవకాశమూ ఇవ్వలేదు.. ఎదురుగా వచ్చి తనూ వివరణ ఇవ్వలేదు. కుమిలిపోయింది మాయా. విడాకులకు సిద్ధమయ్యాడు రోహిత్. సంబంధించిన కాగితాలూ పంపాడు భార్యకు సంతకం చేయమని. ‘చస్తే చేయను’ అని భీష్మించుకుంది మాయా. ప్రాచీ ప్రేమను కలకాలం నిలుపుకోవడానికి మాయాతో తెగతెంపులు చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు. అయినా మాయా తగ్గలేదు. ఆమె వల్లే.. ప్రాచీ వల్ల బంగారం లాంటి కాపురం కూలిందనే కామెంట్లూ మొదలయ్యాయి. అవి ప్రాచీ చెవిన పడ్డాయి. కలత చెందింది. ‘నా వల్ల మీ ఇల్లు నాశనమవడం నాకిష్టం లేదు. ఏవేవో కామెంట్లు వింటున్నా. సారీ .. రోహిత్’ అని చెప్పింది ప్రాచీ. ‘అయ్యో.. మాకు ముందునుంచే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను విడిగానే ఉండాలనుకున్నా.. లక్కీగా నా లైఫ్‌లోకి నువ్ వచ్చావ్’ అంటూ ఆమెను ఒప్పించజూశాడు. వినలేదు ప్రాచీ. ఇంటికి వెళ్లిపొమ్మని కోరింది. వెళ్లిపోయాడు. నేరుగా మాయా దగ్గరికే. మళ్లీ ప్రాచీ, అతను కలుసుకోలేదు. అలా ఆ ప్రేమ కథ ముగిసిపోయింది. భార్యా, కొడుకుతో సంతోషంగానే ఉన్నాడు రోహిత్. ఒంటరిగానే మిగిలిపోయింది ప్రాచీ. ఏ రిపోర్టర్ అయినా ‘పెళ్లి ఎప్పుడు?’ అని అతి చనువుగా అడిగితే ‘పెళ్లి గురించి నాకు గొప్ప అభిప్రాయమేం లేదు. అదొక భద్రమైన వ్యవస్థగా కూడా ఫీలవట్లేదు. అలాగని పెళ్లి చేసుకోననీ అనట్లేదు. చేసుకుంటాను నాకు నచ్చిన మనిషి తారసపడ్డప్పుడు’ అని చెబుతుంది ప్రాచీ దేశాయ్. ‘ప్రాచీ వల్లే మీ పెళ్లి డిస్టర్బ్ అయిందా?’ అని మీడియా రోహిత్‌నూ ఎన్కౌంటర్ చేసినప్పుడు.. ‘లేదు. నా భార్యతో అంతకుముందు నుంచే నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఫేస్ చేశాను’ అని ప్రాచీకి చెప్పిన మాటనే మీడియాకూ చెప్పాడు రోహిత్. - ఎస్సార్ చదవండి: నా డిజిటల్ ఎంట్రీ గురించి భయంగా ఉంది: షాహిద్ కపూర్ -
ఆ హీరోయిన్ వల్లే భార్యకు హృతిక్ రోషన్ విడాకులు!
‘ఆయన గొప్ప నటుడు.. మంచి మనసున్న మనిషి. మహా అందగాడు. ఏ అమ్మాౖయెనా అతనితో ఇట్టే ప్రేమలో పడిపోతుంది’ అని చెప్పింది బార్బరా మోరీ.. హృతిక్ రోషన్ గురించి. ఆమె మెక్సికో దేశస్తురాలు. ‘కైట్స్’ అనే హిందీ సినిమాలో నటించింది హృతిక్ రోషన్ సరసన. ఈ ఉపోద్ఘాతంతో అర్థమైపోయి ఉంటుంది ఈ వారం మొహబ్బతే కథానాయిక, నాయకులెవరో! ‘కైట్స్’ సినిమా.. హృతిక్ రోషన్ వాళ్ల హోమ్ ప్రొడక్షన్. దర్శకుడు అనురాగ్ బసు. ప్రధాన నాయికగా బార్బరా మోరీ. మరో హీరోయిన్ కంగనా రౌనత్. అసలు విషయంలోకి వస్తే.. కైట్స్ సినిమా కోసం బార్బరా మోరీ ముంబై వచ్చింది. ఆమెకు కొత్త అయిన ఈ దేశంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత సహజంగానే హృతిక్ రోషన్ కుటుంబం తీసుకుంది. అద్దెకు సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి రాకపోకలకు వాహనాన్ని ఏర్పాటు చేయడం వరకు అన్నీ హృతిక్ రోషనే దగ్గరుండి చూసుకున్నాడు. వాటన్నిటినీ నోట్ చేసుకుంది మీడియా. షూటింగ్ మొదలైంది... సినిమా కంటే ముందే మొదలైన హృతిక్ రోషన్, బార్బరా స్నేహం ఆన్ సెట్స్‌లోనూ కొనసాగింది. కైట్స్ చాలా వరకు అమెరికా, మెక్సికో దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ ప్యాకప్ అయ్యాక కబుర్లు, వాహ్యాళి, లాంగ్ డ్రైవ్‌లతో కాలక్షేపం చేసేవారిద్దరూ. వీటన్నిటినీ ఫొటో జర్నలిస్ట్‌లు రికార్డ్ చేశారు. ఒక్కొక్కటిగా ప్రచురించాయి పత్రికలు. కైట్స్ కన్నా వాళ్ల ప్రేమ కథే ముందు విడుదలైంది. సుజైన్ ఖాన్ కూడా ఆ ప్రేమ చిత్రం వార్తలు విన్నది. బాధ పడింది. భర్త బార్బరాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడన్న వదంతుల గురించి. హృతిక్ ఆమెకు చిన్ననాటి స్నేహితుడు. ఇష్టపడి.. రెండు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల అన్యోన్య దాంపత్యం బాలీవుడ్లో చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి జంట మధ్య బార్బర చిచ్చు పెడుతోందనే వ్యాఖ్యానాలూ సుజైన్కు చేరాయి. ఆ బాధనే హృతిక్‌తో పంచుకుంది. భరోసా ఇచ్చాడు అతను. వాళ్ల కాపురం గురించి పత్రికల వాళ్లు గుచ్చిగుచ్చి అడిగినప్పుడు ‘రబ్బిష్. మీడియా క్రియేట్ చేసే ఈ రూమర్స్‌తోనే ఇద్దరం అప్సెట్ అవుతున్నాం తప్ప మా మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఎవరో చిచ్చు పెడితే బ్రేక్ అయిపోయేంత బలహీనం కాదు మా బంధం. చాలా స్ట్రాంగ్ ’ అని సమాధానమిచ్చింది సుజైన్. సినిమా సంగతికొస్తే.. కైట్స్ రిలీజ్ అయింది. పెద్దగా ఆడకపోయినా బార్బరా, హృతిక్ ఆన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది. ఆ కెమిస్ట్రీ వాళ్ల జీవితంలోనూ కొనసాగింది. నిజంగానే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. హృతిక్ చాలాసార్లు మీడియా ముఖంగా బార్బరాను స్తుతించాడు. ‘బార్బరా నన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. రియల్ ఫ్రెండ్ అంటే తనే’ అంటూ. ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకొంటూ ఆ ప్రేమ కథను మరింత చిక్కగా అల్లింది మీడియా. సాక్ష్యాలుగా బార్బరా వాడే వేనిటీ వ్యాన్‌ను చూపించింది. అత్యంత విలాస వంతమైన ఆ వాహనాన్ని హృతిక్ రోషనే కానుకగా ఇచ్చాడని.. దాని ధర దాదాపుగా రెండు కోట్లుంటుందనీ రాసింది. అంతేకాదు బార్బరా కోసం తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ అద్దెనూ హృతికే చెల్లించేవాడనీ చెప్పింది. బార్బరా ముంబైలో ఉన్నప్పుడు రాకేష్ రోషన్ వాళ్లింట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా హాజరయ్యేదనీ యాడ్ చేసింది. ఈ వివరాల్లో కొన్నిటినీ హృతిక్ ప్రవర్తనతో సరిపోల్చుకున్నట్టుంది సుజైన్. నిజాన్ని గ్రహించినట్టుంది. మొత్తం విషయం అర్థమైంది. ‘ఇక మనం కలసి ఉండడం కుదరదు’ అని తనిల్లు అనుకున్న ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది పిల్లలను తీసుకొని. ఇరువైపు పెద్దలు వాళ్లిద్దరి మధ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సయోధ్య కుదరలేదు. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. బార్బరా మోరీ, హృతిక్ రోషన్ల మధ్య ఉన్న ప్రేమా నిలువ లేదు. కైట్స్ సమయంలో సుజైన్.. బార్బరాకూ మంచి స్నేహితురాలైంది. తన వల్ల ఆమె బాధ పడిందని, చక్కటి జంట విడిపోయిందనే అపరాధ భావం బహుశా బార్బరాను వెంటాడి ఉండొచ్చు.. అందుకే హృతిక్‌తో తెగతెంపులు చేసుకొని ఉంటుంది. తను దూరమైతే హృతిక్ మళ్లీ సుజైన్కు దగ్గరవుతాడని బార్బరా అనుకొని ఉండొచ్చు అంటారు హృతిక్ సన్నిహితులు. కానీ ఆ ఆలుమగల మధ్య స్పర్థలకు బార్బర మాత్రమే కారణం కాదు.. బార్బరా కూడా ఒక కారణం అంటారు. వాళ్లన్నట్టుగానే బార్బరా వెళ్లిపోయినా హృతిక్, సుజైన్ మళ్లీ కలవలేదు. మంచి స్నేహితులుగా, పిల్లలకు ఏ లోటూ రానివ్వని తల్లిదండ్రులగా కొనసాగుతున్నారు అంతే! - ఎస్సార్ చదవండి: తెరవెనుక మహేశ్, ప్రభాస్ అలా ఉంటారు : సుబ్బరాజు -
భార్యకు విడాకులు, ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం!
‘ఒక అమ్మాయి కలలు కనే ప్రేమికుడిని కాను.. కోరుకునే భర్తను అంతకన్నా కాను. ప్రయత్నించాను కాని వల్ల కాలేదు. అనుబంధం అవగాహనను, రాజీపడడాన్ని ఆశిస్తుంది. ఆ రెండూ నాకు లేవు. అందుకే ప్రేమ, పెళ్లి రెండిట్లో ఫెయిల్ అయ్యాను. తోడు కన్నా ఏకాంతాన్నే ఎక్కువ కోరుకుంటుంది నా మనసు’ అంటూ తనను తాను విశ్లేషించుకుంటాడు బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్. సుష్మితా సేన్ ఆయన జీవన వైఫల్య చిత్రమే ఇది... విశ్వసుందరి సుష్మితా సేన్ మొదటి సినిమా ‘దస్తక్’. దానికి దర్శకుడు విక్రమ్ భట్. అప్పుడు సుష్మితకు 20 ఏళ్లు. విక్రమ్‌కు 27. ఈ ప్రస్తావన ఎందుకంటే ఆ లవ్ ఫెయిల్యూర్‌కి విక్రమ్ తమ వయసునే కారణంగా చూపాడు కాబట్టి. ‘దస్తక్’ సినిమా సెట్స్‌లో విక్రమ్‌ను బాగా పరిశీలించింది సుష్మిత. పని పట్ల అతనికున్న నిబద్ధత ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అతణ్ణి సమ్మోహనపరిచింది. ప్రేమ మొదలవడానికి ఈ ప్రారంభం చాలు కదా! ఒకరికోసం ఒకరన్నట్టుగా అయిపోయారు. బాలీవుడ్లో గుసగుసలు పత్రికల్లో గాసిప్స్ కాలమ్‌ను నింపేశాయి. దస్తక్ షూటింగ్ కోసం యూనిట్ అమెరికా వెళ్లింది. అక్కడ స్వేచ్ఛను ఆస్వాదించిందీ జంట. ఆ కబురును ఇక్కడ అందుకుంది అదితి భట్. భార్య అదితితో విక్రమ్ సహించలేదు.. క్షమించలేదు విక్రమ్ భార్య అదితి.. బచ్పన్ కీ దోస్త్.. ఫస్ట్ క్రష్. సుష్మితా సేన్‌తో అతను ప్రేమలో పడేనాటికే రెండేళ్ల వైవాహిక బంధం వాళ్లది. ఒక కూతురు కూడా. ఎన్నో ఆశలతో విక్రమ్ జీవిత భాగస్వామిగా అత్తింట్లోకి అడుగుపెట్టింది అదితి. అత్త, మామలు ఆమెను ఆహ్వానించిన తీరుకు నివ్వెరపోయింది. తన పట్ల వాళ్ల ప్రవర్తనకు నిర్ఘాంతపోయింది. తల్లిదండ్రుల పద్ధతిని విక్రమ్ విమర్శించకపోయినా తనకే అండగా ఉన్నాడు.. ఉంటాడు అన్న భరోసాతో ఆ ఇబ్బందులను భరించింది. బిడ్డ కోసం భర్త నిర్లక్ష్యాన్నీ క్షమించింది. కానీ ఎప్పుడైతే సుష్మితా సేన్‌తో అతని వ్యవహారం తెలిసిందో అప్పుడు సహించలేక ప్రశ్నించింది. ఆమెతో రాజీపడే ప్రయత్నం అతనూ చేయలేదు. దాంతో విడాకులతో వేరైంది ఆ జంట. ప్రేమికుడిగానూ ఓడిపోయాడు ఇటు సుష్మితా సేన్ మీద ప్రేమనూ గెలిపించుకోలేకపోయాడు విక్రమ్. ఆ లవ్ స్టోరీ ఎంత వేగంగా మొదలయిందో అంతే వేగంగా ముగిసిపోయింది. ఎవరికోసం భార్య, బిడ్డను వదులుకున్నాడో ఆ తోడునూ నిలుపుకోలేకపోయాడు. ఒంటరివాడయ్యాడు. నిరాశ పట్టుకొని పీడించసాగింది. నిస్పృహతో తనుండే ఆరవ అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుంచి దూకేయాలనుకున్నాడు. విచక్షణ ఒళ్లు విరుచుకోకపోతే దూకేసేవాడే. సుష్మితాను మరచిపోయి బతుకు మీద ప్రీతి కలగాలంటే పనిమీద దృష్టి పెట్టాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అమీషా పటేల్ ఆంఖే... ఆ సమయంలోనే ‘ఆంఖే’ సినిమాకు సిద్ధమయ్యాడు. కథానాయికగా అమీషా పటేల్ సైన్ చేసింది. సెట్స్‌లో ఇద్దరూ స్నేహితులయ్యారు. అతని గుండెలో గూడుకట్టుకున్న దిగులుకు ఆమె సాంత్వన అయింది. ఆమె కెరీర్ సమస్యలకు అతను శ్రోతలా మారాడు. నెమ్మదినెమ్మదిగా అమీషా పటేల్ నవ్వు విక్రమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపసాగింది. మనసు ఎంత చెడ్డదంటే.. కాస్త ఆప్యాయంగా పలకరించే మనిషి కనపడితే చాలు అల్లుకుపోదామని చూస్తుంది.. మునుపటి అనుభవాల చేదు ఇంకా వీడకున్నా సరే! విక్రమ్.. అమీషాను ప్రేమించసాగాడు. అమీషా కూడా విక్రమ్‌ను ఇష్టపడింది. ఆ ప్రేమ అయిదేళ్ల కాలాన్ని ఇట్టే చుట్టేసింది. ఆ ఇద్దరూ పెళ్లాడతారనే అనుకున్నారు బాలీవుడ్లో అంతా! కానీ వాళ్లిద్దరూ తమ ప్రేమను బ్రేక్ చేసుకున్నారు. అమీషా, విక్రమ్ దీనికి కారణం.. అమీషా తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి కావచ్చు అంటారు ఆ ఇద్దరికీ సంబంధించిన సన్నిహితులు. విక్రమ్ భట్ మాత్రం ‘ఆమె తన కెరీర్ కోసం తపన పడింది.. నేను తన కోసం తపన పడ్డాను. ఆమె కోసమే ఉన్నాను. ఇంతకన్నా ఏం చేయాలి? అల్రెడీ ఒక రిలేషన్‌ను మనసు మీదకు తీసుకుని కోలుకోలేనంతగా దెబ్బతిన్నాను. ఇప్పుడు మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లదలచుకోలేదు’ అంటాడు. సుస్మితాసేన్ విషయంలో ‘తప్పు మా ఇద్దరిదీ కాదు. మా వయసులది. పరిపక్వతలేని మా మనస్తత్వాలది’ అని చెప్తాడు. భార్య, కూతురికి తను మిగిల్చిన బాధ గురించి ‘జీవితంలో నాకున్న రిగ్రెటల్లా అదొక్కటే. వాళ్లనలా వదిలేయాల్సింది కాదు. ధైర్యం లేని వాడే జిత్తులు పన్నుతాడు. నేను అలాంటి పిరికివాడినే. అదితిని వదిలేసి నేనెంత తప్పు చేశానో, ఎంత వేదనను అనుభవించానో ఆమెతో చెప్పే ధైర్యం నాకు లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ పాఠాలే నాకు’ అంటాడు విక్రమ్ భట్. ప్రస్తుతం అతని కూతురు కృష్ణ.. తండ్రికి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. కూతురికి ప్రొడక్షన్ మెళకువలు నేర్పిస్తూ ఆమె కెరీర్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు విక్రమ్ భట్. - ఎస్సార్ చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ నా మాజీ భర్త వల్లే సినిమాలకు దూరం: నటి -
ప్రియాంకకు షారుఖ్ కిస్: విడాకులిస్తానని భార్య బెదిరింపులు!
కాజోల్ అండ్ షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ మోడర్న్ డేస్‌లో.. బాగా ఫేమస్ అయిన జంట. ఆ ప్రేమను తెర వరకే ప్రదర్శించి జీవితంలో విడిపోని స్నేహాన్ని మిగుల్చుకున్నారు. ప్రియాంక చోప్రా అండ్ షారుఖ్ ఖాన్.. తెర మీద రెండు సినిమాల్లోనే (డాన్ సిరీస్) కనిపించిన జంట.. జీవితంలో ప్రేమను పంచుకుని.. కలకాలం నిలుపుకోవాలనుకున్నారు.. ఆ కల నెరవేరేదేనేమో.. షారుఖ్ ఖాన్ జిందగీలో గౌరీ ఖాన్ భాగస్వామ్యం లేకుండా ఉండుంటే! అదివరకే అయిపోయిన ఈ పెళ్లివల్లే తర్వాత పుట్టిన ఆ ప్రేమ బ్రేక్ అయింది! ఆ స్టోరీ... షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా కలిసి నటించకముందు నుంచే ఇద్దరూ స్నేహితులు. బాలీవుడ్‌లోని పార్టీల్లో ఆ స్నేహం కుదిరింది. ఆమె నవ్వు, లౌక్యంలేని ప్రవర్తన షారూఖ్‌ను ఆకర్షించింది.. ఇష్టపడేలా చేసింది. ఆమెతో సమయం గడపడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునే వాడు కాదు. తను హాజరయ్యే ఫంక్షన్లు, ఈవెంట్స్‌కు ప్రియాంకనూ పిలవమనీ హోస్ట్లను, నిర్వాహకులను కోరేవాడు. సూపర్ స్టార్ మాటను కాదనలేక ప్రియాంకతో పరిచయం లేకపోయినా ఆమెను పార్టీలకు పిలిచిన సందర్భాలెన్నోనట. అలాగే ఒకసారి కరణ్ జోహార్ బర్త్‌డేకూ ప్రియాంకని ఆహ్వానించమని కరణ్‌ను బలవంతపెట్టాడు షారుఖ్. స్నేహితుడిని చిన్నబుచ్చడం ఇష్టంలేక ప్రియాంకను పార్టీకి పిలిచాడు కరణ్. పార్టీకి వచ్చిన ప్రియాంక బుగ్గ మీద ముద్దుపెట్టుకొని మరీ రిసీవ్ చేసుకున్నాడు షారుఖ్. అతని వ్యవహారం కరణ్‌కు నచ్చలేదు. గౌరీకి మింగుడు పడలే. డాన్ డాన్ (అమితాబ్ బచ్చన్ ‘డాన్’కి రీమేక్) సినిమాతో ప్రియాంక చోప్రాతో నటించే అవకాశం వచ్చిందని పొంగిపోయాడు షారుఖ్. ఆ సినిమా సెట్స్‌లోనే వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది. అవుట్‌డోర్‌లో తెల్లవారు జాము మూడింటిదాకా కబుర్లు చెప్పుకుంటూ ఈ జంట యూనిట్ సభ్యుల కంట పడింది. ప్రశ్నార్థకంగా చూసిన వాళ్లకు ‘రిహార్సల్స్’ అని బదులిచ్చారు. డాన్ సిరీస్ వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనీ సూపర్ హిట్ చేసింది. ప్రియాంక మీద షారుఖ్ ప్రేమా స్థిరపడింది. తనకే సినిమా ఆఫర్స్ వచ్చినా అందులో హీరోయిన్గా ప్రియాంకను తీసుకోమ్మని నిర్మాత, దర్శకులను అడిగేవాడట షారుఖ్. కమర్షియల్ యాడ్స్‌లోనూ తన పక్కన ప్రియాంకను సైన్ చేయమని డిమాండ్ చేసేవాడని చెప్తాయి బాలీవుడ్ వర్గాలు. తన ఐపీఎల్ టీమ్ మ్యాచెస్కూ ప్రియాంకను వెంట తీసుకెళ్లేవాడు. షారుఖ్ కనిపించే ప్రతి పబ్లిక్ ఈవెంట్లో పక్కన ప్రియాంక ఉండాల్సిందే. ఈ దృశ్యాలను ఫొటో జర్నలిస్ట్‌లు బాగా క్యాచ్ చేశారు. వార్నింగ్ షారుఖ్ తీరుతో గౌరీ అభద్రతకు లోనైంది. సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చింది.. ‘ప్రియాంక చోప్రాతో తిరగడమే కాదు కలిసి సినిమాలు చేయడమూ బంద్. వినకపోతే విడాకులు ఖాయం’ అని. బాధపడ్డాడు.. కుమిలిపోయాడు. చివరకు కుటుంబమే ముఖ్యమని గౌరీ మాటను గౌరవించాడు. అటు నుంచీ నరుక్కొచ్చింది గౌరీ సినీరంగంలోని తన స్నేహితులు కరణ్ జోహార్, సుసాన్నే ఖాన్ వంటివాళ్ల సహాయంతో. ప్రియాంకను తమ సినిమాల్లోకి తీసుకోవద్దని కరణ్ జోహార్ ద్వారా నిర్మాతలకు, తమ భర్తల పక్కన హీరోయిన్గా అవకాశాలు ఇవ్వద్దని సుసాన్నే ద్వారా ఇతర హీరోల భార్యలకూ చెప్పించింది. సదరు నిర్మాతలు, హీరోల సినిమాల్లో చాన్స్‌లు రాలేదు ప్రియాంకకు. ఇటు లవ్ లైఫ్ బ్రేక్ అయింది. తట్టుకోలేకపోయింది. అది అలాగే కొనసాగితే డిప్రెషన్లోకి వెళ్లిపోయి పర్సనల్ లైఫ్‌నూ కోల్పోతానని అర్థమైంది ప్రియాంకకు. దృష్టి మ్యూజిక్ మీదకు మళ్లించింది. ఆ బ్యాలెన్స్ ఆమెను నిలబెట్టింది. సినిమాలతోపాటు పాశ్చాత్యా సంగీత ప్రపంచానికీ ఆమె సంతకాన్ని చూపించింది. నిశ్శబ్దంగా ఆ ఇద్దరి దారులు వేరయ్యాయి. ఆ ప్రేమ మూగబోయింది. రాకేశ్ శర్మ బయోపిక్ ‘సెల్యూట్’లో ప్రియాంకకు అవకాశం వచ్చింది. దాంట్లో షారుఖ్ హీరో అని తెలిసి ఆ ఆఫర్‌ను తిరస్కరించింది ఆమె. చానాళ్ల తర్వాత డర్టీ లాండ్రీ అనే అంతర్జాతీయ టాక్ షోకి ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె వేసుకున్న జాకెట్నుద్దేశించి ‘చాలా బాగుంది’ అని హోస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్ లాంటి ప్రశ్నకు ‘ఇది నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ది. ఇందులోనే నా లైఫ్ ఉంది’ అని ప్రియాంక ఇచ్చిన సమాధానం సెన్సేషన్ అయింది. అంతకుముందు అదే జాకెట్ వేసుకొని షారుఖ్ చాలా సార్లు కనిపించాడని, ఆ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ అతనే అనే కామెంట్స్‌తో ఆ రెండు ఫొటోలూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజం చెప్పాలంటే మిగతా యాక్టర్స్ కంటే ప్రియాంకతో నటించేప్పుడే చాలా కంఫర్ట్‌గా ఫీలవుతాను. మిగతా వాళ్లంతా నన్ను స్టార్‌గా చూస్తే తను మాత్రం నన్ను కోస్టార్లా.. ఫ్రెండ్‌లా చూస్తుంది. కెమెరా ముందు నా జుట్టు చెదిరినా వెంటనే సరి చేస్తుంది. ఎన్విరాన్మెంట్ను ఈజ్ చేస్తుంది. ఆమెతో ఉంటే కాలం తెలియదు. తను నాకత్యంత ఆప్తురాలు. – షారుఖ్ ఖాన్, ఒక ఇంటర్వ్యూలో - ఎస్సార్ చదవండి: బిపాసా బసు - జాన్ అబ్రహం విఫల ప్రేమ కథ మేకప్ లేకుండా ఈ స్టార్ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా? -
విద్యాబాలన్ వల్ల కరీనా, షాహిద్ విడిపోయారా?
కరీనా కపూర్, షాహిద్ కపూర్లకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. నటీనటులుగా ఎంత ఫేమసో ప్రేమికులుగానూ అంతే పాపులర్.. కిస్మత్ కనెక్షన్ ఫెయిలయ్యి ఈ ‘మొహబ్బతే’కు నాయికా, నాయకులుగా మారారు... కరీనా, షాహిద్.. ఇద్దరివీ పరస్పర విరుద్ధ మనస్తత్వాలు. ఆమె కొంచెం అహంభావి.. అతను కాస్త ఆకతాయి. ఆమెలోని ఆ అహం ఆత్మవిశ్వాసంగా అతణ్ణి ఆకర్శించింది. అతనిలోని ఆకతాయి తనం హీరోయిజమ్గా ఆమె మనసును దోచుకుంది. అలా ఆ ప్రేమ కథ మొదలైంది. సినిమాల్లో కరీనా.. షాహిద్ కన్నా సీనియర్. షాహిద్ తొలి సినిమా ‘ఇష్క్ విష్క్’చూసి అతనికి ఫ్యాన్ అయింది. ఎలాగైనా ఆ అబ్బాయిని కలవాలని ఉవ్విళ్లూరింది. కలిసింది. తొలి పరిచయంలోనే ఒకరినొకరు ఆకట్టుకున్నారు. వారం తర్వాత వాళ్ల డేటింగ్ మొదలైంది. ‘నువ్వంటే ఇష్టం’ అని తొలుత కరీనానే చెప్పింది షాహిద్‌తో. ‘నాకూ ఇష్టమే’ అని చెప్పాడు. షూటింగ్ ప్యాకప్ చెప్పగానే చట్టాపట్టాల్తోనే సాయంకాలాలు గడిచిపోయేవి. బాలీవుడ్లో ఈ ముచ్చట భలే సందడి చేసింది. అది కరీనా వాళ్లమ్మ బబిత, అక్కయ్య కరిష్మానూ చేరింది. కెరీర్ పట్ల కరీనా సీరియస్‌గా లేదని అర్థమైంది వాళ్లకు. ఆమె మెదడులోంచి షాహిద్‌ను తప్పించే ఆలోచనలు చేయసాగారు. అతనే హీరో.. తన ప్రేమను స్క్రీన్ మీదకూ తెచ్చింది కరీనా... తను చేసే సినిమాల్లో హీరోగా షాహిద్‌ను తీసుకొమ్మని నిర్మాతలను కోరుతూ. ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా కాదనలేకపోయారు నిర్మాతలు. అలా వాళ్లిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ‘ఫిదా’ విడుదలైంది. ఫ్లాప్ అయింది. అయినా కరీనా పట్టు వీడలేదు. ‘36 చైనా టౌన్’, ‘మిలేంగే మిలేంగే’, ‘చుప్ చుప్ కే’ చిత్రాలూ వచ్చాయి ఈ ఇద్దరి కాంబినేషన్లోనే. తెర మీద ఆ జంట ప్రేక్షకులను మెప్పించలేకపోతోందని గ్రహించారు దర్శకనిర్మాతలు. కరీనా తీరు బబిత, కరిష్మాకూ నచ్చలేదు. వ్యక్తిగతాన్ని కెరీర్‌తో ఎందుకు ముడిపెడుతున్నావ్? అది అన్‌ప్రొఫెషనల్’ అని బబిత కూతురిని హెచ్చరించింది కూడా. షాహిద్‌తో ప్రేమ బంధం తెంచుకొమ్మని అక్క కరిష్మా సలహా ఇచ్చింది చెల్లెలికి. జబ్ వి మెట్ నిజ జీవితంలోని వాళ్ల ప్రేమను తెర మీద ఎలా ప్రెజెంట్ చేయాలో.. ఆ జంటను ప్రేక్షకులు ప్రేమించేలా ఎలా చూపించాలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. చక్కటి స్క్రీన్ ప్లేనూ అల్లుకున్నాడు. ‘జబ్ వి మెట్’ సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. తెర మీద ఆ జంటకు క్రేజ్ పెరిగింది. దాన్ని క్యాచ్ చేసుకుంది మీడియా.. ఆ రియల్ లవ్ స్టోరీని మళ్లీ ఒకసారి ప్రచురించి.. ప్రసారం చేసి. కానీ.. జబ్ వి మెట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే షాహిద్, కరీనాల ప్రేమ బంధం బలహీనపడసాగింది. ఇంట్లో కరీనాకు షాహిద్‌తో తెగతెంపులు చేసుకొమ్మనే పోరు ఎక్కువైంది. అదే సమయంలో షాహిద్ .. విద్యాబాలన్‌తో చనువుగా మెదులుతున్నాడనే వార్తలూ కరీనా చెవిన పడ్డాయి. షాహిద్‌ను నిలదీసింది. సమాధానం చెప్పలేదు. ఆమె మనసు ముక్కలైంది. ‘జబ్ వి మెట్’ సినిమా టైమ్‌లోనే కరీనా తషన్ సినిమా కూడా చేస్తోంది. ఆ సెట్స్‌లో సైఫ్ అలీఖాన్‌తో తన బాధను పంచుకుంది. షాహిద్‌తో దూరం పెరిగింది. జబ్ వి మెట్ సెట్స్‌లో ఆ ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. ఆ సినిమా క్రూ కూడా పసిగట్టింది ‘ఏదో జరిగింది’ అని. అయినా ఆ జంట సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించకుండా చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించి సినిమానూ పూర్తి చేశారని జబ్ వి మెట్ టెక్నీషియన్స్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. విధి భలే విచిత్రమైంది.. కరీనా, షాహిద్ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డన్నాళ్లు తెర మీద వాళ్ల జంట ఫెయిల్ అయింది. తెర మీద యాక్సెప్టెన్స్ వచ్చేప్పటికి నిజ జీవితంలో వాళ్ల మధ్య ప్రేమ లేకుండా పోయింది. ఆ బ్రేకప్ వాళ్లిద్దరినీ చాన్నాళ్లపాటు వేధించింది. ఆ బాధను చూసి కాలానికీ జాలేసిందేమో.. ఆ జ్ఞాపకాల్లోంచి ఇద్దరినీ బయటపడేసింది. మావి డిఫరెంట్ పర్సనాలిలిటీస్. ఆ డిఫరెన్సే మా ఇద్దరిలో ఉన్న ఖాళీని పూరించింది. – షాహిద్ షాహిద్, నేను ఇంచుమించు ఒకే వయసువాళ్లవడం వల్ల త్వరగా కనెక్ట్ అయ్యాం. ఆ సేమ్ టెంపర్మెంటే బ్రేకప్‌కి కారణమై ఉండొచ్చు. – కరీనా కపూర్ - ఎస్సార్ చదవండి: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధు ప్రియ -
Bipasha Basu Love Story: బ్రేకప్ నరకమే, కానీ..
ప్రేమ జీవితపు కాలపు గ్యారెంటీ, వారెంటీ ఇవ్వదు.. ఈ కథకు బిపాషా బసు, జాన్ అబ్రహమ్లే నాయికా, నాయకులు! ఇద్దరూ మధ్యతరగతి విలువలతో పెరిగి జీవన ప్రయాణంలోని అనుభవాలతో పరిణతి సాధించిన వాళ్లే! ఇద్దరూ నిజాయితీని ఆస్తిగా భావిస్తారు. . అందం.. హ్యాండ్సమ్నెస్లో ఎవరికివారే సాటి. ఆమెను చూస్తే మహిళలకు గుండె ధైర్యం పెరుగుతుంది.. మగవాళ్ల గుండె జారుతుంది. అతను.. పురుషులకు అద్భుతంగా కనిపిస్తాడు.. స్త్రీలకు కనికట్టు చేస్తాడు. ఈ పర్ఫెక్ట్నెస్తోనే వాళ్ల మధ్య ప్రేమ ఇమడలేకపోయింది. ఇద్దరినీ చెరో ఒడ్డుకి చేర్చింది. ‘జిస్మ్’ సినిమా సెట్స్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బిపాషా బోల్డ్‌నెస్‌ను గౌరవించాడు అతను. పనిపట్ల జాన్‌కున్న సీరియస్‌నెస్‌ను ఆమె ఆరాధించింది. పరస్పరం ఉన్న ఇష్టాన్ని వ్యక్తపర్చుకున్నారు. స్క్రీన్ మీద ఈ జంటకు అభిమానులు పెరిగారు. వీళ్లు కలిసి నటించిన సినిమాల్లో కొన్నయితే కథతో సంబంధం లేకుండా కేవలం వీళ్ల కెమిస్ట్రీ పండే హిట్ అయ్యాయి. రియల్ లైఫ్‌లోనూ వీళ్ల ప్రేమ వేనోళ్ల ప్రశంసలు అందుకుంది. ఆ ఇద్దరు కూడా ఏ రోజూ వాళ్ల వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. ‘మేం మామూలు ఫ్రెండ్స్ అంతే’ అనే ఫేక్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. ముఖ్యంగా బిపాషా.. జాన్‌తో తాను సహజీవనం చేస్తున్నాననే చెప్పింది. అయిదేళ్లు గడిచాకా.. ఒకసారి ‘కాఫీ విత్ కరణ్ షో’కి బిపాషా, జాన్‌లను పిలిచాడు కరణ్. ఆ ఇద్దరికీ కంపాటబులిటీ టెస్ట్ పెట్టాడు విడివిడిగా. ఇద్దరూ ఇంచుమించు పదికి తొమ్మిది మార్కులు తెచ్చుకున్నారు. ఆ షోలో ఒకరి పరోక్షంలో ఒకరు తమ సహచరి/ సహచరుడి అభిరుచులు, అలవాట్లు, సర్దుబాట్ల గురించి చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. ఇంప్రెస్ చేశాయి. ఆ ప్రేమ జంటకు వీరాభిమానులను చేశాయి. షో యూట్యూబ్ స్ట్రీమింగ్కు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను చేర్చాయి. తొమ్మిదేళ్లు కావొచ్చాయి.. కెరిర్లో ఇద్దరూ బిజీ అయిపోయారు. అయినా బిపాషా జాన్‌తో పెళ్లే ముఖ్యమనుకుంది. ఆ ప్రేమను కాపాడుకోవడమే పరమావధిగా తీసుకుంది. జాన్‌ను అడుగుతూనే ఉంది ‘పెళ్లెప్పుడు చేసుకుందాం?’ అంటూ. అతణ్ణించి స్పష్టమైన సమాధానం రాలేదు. కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడులే.. చేయనీ. ఎప్పుడో ఒకప్పుడు చెప్తాడు కదాని ఊరుకుంది. మరింత కాలం సాగింది ముందుకు. ఇద్దరికీ ఫిట్నెస్ అంటే పిచ్చి. ఇద్దరూ కలిసి ఒకే జిమ్‌కు వెళ్లేవారు. ఒకరోజు ఆ జిమ్‌కి ఒక అమ్మాయి వచ్చింది. ఎన్ఆర్ఐ. పేరు.. ప్రియ రంచల్. పరిచయాలు అయ్యాయి. రోజూ ముగ్గురు కలిసే జిమ్ చేయడం స్టార్ట్ చేశారు. బిపాషా వెళ్లిపోయాక కూడా జాన్ ఇంకొచెం సేపు ఉండి జిమ్ చేయసాగాడు. ప్రియ కూడా తన అదనపు సమయాన్ని వెచ్చించ సాగింది. అక్కడ ఆకర్షణ పెరుగుతూంటే బిపాషాతో జాన్ గడిపే వ్యవధి తగ్గిపోతూ రాసాగింది. బిపాషా అతని కోసం ఎదురు చూడ్డం అలవాటు చేసుకుంది. రోజురోజుకూ ఆమె ఎదురు చూసే టైమ్ పెరగసాగింది. అన్యోన్యత ముభావాన్ని నేర్చుకుంది. కలిసి మాట్లాడుకోవడమే కరువైంది. ఒకే ఇంట్లో అపరిచితులైపోయారిద్దరూ. తామిద్దరికీ ‘పెళ్లి’ ముడి లేదని అర్థమైపోయింది బిపాషాకు. జాన్ కూడా గ్రహించాడు ఆ సహజీవనానికి అర్థంలేదని. పెద్దగా వాదోపవాదాలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు లేకుండానే మీడియా ముందు తమ బ్రేకప్ను ప్రకటించింది ఆ జంట. ఫీల్డ్‌లో.. బయటా అంతా షాక్. పెళ్లి కబురు వినిపిస్తారనుకుంటే ఇదేంటిలా విడిపోతున్నామంటున్నారు? అని. తమ ఇంట్లోని పిల్లలే బ్రేకప్ మాట చెప్పినంత బాధపడ్డారు. తమ ఇంటి జంటే విడిపోయినంత నొచ్చుకున్నారు. ఇద్దరి పట్లా టన్నుల కొద్దీ సానుభూతి పెంచుకున్నారు. ఇలా జరక్కుండా ఉంటే బాగుండు అనుకున్నారు. అయితే ఆ ఎడబాటు వాళ్లు ప్రకటించుకున్నంత సులభంగా.. స్నేహపూర్వకంగా జరగలేదు. బిపాషా ఒక వార్తా దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తేలింది. ‘ఏ ప్రేమా స్నేహంగా బ్రేకప్ చెప్పుకోదు. స్నేహమే ఉంటే బ్రేకప్ దాకా ఎందుకు వస్తుంది? మాదీ అంతే. ఆ ఇంట్లో నేను అనాథనైపోయాననిపించింది. మా అనుబంధం పట్ల జాన్‌కు సీరియస్‌నెస్ లేదని, అతనికి నన్ను పెళ్లిచేసుకునే ఆలోచనే లేదని తేలింది. నా కెరీర్ కన్నా ప్రేమే ముఖ్యమనుకున్నా. దానికోసం కెరీర్‌నూ పట్టించుకోలేదు. ఆఖరికి ఆ ప్రేమ కూడా లేదని తెలిసింది. మోసపోయాననే ఫీలింగ్ వెంటాడింది. నిజాయితీ లేని చోట ఉండలేకపోయా’ అని చెప్పింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో జాన్ కూడా స్పందించాడు..‘ బిపాషా అడిగినప్పుడు పెళ్లి పట్ల నేనంత సీరియస్‌గా లేని మాట నిజమే. కాని నిజాయితీ లేని, అబద్ధాలాడే నేపథ్యం నుంచి వచ్చినవాడినైతే కాదు. బ్రేకప్ నరకమే. అన్నేళ్ల సహజీవనం ఎన్నో జ్ఞాపకాలను మిగిలుస్తుంది. మరిచిపోవడం అంత సులభం కాదు. కానీ తప్పదు.. ముందుకు సాగాలి కదా’ అని జాన్ చెప్తున్నప్పుడు అతని గొంతు జీరబోయింది బాధతో. బ్రేకప్ అయిన తర్వాత జానే ముందుగా పెళ్లిచేసుకున్నాడు ప్రియా రంచల్ని. తర్వాత బిపాషా పెళ్లాడింది టీవీ, సినీ స్టార్ కరణ్ సింగ్ గ్రోవర్‌ను. - ఎస్సార్ చదవండి: టీవీ బ్రేక్‌లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? -
నిశ్చితార్థం రద్దు చేసుకున్న అభిషేక్, కరిష్మా!
అన్నీ అనుకున్నట్టే జరిగితే కరిష్మా కపూర్ జీవితం ఇంకోలా ఉండేది. అభిషేక్ బచ్చన్ జత అయ్యేవాడు. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. నిశ్చితార్థం జరిగింది! కానీ బ్రేక్ అయింది.. ఆ ఇద్దరి భవిష్యత్ పట్ల పెద్దవాళ్లకున్న అభద్రత అడ్డొచ్చి. దాంతో వాళ్లిద్దరూ తమ ప్రేమనూ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.. అసలా ప్రేమ్ కహానీ ఎక్కడ మొదలైంది? తనతోపాటు అజయ్ దేవ్గన్ రవీనాతోనూ లవ్ గేమ్ ఆడుతున్నాడని తెలిసి సైలెంట్‌గా అతణ్ణించి తప్పుకొని దృష్టంతా కెరీర్ మీదే పెట్టింది కరిష్మా. ఆ సమయంలోనే రాజ్‌కపూర్ కూతురి కొడుకు నిఖిల్ నందా పెళ్లి నిశ్చయమైంది అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్‌తో. అప్పుడే కరిష్మా, అభిషేక్‌ల మధ్య స్నేహం కుదిరింది. శ్వేత, నిఖిల్ నందా పెళ్లి (1997)లో అభిషేక్, కరిష్మాల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అప్పటికి బాలీవుడ్లో కరిష్మా పెద్ద స్టార్. అభిషేక్ ఇంకా కెరీరే మొదలుపెట్టలేదు. దాంతో తమ ప్రేమ వ్యవహారం బయటపడకుండా రహస్యంగా ఉంచడం వాళ్లకు తేలికైంది. అలా మూడేళ్లు గడిచిపోయాయి. రెఫ్యూజీ అభిషేక్ బచ్చన్ సినీరంగ ప్రవేశానికి(2000) ముహూర్తం సిద్ధమైంది రెఫ్యూజీ సినిమాతో. అందులో కథానాయిక కరిష్మా కపూర్ చెల్లెలు కరీనా కపూర్. అప్పుడు కరిష్మా, అభిషేక్ ప్రేమ సంగతి బయటపడింది. ఇటు అభిషేక్ బచ్చన్, అటు కరీనా కెరీర్ మీదే దృష్టి పెట్టిన ఆ రెండు కుటుంబాలూ కరిష్మా, అభిషేక్ లవ్ గురించి వినీవిననట్టే ఊరుకున్నాయి. 60 వ బర్త్‌డే.. మరో రెండేళ్లు దాటాయి. కరిష్మా, అభిషేక్‌లకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు పెద్దలు. అమితాబ్ బచ్చన్ 60వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిపించారు. అంతా బాగుంది.. పెళ్లవడమే తరువాయి అనుకున్నారంతా. ఆ ప్రేమ పక్షులూ పెళ్లి తర్వాత కలసి ఉండే జీవితం గురించి కలలు కనడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ రెండు కుటుంబాలు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేశాయి. ఇరు వర్గాల అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా షాక్. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆరా తీయడానికి మీడియా చాలా ప్రయత్నించింది. రెండు వైపుల వాళ్లు వ్యూహాత్మక మౌనం వహించారు. కరిష్మా, అభిషేక్ కూడా ఏ రోజూ పెదవి విప్పలేదు. ఇప్పటికీ ఆ కారణం బయటకు రాలేదు. గుసగుసలు.. కరిష్మా, అభిషేక్‌ల నిశ్చితార్థం తర్వాత కొన్నాళ్లకు బచ్చన్ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది. అప్పటికి అభిషేక్‌నూ సక్సెస్ వరించలేదు. ఇవన్నీ సింగిల్ పేరెంట్‌గా ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్దచేసిన కరిష్మా తల్లి బబితలో అభద్రతను కలిగించాయి. తనలా తన కూతురి పరిస్థితి కాకూడదనే భయంతో పెళ్లికి ముందే తండ్రి ఆస్తిలో నుంచి కొంత కొడుకు అభిషేక్ పేరు మీద రాయమని బబిత అమితాబ్ బచ్చన్ కోరిందని.. ఆమె అలా అడగడంతో జయ బచ్చన్ నొచ్చుకుందని.. తల్లి బాధపడ్డం అభిషేక్‌కు నచ్చలేదని.. అందుకే ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని బాలీవుడ్లో గుసగుసలు. అంతేకాదు భవిష్యత్‌లో ఎప్పుడూ కరిష్మా వంక కన్నెత్తి చూడనని అభిషేక్ తన తల్లికి మాటిచ్చాడనీ ఆ వినికిడి. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ బ్రేక్ అయింది. తర్వాత.. కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లిచేసుకుంది. అది కలహాల కాపురంగానే ముగిసిపోయింది. ఇటు అభిషేక్.. రాణి ముఖర్జీ ప్రేమలో పడ్డాడు. పెళ్లిదాకా వెళతారనే అనుకున్నారంతా. కాని వెళ్లలేదు. కారణం.. జయ బచ్చన్. రాణీ ముఖర్జీ, జయ బచ్చన్ కలసి ‘లగా చునరీ మే దాగ్’ అనే సినిమాలో నటించారు. ఆ సెట్స్ మీద రాణీ, జయాకు గొడవ జరిగి రాణి కాస్త దురుసుగా మాట్లాడిందట. దాంతో జయ .. అభిషేక్‌తో రాణి సన్నిహితంగా మెలగడాన్ని ఇష్టపడలేదని.. అమ్మ అభీష్టాన్ని అభిషేక్ మన్నించక తప్పలేదని అందుకే రాణితోనూ బ్రేకప్ తప్పనిసరి అయిందని పేర్కొంటాయి బాలీవుడ్ వర్గాలు. నిజానికి రాణి ముఖర్జీని బచ్చన్ కుటుంబం చాలా ఇష్టపడింది. ముఖ్యంగా జయ. కారణం రాణి కూడా తనలాగే బెంగాలీ కావడం. అదీగాక ఆ అమ్మాయికి సహనమూ ఎక్కువేనని, అభిషేక్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనీ ఆ కుటుంబం ఆ ఇద్దరి ప్రేమను మనసారా అంగీకరించింది. ‘లగా చునరీ మే దాగ్’ ఆ అనుబంధాన్ని తెంచేసి మాయని మచ్చలా మిగిలిపోయింది. - ఎస్సార్ చదవండి: పెళ్లికి ముందు అజయ్ దేవ్‌గణ్ ఓ ప్లే బాయ్! -
రచ్చకెక్కిన అజయ్- రవీనా లవ్‌స్టోరీ
• మొహబ్బతే ‘ఫ్యామిలీ మెన్’గా పేరుతెచ్చుకున్న చాలా మంది బాలీవుడ్ హీరోలు పెళ్లికి ముందు ‘ప్లే బాయ్’ ట్యాగ్‌ను మోసిన వాళ్లే. వాళ్లలో అజయ్ దేవ్గన్ ఒకడు. ఆశ్చర్యపోనవసరం లేదు.. అతని లవ్ లిస్ట్‌లో కాజోల్ కంటే ముందు కరిష్మా.. ఆమె కంటే ముందు రవీనా టండన్ ఉన్నారు. అజయ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అతని ఫస్ట్ లవ్ రవీనా టండనే. ఆ ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే అజయ్ సోదరి నీలం దేవగన్ రవీనాకు అత్యంత సన్నిహితురాలు. ఆ పరిచయం, చెలిమి అజయ్, రవీనా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డానికి కారణమయ్యాయి. ఆ ప్రేమ ‘దిల్వాలే’ సినిమా సెట్స్ మీద మొదలైంది. ‘ఏక్ హీ రాస్తా’తో మీడియాకు కబుర్లు పంచి పెట్టింది. సినీ పరిశ్రమలోనూ అజయ్, రవీనా లవ్వే టాపిక్ అయింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసేసుకుంటారనుకుంది. రవీనా కూడా అదే ఆశించింది. అజయ్ తనను పెళ్లి చేసుకుంటాడని కలలు కన్నది. కాని అజయే అంత సీరియస్‌గా లేడు ఆ రిలేషన్ పట్ల. తారల జీవితాల్లో అలాంటి సరదాలు సాధారణం.. తమ దోస్తీ గురించి రవీనానే చాలా ఎక్కువగా ఆలోచిస్తోంది అనుకున్నాడు అతను. ఆ సమయంలోనే.. అజయ్‌కి కరిష్మా కపూర్ ఫ్రెండ్ అయింది. ఇద్దరూ కలసి ‘జిగర్’లో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే కరిష్మా అతణ్ణి ఆకట్టుకుంది. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ కొత్త ఫ్రెండ్షిప్లో పడి రవీనాను నిర్లక్ష్యం చేయసాగాడు. బిజీ షెడ్యూళ్ల వల్ల కలవలేకపోతున్నాడేమో అనుకుంది రవీనా. అందుకే ఏ మాత్రం వీలు చిక్కినా తనే అజయ్‌కి ఫోన్ చేసేది (అప్పుడు సెల్ ఫోన్లు లేవు.. ల్యాండ్ ఫోన్లే). చాలా సార్లు షూటింగ్‌కి వెళ్లిపోయాడు అనే సమాధానం వచ్చేది అతని సంబంధీకుల నుంచి. అదృష్టవశాత్తు ఎప్పుడో ఒకసారి అజయ్ ఫోన్ అందుకున్నా... పొడిపొడిగానే మాట్లాడి కట్ చేసేవాడు. అతని ఆ తీరుకూ మనసును సర్దుబాటు చేసుకున్న ఆమె.. ఆ టైమ్‌లో కరిష్మా, అజయ్ గురించి మీడియాలో వస్తున్న కథనాలను మాత్రం కొట్టిపారేయలేకపోయింది. అజయ్ చపలచిత్తం రవీనాను కలతకు గురిచేసింది. మోసం చేశాడని బాధ పడింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకూ ప్రయత్నించిందంటారు. కరిష్మాతో కలిసి ‘అందాజ్ అప్నా అప్నా’లో నటించినా అజయ్ వల్ల ఆమెతో స్నేహాన్ని కొనసాగించలేకపోయింది రవీనా. పైగా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచిందట. పార్టీలు, ఫంక్షన్లలో ఒకరికొకరు తారసపడినా మొహం తిప్పేసుకునేవాళ్లని, ఫొటోలకు పోజులిచ్చేవారు కాదని చెప్తుంది ముంబై మీడియా. కరిష్మా కోసం రవీనాకు దూరమై.. ఆ ఇద్దరి మధ్య వైరాన్ని సృష్టించిన అజయ్ కాజోల్ కోసం కరిష్మానూ కాదనుకున్నాడు. చిరాకు, చిటపటలతోనే.. కాజోల్, అజయ్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘హల్చల్’. ఆ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేనాటికి ఆ ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఆసక్తి అటుంచి సహజసిద్ధమైన కుతూహలం కూడా లేదు. ఆచితూచి మాట్లాడే అజయ్ దేవ్‌గన్‌కు గలగలా మాట్లాడే కాజోల్ వసపిట్టలా అనిపించింది. నిత్యం ఉల్లాసంగా ఉండే కాజోల్కు ఉదాసీనంగా కనిపించాడు అజయ్. పరస్పర విరుద్ధ స్వభాలున్న ఈ ఇద్దరినీ కలిపింది ఒకటే.. అప్పటికే విడివిడిగా మునిగున్న పీకల్లోతు ప్రేమ నుంచి బయటకు వచ్చేద్దామా? వద్దా? అన్న సంశయం. అవును.. అజయ్ కరిష్మాతో.. కాజోల్ కార్తిక్ మెహతాతో ప్రేమలో ఉన్నారు. అయితే ఆ భాగస్వాములతో ఇద్దరూ సంతోషంగా లేరు. వీళ్లిద్దరి మధ్య కొంచెం స్నేహం పెరిగాక కాజోలే చనువు తీసుకుంది.. కార్తిక్ మెహతాతో తన రిలేషన్‌కు సంబంధించి అజయ్‌ను సలహా అడిగి. ఆమె నిర్మొహమాటత్వం, లౌక్యంలేనితనం అజయ్‌కు నచ్చాయి. ‘జీవితాంతం ఈ అమ్మాయి తోడుంటే బాగుండు’ అనుకున్నాడు. ఆ క్షణం నుంచే కాజోల్ మీద అభిమానం కురిపించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ అభిమానం మరింత చిక్కపడి కాజోల్కు ప్రేమ భావనను పంచింది. ‘ప్రేమిస్తున్నాను’ అనే మాటే చెప్పుకోకుండా ప్రేమించే మనసునే ‘పెళ్లి’ మంత్రంగా మార్చుకొని అన్యోన్యతను స్థిరం చేసుకున్నారిద్దరూ! అజయ్, కరిష్మా గౌరవంగానే విడిపోయినా.. అజయ్, రవీనా బ్రేకప్ మాత్రం మీడియాకెక్కింది. రవీనాతో ప్రేమలో పడ్డ విషయాన్ని అజయ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ‘రవీనా పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపలేదు. ప్రేమనూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు’ అని చెప్పాడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కానీ రవీనా అతని మాటలను కొట్టిపారేసింది. ‘అజయ్, నేను ప్రేమించుకున్నాం. లెటర్స్ కూడా రాసుకున్నాం’ అన్నది. ‘రవీనా పుట్టు అబద్ధాల కోరు. నేను ఆమెకు లెటర్స్ రాసిన మాట నిజమే అయితే వాటిని చూపించమనండి.. పబ్లిష్ చేయమనండి.. ఎలా రాశానో చూడాలని నాకూ ఉంది’ అని సవాలు విసిరాడు అజయ్. అక్కడితో ఆగలేదు.. రవీనాకు మానసిక వైద్యం అవసరమని, ఆమె మెంటల్ హాస్పిటల్లో చేరితే మంచిదనీ కామెంట్ చేశాడు. ఈ ఘాటు విమర్శలతో వాళ్ల మధ్య ఉన్న స్నేహం కూడా ఇగిరిపోయింది. - ఎస్సార్ చదవండి: బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌పై దాడి? -
తండ్రీకూతుళ్లుగా నటించిన వాళ్లు ప్రేమలో పడ్డారు!
నానా పాటేకర్ నటనే కాదు జీవితమూ వైవిధ్యమే! నటుడిగా విజయాలే ఎక్కువ. భర్తగా, ప్రేమికుడిగా వైఫ్యలాలు ఎక్కువ! మనీషా కోయిరాలా కూడా వెర్సటైల్ నటే. ఆమెకూ జీవితంలో పోరాటం తప్పలేదు. స్వభావ రీత్యా ఇద్దరూ ఒకటే. కోపం, ఆవేశం విషయంలో ఇద్దరిదీ ఒకే మీటర్. ప్రేమ విషయంలోనూ ఆ మీటర్ తప్పలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఇద్దరూ తప్పారు. వివరాలు.. 1996లో వచ్చిన అగ్నిసాక్షి.. నానా, మనీషా కలసి చేసిన మొదటి సినిమా. ఆ సెట్స్ మీదే వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. తనలాగే ఉండే మనీషా ముక్కుసూటి వ్యవహారం అతనికి నచ్చింది. ఆమె మీద ప్రేమా కలిగింది. అంతకుముందే వివేక్ ముష్రాన్తో బ్రేకప్ అయిన బాధలో ఉన్న మనీషాకు నానా స్నేహం, చూపిస్తున్న ప్రేమ ఊరటనిచ్చాయి. దాంతో తనూ నానా పట్ల ప్రేమను పెంచుకుంది. అదే యేడు వచ్చిన ఖామోషీ (ఇందులో తండ్రీ, కూతురిగా నటించారు)తో ఆ ఇద్దరి మధ్య అనుబంధం బలపడ్డమే కాదు ఆ రహస్యం చిత్రపరిశ్రమకూ తెలిసిపోయింది. ఆ ప్రేమను పెళ్లిగా మలచుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు నానా పాటేకర్. మనీషా ‘నో’ చెప్పలేదు కాని అప్పటికే పెళ్లయి ఉన్న నానాతో ‘నీ భార్యకు విడాకులివ్వు’ అంది. మౌనంతో ఆ సందర్భాన్నుంచి బయటపడ్డాడు అతను. నిజానికి నానా పాటేకర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్నేమీ ఆస్వాదించట్లేదు. అతని భార్య నీలకాంతి. మరాఠీ నటి, దర్శకురాలు, నిర్మాత. మంచి శిల్పి కూడా. పెళ్లయిన ఏ కొంత కాలమో సంతోషంగా ఉన్నారు ఆ భార్య, భర్త. తర్వాత నుంచి విభేదాల ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారింది వాళ్ల దాంపత్యం. ఇద్దరు పిల్లలూ పుట్టడంతో వాళ్ల ముందు కీచులాడుకోవడం, పోట్లాడుకోవడం ఇష్టం లేక విడాకులు తీసుకోకుండానే విడి విడిగా ఉండడం ప్రారంభించారు. ఆయేషా, నీలకాంతి విడాకులు, పెళ్లి గురించిన వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి మనీషా, నానా మధ్య. ఇంకోవైపు ఆమె మీద పొసెసివ్‌నెస్ ఎంతలా పెరిగిందంటే మనీషా ప్రవర్తనకు హద్దులు పెట్టేంతగా. ఆమె కాస్త ఆధునికంగా అలంకరించుకున్నా నానా అభ్యంతరపెట్టేవాడు. సహ నటులతో కొంచెం చనువుగా మాట్లాడినా ఆమె మీద నోటి దురుసుతనం ప్రదర్శించేవాడు. పెళ్లితో ఆ అభద్రతకు చెక్ పెట్టొచ్చని ఆశపడింది మనీషా. అందుకే నీలకాంతితో విడాకుల కోసం ఒత్తిడి తెచ్చింది. ‘ఇవ్వను. నీతో కలసి ఉండడానికి సిద్ధమే.. కాని నీలకాంతికి విడాకులు ఇచ్చేసి కాదు’ అని స్పష్టం చేశాడు నానా పాటేకర్. నివ్వెరపోయింది మనీషా. అప్పటి నుంచి ఆమెలో అభద్రత మొదలైంది. ఈలోపు.. నానా పాటేకర్.. ఆయేషా జుల్కాతో దగ్గరగా ఉంటున్నాడన్న విషయం పరిశ్రమలో గుప్పుమంది. పత్రికల్లోనూ అచ్చయింది. మనీషా మెదడులోనూ పడింది. ఒకసారి మనీషా నానా పాటేకర్‌ను కలవడానికి వెళ్లేసరికి ఆయేషా జుల్కా అక్కడే ఉంది. స్నేహం కంటే ఎక్కువ దగ్గరితనం వాళ్ల మధ్య కనపడేసరికి కోపావేశాలకు లోనైన మనీషా ఇంగితం మరచిపోయి ఆయేషా జుల్కాను తిట్టేసింది. నానా పాటేకర్ జోక్యంతో అక్కడికి, అప్పటికి సద్దుమణిగినా ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసింది. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం నెమ్మది నెమ్మదిగా వాళ్ల మధ్య అనుబంధాన్ని, బంధాన్నే తెంచేసింది. నానా పాటేకర్, మనీషాల ప్రేమ కథ బ్రేకప్‌తో ఎండ్ అయిపోయింది. నానా పాటేకర్, ఆయేషా జుల్కా కలసి ఉండడం ప్రారంభించినా, మనీషా ముందుకు సాగిపోయినా విడిపోవడం ఆ రెండు మనసులనూ వేధించింది. ‘బ్రేకప్ అనేది డిఫికల్ట్ ఫేజ్. అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది ఆ బాధేంటో. మనీషా కస్తూరి మృగం లాంటిది. చాలా సున్నిత మనస్కురాలు. ఆమె నన్ను వదిలి వెళ్తుంటే అతికష్టమ్మీద కన్నీళ్లను దిగమింగా. ఐ మిస్ మనీషా’ అని చెప్పాడు నానా పాటేకర్ ఒక ఇంటర్వ్యూలో. 2010లో మనీషా .. నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్ను పెళ్లిచేసుకుంది. కాని రెండేళ్లకే ఆ పెళ్లి విఫలమైంది. తర్వాత ఆమె క్యాన్సర్ బారినపడింది. ఆ పోరాటంలో గెలిచి.. మళ్లీ సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. -ఎస్సార్ చదవండి: శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..? -
అది అఫైర్ కాదు, ఆమె మీద నాకున్న ప్రేమ!
గోవిందా మనసారా ఇష్టపడ్డ అమ్మాయి నీలమ్. కానీ సునీతతో జీవితాన్ని పంచుకోవాల్సి వచ్చింది. ఆమెతో పెళ్లయిన ఏడాదికి గానీ ఆ విషయాన్ని నీలమ్‌తో చెప్పలేదు గోవిందా. ‘నేను చేసింది తప్పే. సునీతతో పెళ్లి విషయం నేను నీలమ్‌కు చెప్పి ఉండాల్సింది’ అని తప్పు ఒప్పుకుంటాడు గోవిందా. అయితే నీలమ్‌ను ఇష్టపడ్డం, పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పేం లేదు అనీ అంటాడు. ‘అవును.. నీలమ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. సునీతతో నిశ్చితార్థాన్ని తెంచుకునైనా నీలమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకెలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకున్నానో అలాంటి అమ్మాయే నీలమ్. అలాగని సునీతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.. పెట్టను. భర్తగా నా బాధ్యతనెప్పుడూ విస్మరించలేదు. నీలమ్ మీద ఇష్టమూ చావలేదు. ఇప్పటికీ ఆమె ఎక్కడ కనపడ్డా నా గుండె లయ తప్పుతుంది. కానీ ఎందుకో నీలమే నాతో సినిమాలు చేయడం మానేసింది. బహుశా అదే డాన్స్, అదే డైలాగ్ డెలివరీ తనకు బోర్ కొట్టి ఉండొచ్చు. తనతో మళ్లీ సినిమాలు చేయాలనుంది’ అని చెప్పాడు గోవిందా ఒక ఇంటర్వ్యూలో. ఇంకో మాటా గట్టిగా చెప్పాడు.. ‘దయచేసి మాది అఫైర్ అని కామెంట్ చేయొద్దు. అది అఫైర్ కాదు.. నీలమ్ మీద నాకున్న ప్రేమ’ అని. గోవిందా పెళ్లి విషయం తనకు తెలిసినప్పటి నుంచి అతనితో స్నేహాన్నే కాదు.. సినిమాలనూ మానేసింది. అలాగని గోవిందా పట్ల ఎన్నడూ కోపాన్ని, దురుసుతనాన్నీ ప్రదర్శించలేదు. బహుశా.. తను ఆ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదేమో అంటారు నీలమ్ సన్నిహితులు. ఆమె సినిమాల్లో రాణించాలనే లక్ష్యం వల్లా అది నిర్లక్ష్యం అయిండొచ్చు అంటారు. నీలమ్ కూడా ప్రేమలో పడింది. బాబీ డియోల్‌తో. అతనూ నీలమ్‌ను మనసులో నింపుకున్నాడు. ఆ ప్రేమను పెళ్లితో భద్రం చేసుకోవాలనీ అనుకున్నాడు. నీలమ్, బాబీ కలసి తిరుగుతున్నారు అన్న విషయం మొదట్లో ధర్మేంద్రకు తెలిసినా ఇండస్ట్రీలో అది మామూలే అని ఊరుకున్నాడ్లు. కానీ ఎప్పుడైతే కొడుకు ఆలోచన పెళ్లి దాకా వెళ్లిందని తెలిసిందో అప్పుడు సీరియస్ అయ్యాడు ఆ తండ్రి. నీలమ్ అంటే ఇష్టం లేక కాదు.. సినిమా హీరోయిన్లు తనింటి కోడళ్లుగా రావడం ఇష్టంలేక. ఆ మాటే బాబీ డియోల్కూ చెప్పాడు ధర్మేంద్ర. హతాశుడయ్యాడు బాబీ డియోల్. ఆ విషయంలో తండ్రిది మొండిపట్టే అని సన్నీ కూడా చూచాయగా మందలించాడు. అందుకు సన్నీ జీవితమే పెద్ద ఉదాహరణ. సినిమాల్లోకి వచ్చి అలాంటి ఆకర్షణలకు లోనవుతాడని తెలిసే పెళ్లి చేశాకే సన్నీని వెండితెర మీదకు తెచ్చాడు. తండ్రి ఆ ఆచరణంతా బాబీకి తెలియందేం కాదు. తండ్రి కోసం నీలమ్‌ను వదులుకోవాలనీ లేదు. తండ్రి తత్వం తెలిసీ మొండి పట్టూ పట్టలేదు. భారమైన హృదయంతోనే ఒకరోజు నీలమ్‌ను కలిశాడు బాబీ డియోల్. తండ్రికి, తనకు మధ్య జరిగిన చర్చ గురించి చెప్పాడు. మొత్తం సీన్ అర్థమైపోయింది ఆమెకు. అందుకే ఎదురు ప్రశ్నలేం వేయకుండానే ‘సరే.. ఇక్కడితో ఆపేద్దాం’ అంది. ఆ మాట అంటున్నప్పుడు నీలమ్ కళ్లల్లో నిండిన నీళ్లు బాబీ దృష్టి దాటి పోలేదు. నిస్సహాయంగా ఇద్దరూ గుడ్ బై చెప్పుకున్నారు అయిదేళ్ల ఆ అనుబంధానికి. వదంతులు.. చెక్ ఆ ఇద్దరి బ్రేకప్ మీద చాలా వదంతులు ప్రచారమయ్యాయి. ఒకసారి నీలమ్ స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వదంతులకు చెక్ పెట్టింది. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం నాకిష్టం ఉండదు. నా లవ్ అండ్ బ్రేకప్ గురించి వస్తున్న రూమర్స్ వింటూంటే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడక తప్పట్లేదు. నాకు, బాబీకి బ్రేకప్ అయిన మాట నిజమే. అయితే పూజాభట్ ఇన్వాల్వ్మెంట్ వల్లే మా బ్రేకప్ అయిందన్నది శుద్ధ అబద్ధం. పూజానే కాదు ఇంకే అమ్మాయి వల్లా మా బ్రేకప్ కాలేదు. మా పరస్పర అవగాహనతోనే విడిపోయాం’ అంటూ స్పష్టం చేసింది. ‘సెపరేషన్ బాధాకరమే. దాదాపు ఎమోషన్స్‌కి సర్జరీ చేసినట్టే. ఒక ఎమోషన్‌ను తీసేసి ఇంకో ఎమోషన్‌ను అనుభవించడమే. చుట్టూ ఆరోగ్యకర వాతావరణం ఉంటే ఆ గాయం నుంచి త్వరగా కోలుకోగలం. అయితే ఆ విడిపోవడం, ఎడబాటు నిజాయితీగా జరిగితేనే త్వరగా కోలుకోగలుతాం. మా బ్రేకప్ అలాంటిదే. విడిపోవాలని ఒక్కసారి నిర్ణయించుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించలేదు. కన్నీళ్లు పెట్టలేదు. ముందుకే వెళ్లాను’ అని బ్రేకప్ తర్వాత తన మానసిక స్థితినీ వివరించింది నీలమ్. తర్వాత.. బ్యాంకాక్‌కు చెందిన రిషి సేథియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కాని ఆ బంధం ఎన్నాళ్లో నిలువలేదు. ఆ విడాకుల తర్వాత జ్యుయెలరీ డిజైన్ మీద మనసు పెట్టింది. ఓ వైపు ఈ కొత్త వృత్తి ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న టైమ్‌లోనే నటుడు సమీర్ సోనీతో స్నేహం కుదిరింది. ప్రేమగా మారింది. పెళ్లీ చేసుకుంది. ఒక అమ్మాయి (ఆహనా)ని దత్తత కూడా తీసుకుంది ఆ జంట. ‘కదిలిపోయిన గతం పట్ల రిగ్రెట్స్ లేవు. వర్థమానమంతా సంతోషమే. భవిష్యత్ గురించి బెంగలేదు’ అంటుంది నీలమ్. - ఎస్సార్ చదవండి: ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న గోవిందా -
సన్నీడియోల్ - డింపుల్ కపాడియా లవ్‌స్టోరీ!
సన్నీ డియోల్, అమృతా సింగ్... జంటగా తెర మీద కనిపించడం కనిపించడంతోనే ప్రేమ పక్షులుగా ప్రేక్షకుల మనసుల్లో దాగుండి పోయారు. ఇద్దరూ ఒకరికొకరు.. సినీ అభిమానులకు ఒకేసారి పరిచయం.. ‘బేతాబ్’ చిత్రంతో. తెర మీదే కాదు తెర వెనకా వీళ్ల ప్రేమ కథ మొదలైంది ఆ సినిమా సెట్స్ మీదే.. 1983లో. ‘జబ్ హమ్.. జవా హోంగే.. జానే కహా హోంగే.. లేకిన్ జహా హోంగే.. పర్ యాద్ కరేంగే.. తుఝే యాద్ కరేంగే... (పెద్దయ్యాక మనం ఎక్కడుంటామో ... ఎక్కడున్నా.. నిన్ను గుర్తు చేసుకుంటా)’ బేతాబ్‌లో సూపర్ డూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను ఆ మూవీ షూటింగ్‌లోనే కాదు.. సినిమా పూర్తయ్యాకా పాడుకున్నారు సన్నీ డియోల్, అమృతాసింగ్ చేతిలో చేయి వేసుకొని. సన్నీ డియోల్ మ్యాన్లీనెస్కు మనసు పడేసుకుంది ఆమె. అమృత అమాయకత్వాన్ని మనసంతా నింపుకున్నాడు అతను. బేతాబ్ విడుదలయ్యేలోపే వీళ్ల ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీని చెవులు కొరుక్కునేలా చేసింది. బేతాబ్ హిట్‌తో ఈ జంటకు నిర్మాతల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే తర్వాత చిత్రం ‘సన్నీ’లోనూ ఈ ఇద్దరే నాయికానాయకులుగా ఖరారు అయ్యారు. ఆ సినిమా సెట్స్‌లోనూ వీళ్ల చనువు పదిమందినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ‘సన్నీ’ షెడ్యూల్స్‌లోనే మధ్యమధ్యలో లండన్ వెళ్లివస్తూండే వాడు సన్నీ. ఎందుకో ఎవరికీ తెలిసేది కాదు.. అమృతతో సహా. ఈలోపు ఆమె మీడియాకు ఎన్కౌంటర్ అయ్యేది. సన్నీతో ఆమె సాన్నిహిత్యం టాపిక్‌గా మారేది. ‘అవును.. మేం ప్రేమలో పడ్డాం..’ అని నిర్ధారించేసింది అమృత. అందుకే వెళ్లాడు.. ‘సన్నీ’ విడుదల అయింది. సన్నీ డియోల్, అమృతాసింగ్ జోడీకి మరింత క్రేజ్ పెరిగింది. మాటిమాటికీ సన్నీ డియోల్ లండన్ ఎందుకు వెళ్తున్నాడో మీడియా జాసూసీ చేసింది. ‘సన్నీ డియోల్‌కు పెళ్లయింది. భార్య లండన్‌లో ఉంటుంది. లండన్‌లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. పేరు పూజ’ అనే విషయాన్ని రాసింది. అది చదివిన అమృత షాక్ అయింది. సన్నీ డియోల్‌ను నిలదీసింది. ‘మీడియాలో వచ్చిందంతా అబద్ధం’ అన్నాడు. ‘మరి తడవ తడవకు లండన్ ఎందుకు వెళ్తున్నావ్?’ అని ప్రశ్నించింది. మౌనం వహించాడు సన్నీ. సహించలేకపోయింది అమృత. ఇన్నాళ్ల స్నేహం, ప్రేమంతా అబద్ధమేనా? పెళ్లి చేసుకొని అతనితో జీవితం పంచుకోవాలనుకుంది ఈ అబద్ధపు పునాదుల మీదనా? అంటూ మథన పడింది. తనను తాను కోపగించుకుంది.. అరిచింది.. ఏడ్చింది. ఆ ఆవేశం, ఉక్రోషం అంతా తగ్గాక సన్నీతో అనుబంధాన్నీ తెంచేసుకోవాలనే నిశ్చయానికి వచ్చింది అమృత. తెంచేసుకుంది కూడా. మరుసటి క్షణం నుంచే కెరీర్ మీద దృష్టి పెట్టింది. అమృత వాళ్ల అమ్మ రుక్సానా సుల్తానా కూడా కూతురి నిర్ణయం పట్ల సంతోషించింది. సన్నీకి పెళ్లయిందని తెలిసీ మొండిగా అతణ్ణే పెళ్లి చేసుకుంటానని ఎక్కడ పట్టుపడుతుందో.. ఒకవేళ ఆ వ్యక్తి కుదరదు అంటే ఎక్కడ కుంగిపోతుందోనని ఆందోళన చెందింది రుక్సానా. జీవితంలో ముందుకుసాగాలని కూతురు డెసిషన్ తీసుకోవడంతో ఊపిరి పీల్చుకుంది ఆ తల్లి. ఇటు సన్నీ వాళ్లమ్మ ప్రకాశ్ డియోల్ కూడా ఆ ప్రేమ పట్ల వ్యతిరేకంగానే ఉండింది. ఎందుకంటే తన కొడుక్కి పెళ్లయిన విషయం ఆమెకు తెలుసు కదా! రహస్యం ఎందుకు? సన్నీ సినీ ప్రవేశం కంటే ముందే అతనికి పూజతో పెళ్లయింది. బిజినెస్ ఒప్పందాల ప్రకారం వివాహం జరిగిందని అంటారు ధర్మేంద్ర సన్నిహితులు. దాని తర్వాతే ‘బేతాబ్’ సినిమా ప్లాన్ చేశారు. లవ్ స్టోరీ. సన్నీకి పెళ్లయిందని తెలిస్తే తన కొడుకుకు రొమాంటిక్ హీరో ఇమేజ్ రాదేమోనని.. సినిమా హిట్ కాదేమోననే భయంతో ఆ నిజాన్ని ఇంటి గుమ్మం దాటనివ్వలేదు ఆ కుటుంబ సభ్యులు. సన్నీ కూడా తాను బ్యాచిలర్ అన్న భావనతోనే సెట్స్ మీదకు వచ్చాడు. అమృత ఆకర్షణలో పడిపోయాడు. ఆగలేదు.. బ్రేకప్ తర్వాత ఇద్దరి జీవితాలూ ఆగిపోలేదు. అమృత.. ప్రముఖ క్రికెటర్ రవిశాస్త్రి ప్రేమలో పడింది. సన్నీ.. డింపుల్ కపాడియాను ప్రేమించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఉన్న సినిమా లిస్ట్‌లోనూ హిట్లకేం తక్కువ లేదు. రాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలో (ఆమె చెల్లెళ్లు, తమ్ముడు చనిపోయినప్పుడు) ఆమెకు అండగా నిలబడ్డాడు. అయితే ఈ విషయం సన్నీ భార్య పూజకు తెలిసి ‘డింపుల్‌తో స్నేహం కట్ చేసుకోకపోతే పిల్లల్ని (ఇద్దరబ్బాయిలు) తీసుకొని ఇల్లు వదిలివెళ్లిపోతా’ నని హెచ్చరించింది. ‘తండ్రి (హేమమాలినిని పెళ్లి చేసుకొని)లా ధైర్యం చేయలేకపోయాడు సన్నీ. అలాగని పూజ మాటకూ గౌరవం ఇవ్వలేదు. డింపుల్‌తో రిలేషన్‌ను బ్రేక్ చేసుకోలేదు’ అంటారు ఇండస్ట్రీలో వాళ్లు. ఇప్పటికీ సన్నీ, డింపుల్ రిలేషన్‌లోనే ఉన్నారు అని చెప్తారు వాళ్లు. ఇప్పుడు అమృతానే ఒంటరి. ‘యే బచ్పన్ కా ప్యార్ అగర్ ఖో జాయేగా.. దిల్ కిత్నా ఖాలీ ఖాలీ హో జాయేగా.. తేరే ఖయాలోమే ఇసే ఆబాద్ కరేంగే.. తుఝే యాద్ కరేంగే (బాల్యంలోని ఈ ప్రేమను పెద్దయ్యాక పొందలేకపోతే మనసంతా ఖాళీ అయిపోతుంది.. నిన్ను గుర్తు చేసుకుంటూ.. నీ జ్ఞాపకాలతో మనసును నింపుకుంటా)’ అన్న చరణం జబ్ హమ్ జవాహోంగే పాటలోనిదే. ఈ చరణాన్ని పాడుకునే అవకాశం సన్నీకి రానట్టుంది.. అమృత ఆ అవకాశాన్ని రానివ్వనట్టుంది. - ఎస్సార్ -
నటుడితో మాధురీ దీక్షిత్ ప్రేమాయణం!
మెరా దిల్ భీ కిత్నా పాగల్ హై యే ప్యార్ తో తుమ్సే కర్తా హై.. పర్ సామ్నే జబ్ తుమ్ ఆతే హో కుచ్ భీ కహ్నే సే డర్తా హై.. ఓ మేరే సాజన్.. ఓ మేరే సాజన్... 1990ల్లో యువ హృదయాల మధురాలాపనగా మిగిలిపోయిన పాట అది. ‘సాజన్’ సినిమాలోనిది. ఆ చిత్రాన్ని కూడా ఓ ప్రేమ కావ్యంలా ఆరాధించింది నాటి యువత. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌ల నిజమైన ప్రేమా కథలుకథలుగా మీడియాలో అచ్చేసుకుంది. ‘నిజమే’ అని ఆ ఇద్దరూ స్పష్టం చేయకపోయినా అకస్మాత్తుగా వేరైన వాళ్ల దారులు ఆ కథనాలు వాస్తవమనుకునేలా చేశాయి. ఆ సినిమాతోనే మొదలు.. మాధురి, సంజయ్ దత్ సాజన్ కంటే ముందు నాలుగు సినిమాల్లో కలసి నటించారు. ఆ సాన్నిహిత్యంతో మంచి స్నేహితులుగా మారారు. సినిమాల్లో హిట్ పెయిర్‌గా పేరూ తెచ్చుకున్నారు. సాజన్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ టైమ్‌లో మాధురి.. పత్రికలకు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా సంజయ్ దత్ గురించి ‘సినిమాల్లో నా ఫేవరేట్ పార్ట్నర్. నన్ను భలే ఎంటర్టైన్ చేస్తాడు. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. రియల్ జోకర్ అండ్ జెంటిల్మన్’ అని ఒకసారి, ‘ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడే జిత్తులమారి కాదు సంజు. స్వచ్ఛమైన మనసు అతనిది. ప్రేమగల మనిషి. ఫెంటాస్టిక్ పర్సన్. మంచి సెన్సాఫ్ హ్యూమర్ అతని సొంతం. ఈ ప్రపంచంలో నన్ను నవ్వించే మనిషి అతనొక్కడే’ అంటూ ఇంకోసారి తన మనసులో మాటలను పంచుకుంది. సాజన్ సినిమా షూటింగ్ కబుర్ల కంటే మాధురి ఇంటర్వ్యూలే పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆ ఇద్దరి మధ్యలో ఏదో ఉందన్న ఊహలనూ రేపాయి. పత్రికలూ ఆ డాట్స్‌ను కనెక్ట్ చేసుకుంటూ మాధురి, సంజయ్‌ల ఇష్క్‌కి స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాయి. ఈలోపు ‘సాజన్’ విడుదలై సూపర్ హిట్ అయింది. వాళ్ల ప్రేమ కథా పత్రికలకు కవర్ స్టోరీ అయింది. మాధురి, సంజయ్‌లకు ఒకరంటే ఒకరికి ఉన్న పట్టింపు, శ్రద్ధ, పెరిగిన చనువును చూసి పరిశ్రమలో వాళ్లూ అనుకున్నారు ‘వాళ్లిద్దరూ కలసి ఏడు అడుగులు వేస్తారు’ అని. ఏమైంది మరి? సంజయ్ దత్‌కి అదివరకే పెళ్లయింది. ఒక కూతురు కూడా. కాని స్పర్థలతో విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు విడాకులు తీసుకోకుండా. ఈలోపే భార్య రీచా శర్మ క్యాన్సర్ బారిన పడింది. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లింది. సంజయ్, మాధురిల ముచ్చట అక్కడున్న రిచాకు చేరింది. చింత పడింది. ‘నాకు విడాకులివ్వాలనుకుంటున్నావా?’ అని అడిగింది భర్తను. ‘ఛ.. అలాంటి ఆలోచనేం లేదు’ అన్నాడు సంజయ్. కాస్త కుదుటపడినా.. అక్కడ ఉండలేకపోయింది. కూతురిని తీసుకొని ఇండియాకు వచ్చేసింది. కానీ వచ్చాక భర్త ప్రవర్తనలో మార్పు కనిపించింది రిచాకు. తన పట్ల అతనిలో మునుపటి ఆదరణ లేదు. పైగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. తట్టుకోలేకపోయింది. అందుకే వచ్చినంత వేగంగా.. కేవలం పదిహేను రోజుల్లోనే తిరిగి న్యూయార్క్ వెళ్లిపోయింది రిచా కూతురిని తీసుకొని చెదిరిన మనసుతో. ‘విడాకులు తీసుకోలేదు. తీసుకోవాలని ఆయనకు, నాకూ లేకుండింది. మళ్లీ కలసి ఉంటామనే అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. కలిసున్నా లేకపోయినా.. ఆయన నన్నెలా ట్రీట్ చేసినా ఐ లవ్ హిమ్. ఆయన నా ప్రాణం’ అని చెప్పింది రిచా. తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్‌తో కన్ను మూసింది ఆమె. ‘మాధురి, సంజయ్ మంచి ఫ్రెండ్స్ అనుకున్నాం. వాళ్లిద్దరిమధ్య ఇంకేదో ఉందని మేమేనాడూ అనుమానించలేదు. సంజయ్ స్పేస్‌ను రెస్పెక్ట్ చేశాం. అయినా మా అక్కతో అంత నిర్దయగా ప్రవర్తించిన మనిషిని ఎలా కావాలనుకుంటుందో మరి మాధురి?’ అని కామెంట్ చేసింది రిచా శర్మ చెల్లెలు ఇనా శర్మ. టాడా.. భార్యకు దూరమైన సంజయ్.. ప్రేమను దక్కించుకొని మాధురీకి దగ్గరయ్యాడా అంటే అదీ జరగలేదు. 1993లో చట్టవిరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు టాడా కింద సంజయ్ మీద కేస్ నమోదైంది. జైలుకీ వెళ్లాడు. ఈ పరిణామానికి మాధురి షాక్ అయ్యింది. వెంటనే సంజయ్‌తో గడిపిన కాలానికి చెక్ పెట్టింది. ఆ జ్ఞాపకాలు మెదలకుండా మెదడును కట్టడి చేసుకుంది. జైల్లో ఉన్న సంజయ్‌ను కనీసం పలకరించడానిక్కూడా వెళ్లకుండా ఉండేంత. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఆమెకు అపరిచితుడయ్యాడు. మాధురి ఈ నిర్ణయం సంజయ్‌ను బాధించింది. లోలోపలే కుమిలిపోయాడు. జైలు నుంచి అతను బయటకు వచ్చాక ఒక సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మాధురి ప్రవర్తనకు మీరెలా ఫీలయ్యారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఏమీ ఫీలవలేదు. నాతో నటించే ప్రతి నటితో మంచి ర్యాపోతో ఉండాల్సి వస్తుంది. మాధురీతో అలాగే ఉన్నాను. అందుకే ఆమె మాటలు కానీ, చేతలు కానీ నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.. చూపవు కూడా’ అని చెప్పాడు సంజయ్. మరో పత్రికా విలేకరి ఇంకో సందర్భంలో మాధురితో ప్రేమ, పెళ్లి మీద వచ్చిన ప్రచారాన్ని గురించి అడిగితే.. ‘నాకూ అనిపిస్తుంది మాధురితో నా లైఫ్‌లో లవ్ సీన్ ఉంటే బాగుండు అని.. కానీ లేదు కదా. ఇక పెళ్లి అంటారా.. అసలు మా మధ్య ఏమీలేనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది?’ అని కొట్టిపారేశాడు సంజయ్. మాధురిని దృష్టిలో పెట్టుకొని.. ఆమె ఇబ్బంది పడకుండా ఉండడానికే సంజయ్ అలా చెప్పాడు అంటారు అతని సన్నిహితులు. చాలా ముందుకెళ్లింది సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా విడుదలప్పుడు మళ్లీ వాళ్ల లవ్ స్టోరీ గుర్తొచ్చింది మీడియాకు. మైక్ తీసుకెళ్లి మాధురి ముందు పెట్టారు.. ‘ఇప్పుడు ఆ విషయం అనవసరం. ఇన్నేళ్లలో జీవితం చాలా ముందుకెళ్లింది’ అని జవాబు చెప్పింది మాధురి. 2019లో ‘కళంక్’ అనే సినిమా వచ్చింది. సంజయ్ దత్, మాధురీ కలసి నటించిన సినిమా! పర్సనల్ లైఫ్, ప్రొఫెనల్ లైఫ్ రెండు వేర్వేరు అన్నదానికి సూచనగా. - ఎస్సార్ -
డ్యాన్సర్‌తో శ్రీదేవి బ్రేకప్ స్టోరీ
శ్రీదేవి.. ఏ తరానికైనా ఆరాధ్య తారే. మిథున్ చక్రవర్తి.. ఎప్పటికీ డాన్స్ గురునే! ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు దాదాపుగా హిట్టే! తెర మీద ఈ జంట సూపర్ హిట్! మూడుముళ్లతో జీవితంలోనూ కలిసి నడవాలనుకున్నారు.. తమ ప్రేమను కలకాలం నిలుపుకోవాలనుకున్నారు. అదే జరిగి ఉంటే ఇక్కడ ‘మొహబ్బతే’లో వాళ్ల గురించి ప్రస్తావన వచ్చి ఉండేది కాదు. ‘సప్తపది’ తెలుగు సినిమాను హిందీలో ‘జాగ్ ఉఠా ఇన్సాన్’గా ( దీనికీ కె. విశ్వనాథే దర్శకుడు) తీశారు. నాయికానాయకులు శ్రీదేవి, మిథున్ చక్రవర్తి. ఆ సినిమా సెట్స్ మీదే ఆ ఇద్దరికీ స్నేహం కుదిరింది. తన పని పట్ల మాత్రమే శ్రద్ధ పెట్టే శ్రీదేవి మనస్తత్వం మిథున్‌కు నచ్చింది. ఆమె మొహంలోని అమాయకత్వం అతణ్ణి ఆకర్షించింది. దాంతో ఆ స్నేహాన్ని ఆమె మీద ప్రేమగా మార్చుకున్నాడు. తనను ప్రత్యేకంగా.. కావాల్సిన వ్యక్తిగా ఆత్మీయంగా చూడసాగాడు. అతని కళ్లల్లోని ఆ ఆప్యాయత శ్రీదేవి శ్రద్ధను చెదరగొట్టింది. మనసు మిథున్ వైపు పోయేలా చేసింది. అలా వాళ్ల ప్రేమ ప్రయాణం మొదలైంది. ఇది 1984 నాటి ముచ్చట. ఆ ఇద్దరూ జంటగా బయట ఎక్కడా పెద్దగా కనిపించకపోయినా.. సోర్స్ ద్వారా పేజ్ త్రీ ఆ నిప్పు అందుకుంది.. రూమర్స్, గాసిప్స్ పొగను వదిలింది. ఆ సమయంలోనే... శ్రీదేవిని సైలెంట్‌గా, సీక్రేట్‌గా ఆరాధించసాగాడు నిర్మాత బోనీ కపూర్. అప్పటికే మిథున్, బోనీ మంచి ఫ్రెండ్స్. శ్రీదేవి పరిచయం నాటికే ఇటు మిథున్‌కు యోగితా బాలితో, అటు బోనీకి మోనాతో పెళ్లిళ్లయ్యాయి. రెండు జంటలూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లోనే ఉన్నాయి. రాఖీ రోజులు గడుస్తున్నాయి. మిథున్, శ్రీదేవిల మధ్య అనుబంధం పెరుగుతోంది.. బంధం బలపడుతోంది. ఆమె లేకుండా అతను ఉండలేని పరిస్థితి. ‘పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాడు శ్రీదేవితో. ఆమె ఆనందానికి అవధుల్లేవు. శ్రీదేవితో తన ప్రేమను వెలిబుచ్చినప్పుడే ‘యోగితాకు విడాకులిస్తున్నాను’అనీ చెప్పాడు. అందుకే మిథున్ నోటెంట పెళ్లి ప్రస్తావన రాగానే విడాకులు మంజూరయ్యాయేమో అనుకుంది. ఇంకొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు అడిగింది శ్రీదేవి.. మిథున్‌ను ‘మీ లైఫ్‌లో రెండో స్త్రీగా ఉండలేను. విడాకులు ఎంతవరకు వచ్చాయి?’ అని. అతణ్ణించి స్పష్టమైన జవాబు రాలేదు కాని ఓ అనుమానం బయటకు వచ్చింది. బోనీకీ శ్రీదేవి అంటే ఇష్టం అన్న సంగతి మిథున్‌కి అర్థమైంది. శ్రీదేవీకీ ఆ విషయం తెలుసేమో.. తెలిసీ తేల్చట్లేదేమో అన్నదే ఆ శంక. శ్రీదేవి ముందు అనేశాడు. ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఆమెకు బోనీ కపూర్ కుటుంబంతో ఉన్న చనువుతో మిథున్ అనుమానాన్ని తీర్చేయాలనుకుంది. ఆ రాఖీ పౌర్ణిమ రోజు బోనీ కపూర్ వాళ్లింటికి వెళ్లి బోనీ చేతికి రాఖీ కట్టేసింది. మిథున్ చింతను దూరం చేసింది శ్రీదేవి. ఆత్మహత్య.. ఈలోపు పేజ్ త్రీ .. మిథున్, శ్రీదేవీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తను (అది వదంతే అని శ్రీదేవి, మిథున్ ఇద్దరూ కూడా కొట్టిపారేశారు) ప్రచారం చేసింది. ఇది యోగితాకు తెలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాంతో మిథున్ భయపడ్డాడు యోగితా ముందు విడాకుల విషయం తేవడానికి. ఇటు శ్రీదేవినీ వదులుకోదల్చుకోలేదతను. శ్రీదేవికి ఆ తాత్సారం అర్థం కాలేదు. మళ్లీ అడిగింది. ‘నేను కావాలో.. నీ భార్య కావాలో తేల్చుకో’ అని అల్టిమేటమూ ఇచ్చింది. యోగితాకు దూరమయ్యే ధైర్యం చేయలేకపోయాడు. అర్థం చేసుకుంది శ్రీదేవి. నెమ్మదిగా మిథున్ జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. దాదాపు అయిదేళ్ల ఆ ప్రేమ అలా విషాదాంతమైంది. మానసిక క్షోభకు చాలానే గురైంది శ్రీదేవి. ఆ తర్వాత ఆమె కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు బోనీ కపూరే అండగా నిలబడ్డాడనీ అలా బోనీలో శ్రీదేవి ఓదార్పు వెదుక్కుందని, అతని ప్రేమను అంగీకరించి భర్తగా చేసుకుందని బోనీ, శ్రీదేవీల పెళ్లికి నేపథ్యం చెప్తారు ఇండస్ట్రీలో వాళ్లు. తాను కల కన్న పెద్ద కూతురు జాన్వీ కెరీర్ చూడకుండానే అర్థంతరంగా 54 ఏళ్లకే ఈ లోకానికి వీడ్కోలు చెప్పింది శ్రీదేవి. మిథున్ ఇష్టాన్ని నేనేప్పుడూ కాదనలేదు. ఒకవేళ అతను రెండో పెళ్లి చేసుకొని వచ్చినా నేను ఒప్పుకునేదాన్ని. – యోగితా బాలి (స్టార్ అండ్ స్టైల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో). తనకు, బోనీకి మధ్య ఏమీ లేదని మిథున్‌కు నిరూపించడానికే బోనీకి రాఖీ కట్టింది శ్రీదేవి. – బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) - ఎస్సార్ -
ఆ హీరో ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.. కానీ!
వినోద్ మెహ్రా.. పేరు చెప్పగానే నాటి (1970, 80ల) బాలీవుడ్ అభిమానులకు బిందియా గోస్వామి గుర్తొస్తుంది.. ఆ వెంటనే రేఖ మెరుస్తుంది. ఈ ఇద్దరితో అతను ప్రేమలో పడ్డాడు. కెరీర్లో స్టార్‌గా వెలిగిన వినోద్ మెహ్రా .. ప్యార్ కా సఫర్ (ప్రేమ ప్రయాణం) మాత్రం సంతోషాల మజిలీ చేరలేదు. విషాదాంతంగా ముగిసి తీరని వ్యథను మిగిల్చింది.. ఆ బాధను రేఖా అనుభవించింది. 1958లో వచ్చిన ‘రాగినీ’ అనే సినిమాలో బాలనటుడిగా నటించిన వినోద్ మెహ్రా తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా, చదువు మీదే శ్రద్ధ పెట్టాడు. చదువయ్యాక ‘గోల్డ్ఫీల్డ్ మర్కంటైల్’లో ఎగ్జిక్యుటివ్‌గా ఉద్యోగంలో ఒదిగిపోయాడు.. నటన విషయమే మరిచిపోయి. స్నేహితుల ప్రోద్బలంతో ‘ఆల్ ఇండియా టాలెంట్ కంటెస్ట్ (1965)’లో పాల్గొన్నాడు. ఫైనల్లో రాజేశ్ ఖన్నాతో పోటీపడ్డాడు. రన్నరప్ టైటిల్‌తోపాటు సినిమా చాన్స్‌లూ అతని చెంత చేరాయి. ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ‘ఏక్ థీ రీటా’ హీరోగా అతని మొదటి సినిమా. వినోద్‌ను ప్రేక్షకులు గుర్తుపట్టి.. నటుడిగా గుర్తించడంతో ఆగకుండా సాగింది అతని కెరీర్. ఆ సమయంలోనే వినోద్‌కు పెళ్లి సంబంధం తెచ్చింది వాళ్లమ్మ. వధువు మీనా బోక్రా. పెళ్లయింది. చేతినిండా సినిమాలు.. తోడుగా చేరిన భాగస్వామితో ఆనందంగా గడిచిపోతున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. ఊహించని ఆ కుదుపుతో సినిమా ఆఫర్లు ఆగకపోయినా.. వైవాహిక జీవితంలో మాత్రం పగుళ్లు కనిపించాయి. ఆఫ్టర్ ది బ్రేక్ ఆరోగ్యం కుదుట పడ్డా మీనా వ్యవహారం వినోద్‌ను కలవర పెట్టింది. అప్పుడే అతని సహనటి బిందియా గోస్వామితో స్నేహం కుదిరింది. అది ప్రేమగానూ మారింది. ఇంట్లోంచి వెళ్లిపోయి ఆమెతో హోటల్లో ఉండసాగాడు. ఈ విషయం భార్య మీనా ద్వారా ఆమె తండ్రికి తెలిసింది. అల్లుడిపై విరుచుకుపడ్డాడు. ఆ జంటను వేటాడడం మొదలుపెట్టాడు. ఈ నిజానికి కల్పనలు జోడించి మీడియా పండగ చేసుకోసాగింది. ఈ వ్యవహారానికి భయపడిపోయిన బిందియా గోస్వామి– తన స్నేహితుడు జేపీ దత్తా (రచయిత, దర్శకుడు, నిర్మాత) అండ కోరుకుంది. దాంతో వినోద్‌కు దూరమై జేపీ దత్తాకు చేరువైంది (ఆ తర్వాత అతణ్ణి పెళ్లీ చేసుకుంది బిందియా). ఈ పరిణామానికి కుంగిపోయాడు వినోద్. ఇటు అతని భార్య మీనా విడాకుల కోసం కోర్ట్‌లో కేసు వేసింది. సెకండ్ లవ్.. బిందియా గోస్వామి వదిలేసి వెళ్లడం.. జీవిత భాగస్వామి విడాకులివ్వడం వినోద్‌ను కలత పెట్టాయి. ఆ టైమ్‌లో అతనికి ఊరటగా కనిపించింది రేఖ. మొదటి నుంచీ ఈ ఇద్దరూ మంచి మిత్రులు. వీళ్లు కలిసి చేసిన సినిమాలూ హిట్టే. హిట్ పెయిర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. నిజానికి అప్పటికి రేఖ మనసూ కకావికలమై ఉంది అమితాబ్‌తో బ్రేకప్ వల్ల. అలా ఇద్దరూ ఒకరికొకరు ఓదార్పయ్యారు. అది ఆ జంటను ప్రేమలోకి దింపింది. ఈ ముచ్చటనూ వదంతులుగా సెలబ్రేట్ చేసుకుంది పేజ్ త్రీ. పట్టించుకోలేదు ఆ ఇద్దరూ. మరింత కుతూహలం ప్రదర్శించాయి పత్రికలు. వినోద్, రేఖలు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనీ ప్రచారం చేశాయి. దానికీ స్పందించలేదు వాళ్లు. ఈలోపు రేఖను తమ ఇంటికి తీసుకెళ్లి వాళ్లమ్మకు తమ ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు వినోద్. అనుకున్నట్టుగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. పత్రికల్లో వీళ్ల పెళ్లి సంగతి చదివి ఉన్న వినోద్ తల్లి.. అలా వాళ్లిద్దరినీ జంటగా చూసేసరికి ఆ వదంతి నిజమే అనుకుంది. పట్టరాని కోపంతో రేఖ పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఊహించని ఆ తీరుకి బిత్తరపోయింది రేఖ. వినోద్‌కూ నోట మాటరాలేదు. రేఖను బయటకు తీసుకెళ్లి ‘అమ్మ కోపం తగ్గేవరకు ఓపిక పడదాం’ అని చెప్పాడు. కాని ఆ సంఘటనను జీర్ణించుకోలేని రేఖ ఆ బంధాన్ని అక్కడితో తెంచేసుకోవాలనుకుంది. స్నేహాన్ని మాత్రం నిలుపుకుంది చివరి వరకు. ఆఖరి ముడి రేఖను మరిచిపోవడం అంత తేలిక కాలేదు వినోద్‌కు. ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. వ్యాకులతతో కుమిలిపోయాడు. కొడుకు పరిస్థితిని చూసి త్వరలో అతణ్ణి ఒక ఇంటివాడిని చేయాలని నిశ్చయించుకుంది వినోద్ తల్లి. కెన్యాలో స్థిరపడ్డ పంజాబీ వ్యాపార కుంటుంబంలోని అమ్మాయి కిరణ్‌తో వినోద్‌కు వివాహం జరిపించింది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. అంతా సవ్యంగా ఉంది అని వినోద్ తల్లి ఊపిరి పీల్చుకుంటూండగా వినోద్ ఊపిరి ఆగిపోయింది.. రెండోసారి వచ్చిన గుండెపోటుతో. వందకు పైగా సినిమాలతో కెరీర్ గ్రాఫ్‌లో ముందుకు సాగి.. నలభై అయిదేళ్లకే జీవితాన్ని చాలించాడు. ప్రేమనే కాదు పెళ్లినీ సాఫల్యం చేసుకోలేకపోయాడు. ∙ఎస్సార్ -
అన్న లవర్ నాకు డబ్బులిచ్చేది: అవినాష్ తమ్ముడు
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ అందరినీ నవ్విస్తూ హౌస్‌లో బెస్ట్ ఎంటర్టైనర్గా నిలుస్తున్నాడు. అటు ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లను కూడా మెప్పిస్తుండటంతో కనీసం నామినేషన్లోకి కూడా రావడం లేదు. కానీ అతడు ఇంట్లోకి వచ్చాక హౌస్‌లోనే ఓ వెలుగు వచ్చిందన్నది నెటిజన్ల అభిప్రాయం. అయితే అందరినీ ఇంతలా నవ్వించే అవినాష్ జీవితంలోనూ ఎన్నో కష్టాలున్నాయని అతడి ఎంట్రీ వీడియోలో చూపించారు. మరీ ముఖ్యంగా అవినాష్ ఓ అమ్మాయిని ప్రేమించడం, చివరాఖరకు ఆ ప్రేమ విఫలమవడాన్ని హైలైట్ చేశారు. అప్పటినుంచి ఆ అమ్మాయి ఎవరు? వాళ్ల ప్రేమ ఎందుకు ముందుకు వెళ్లలేదు? అని అవినాష్ అభిమానులు తెగ చించేస్తున్నారు. దీంతో అతడి బ్రేకప్ స్టోరీ గురించి అవినాష్ తమ్ముడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. (అవినాష్ తిక్క కుదిర్చిన అరియానా) ఆమె పిలిచి మరీ డబ్బులిచ్చేది "మేం ముగ్గురం అన్నదమ్ములం, హాస్టల్లో ఉండేవాళ్లం. అవినాష్ అన్నయ్య టెన్త్‌లో ఉన్నప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నాను. స్కూల్ డేస్‌లో అట్రాక్షన్ ఉండేది. కాబట్టి అన్నయ్య ఓ అమ్మాయిని ప్రేమించాడు, ఆమె చుట్టూ తిరిగేవాడు. స్కూల్‌కు వచ్చినా కూడా ఆమెపైనే ఫోకస్ పెట్టేవాడు, ఆమె ఎక్కడకు వెళ్తే అటు ఫాలో అయ్యేవాడు. అప్పుడు నేను మా అన్న దాగ్గరకు వెళ్లి రూపాయి ఇవ్వు మైసూర్ పాక్ కొనుక్కుంటా, రెండు రూపాలిస్తే సోనీ పాపడ్ కొనుక్కుంటా అని అడిగేవాడిని. వాడేమో లేవు పో, నేనివ్వను అనేవాడు. అప్పుడు ఆ అమ్మాయి నన్ను పిలిచి రూపాయి కావాలా అంటూ డబ్బులిచ్చేది" (లాక్డౌన్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా) అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయింది "దీంతో ఏదైనా అవసరం ఉంటే అన్నయ్య దగ్గరకు వెళ్లేవాడిని కాదు. అక్కా అక్కా అంటూ ఆమె దగ్గరకే వెళ్లి తీసుకునేవాడిని. అప్పుడు ఆ వరసలు తెలీక అక్కా అని పిలిచేవాడిని. తర్వాత అన్నయ్య చదువైపోయింది. నేను పదో తరగతికి వచ్చాను, అప్పుడు తెలుసుకున్నా, ఆ అమ్మాయిని లవ్ చేశాడని! కానీ ఆ అమ్మాయిని బాగా ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. కానీ కొన్ని కరాణాల వల్ల బ్రేకప్ అయింది. అయితే ఆ కారణాలేంటో తెలీదు. బ్రేకప్ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. మిమిక్రీ, స్టేజీ షోలు చేసేవాళ్లం. అన్నయ్య టాలెంట్ చూసి ప్రిన్సిపాల్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. అలా ఇక్కడివరకు వచ్చాడు. అతడిని ఈ సీజన్ విజేతగా చూడాలనుకుంటున్నాను" అని అజయ్ చెప్పుకొచ్చాడు. (టాస్కులో పడిపోయిన అవినాష్) -
లాగిపెట్టి కొట్టి ‘పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?’..
నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఇంటి పక్క ఇంట్లో ఓ అమ్మాయి ఉండేది. తను ఏడవ తరగతి చదువుతుండేది. ఒకే ఊరు కనుక కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్లం. నేను మా ఇంట్లో అమ్మకు సహాయం చేసే వాడిని, తను నాకు సహాయం చేసేది. అలా మా మధ్య ఇష్టం చాలా పెరిగింది. తనెప్పుడూ నా కోసమే ఆలోచించేది. తనంటే ఇష్టంగా ఉండేవాడిని కానీ, ప్రేమ అని అనుకోలేదు. తను నా మీద పెంచుకుంటున్న ఇష్టం అందరూ గమనించారు! నేను తప్ప. ఆమె మా పేర్లు ఫ్లేమ్స్ వేసుకుని, ఆ పేపరు బ్యాగులో ఉంచుకుంది. నాకు సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా దాచుకునేది. అవన్నీ గమనించిన వాళ్ల ఇంట్లో వాళ్లు తనని నా నుండి దూరం పెట్టారు. అప్పుడు అర్థమైంది నాకు, తనని నేను ఇష్టపడతున్నానని. ఇక అప్పటినుంచి తనకు దూరంగా ఉండటం నరకంలా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నా పక్కనే కూర్చునేది. ఊర్లో అందరూ మేము భార్యాభర్తలం అనుకునేలా ఉండేది. కొద్ది రోజులకి తనని నాతో పూర్తిగా మాట్లాడకుండా చేశారు. వాళ్ల పిన్ని ఆ అమ్మాయిని కొట్టి నాకు దూరం చేసింది. అలా రెండేళ్లు మేము దూరంగా ఉన్నాం. తర్వాత మళ్లీ మాట్లాడింది. కానీ, ఇక మీదట మేము అందరిలో కలిసి ఉండకూడదు అని నిశ్చయించుకున్నాం. ఎవరికీ తెలియకుండానే మాట్లాడుకునేవాళ్లం. అందుకు వాళ్ల చెల్లెలు కూడా మాకు హెల్ప్ చేసింది. మెసేజెస్, కాల్స్ చేసుకునేవాళ్లం. మాకు ఆస్తిలేని కారణంగా తనని దూరం చేశారు. వాళ్ల మామయ్యకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఖాయం చేశారు. తను అప్పటినుంచి ఏడుస్తూ ఉండేది. ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నా వయసు 19 తనను తీసుకుని వెళ్లలేను. అలా అని ఆపలేను. చచ్చిపోవాలనుకున్నా. తను కూడా అలానే అనుకుంది. ఆస్తి, వయసు కారణంగా నా ప్రేమ నాకు దూరం అయింది. ఒకసారి అడిగా నేనంటే అంత ఇష్టమా అని తను లాగిపెట్టి కొట్టింది. ‘నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు అలా అడిగావు. ఇంకెప్పుడూ అలా అడగకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఇలా అడుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను తలుచుకుని చచ్చిపోతాను. ఎప్పటికీ నీ కోసమే ఆలోచిస్తూ బ్రతుకుతాను’ అంది. ఒక్కసారిగా నన్ను పట్టుకుని ఏడ్చింది. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒక అమ్మాయిని పట్టుకోవటం అదే మొదటిసారి. నా లైఫ్‌లో ఆరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అడిగా ‘మరి నాతో వచ్చేయొచ్చు కదా’ అని. తను రాను అంది. ఏం అంటే ‘మా ఇంట్లో వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. నా మూలంగా వాళ్లు అవమానపడకూడదు.’ అంది. ‘మరి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు’ అన్నాను. ‘ నా లైఫ్ అంతే! ఈ జన్మకు ఇలా అవ్వాలని రాశాడేమో దేవుడు’ అంది. చాలా బాధగా అనిపించింది. అప్పుడు తనో కోరిక కోరింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని. ‘అదేంటీ?’ అన్నా. ‘ఎవరికీ తెలియకపోయినా నువ్వు నా వాడివి అనే ఫీలింగ్ నాకు చాలు. నువ్వు నన్ను చేసుకో’ అంది. తన బర్త్‌డే రోజు బొట్టు పెట్టించుకుంది. ‘నా బర్త్ డే అని కాకుండా నువ్వు బొట్టు పెట్టిన రోజుగా గుర్తుంచుకుంటా’ అని ఏడ్చింది. ‘ఇలానే ఉండిపోవాలని ఉంది. ఇంకో జన్మంటూ ఉంటే నీతో ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా’ అని అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రేమంటే ఎదుటి వ్యక్తి కళ్లల్లోనే తెలుస్తుంది. తన కళ్లు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నాయని నాకు చెబుతాయి. తన కళ్లు చూస్తే ఆ కళ్లు నా కోసం బాధపడుతున్నాయని నాకు అర్థం అవుతుంది. ఇంకో లైఫ్ ఉంటే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ప్రేమించే నీ ప్రేమని, ఐ మిస్ యూ బంగారం! - స్వామి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు! బస్‌లో...
2008లో నేను బీటెక్‌లో జాయిన్ అయ్యాను! అప్పుడే మొదటిసారి ఈడీసీ ల్యాబ్‌లో ఆద్యను చూశాను. ఆమె అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అది చూసి నాకు కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించేది. నేను చాలా షైగా ఉండేవాడిని. సో తనతో మాట్లాడటానికి, ఫ్రెండ్షిప్ చెయ్యడానికి చాలా రోజులు పట్టింది. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి కొంచెం క్లోజ్ అయ్యాం. కానీ, తన మీద లవ్ ఉందని నాకు తెలియలేదు. వేరే ఎవరైనా నా కన్నా తనతో క్లోజ్‌గా ఉంటే బాగా కుళ్లు వచ్చేది. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ ఒకడు తనకి లవ్ ప్రపోజ్ చేశాడు. తను కూడా ఒప్పుకుంది. ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. వాళ్లిద్దరూ నా ఫ్రెండ్స్ కాబట్టి. కానీ ఉండేకొద్దీ వాళ్లిద్దరూ బాగా క్లోజ్‌గా ఉండటం, అన్నీ షేర్ చేసుకోవడం అన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే అర్ధం అయ్యింది! నేను తనని లవ్ చేస్తున్నా అని. ఎందుకో తెలీదు వాళ్ళ లవ్ ఒక నెలలోనే బ్రేకప్ అయింది. ఆ తర్వాత తన ఫ్యామిలీలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. వాటి వల్ల తను మెంటల్‌గా ఇబ్బందికి గురయ్యింది. తనకి నేను చాలా ధైర్యం ఇవ్వాలనుకున్నా. కానీ, కాలేజ్‌కి కూడా సరిగా వచ్చేది కాదు. నా ఫ్రెండ్ లాగా నేను మాటకారిని కూడా కాదు. థర్డ్ ఇయర్ చివర్లో తను కోలుకుంది. వాళ్ల ఫ్యామిలీ కూడా మా ఇంటి వెనక లైన్లోకి షిప్టు అయ్యారు. థర్డ్ ఇయర్ తర్వాత సమ్మర్ హాలిడేస్‌లో తను కొన్ని కోర్సెస్‌లో జాయిన్ అయ్యింది. అది తెలిసి నేను కూడా తను ఉన్నచోటే జాయిన్ అయ్యాను. ఆ రోజులు నా జీవితంలో గోల్డెన్ డేస్. తనతో చాలా సేపు కలసి ఉండేవాడిని. ఇంటికి కలిసి వెళ్లేవాళ్లం. చాలా ఫాస్ట్‌గా రెండు నెలలు గడిచిపోయాయి. అప్పుడే తనకి నా లవ్ గురించి చెప్పాను. మెసేజ్‌లో, డైరెక్ట్‌గా చెప్పే అంత ధైర్యం నాకు లేదు. అది చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు నేను తనని డైరెక్ట్‌గా చూడలేకపోయా. తను నార్మల్‌గానే ఉంది. కానీ, నాకు మాత్రం ఏదో తెలియని ఫీలింగ్. నన్ను తను ఎప్పుడు ఒక పిల్లోడి లాగా, అమాయకుడిలాగా, ఫ్రెండ్ లాగానే చూసింది. కానీ నేనంటే చాలా కేరింగ్‌గా ఉండేది. చాలా వాల్యూ అండ్ ఇంఫార్టెన్స్ ఇచ్చేది. అందుకే తను అంటే నాకు చాలా అభిమానం. అవునని లేదా కాదని ఏమీ చెప్పలేదు. మేము అలానే కంటిన్యూ అయ్యాము. నేను తనని లవ్ చేస్తున్నా అని, నన్ను బాగా టీజ్ చేసేది. తను అలా చేస్తుంటే నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. తను నాతో చాలా సీక్రెట్స్ షేర్ చేసుకునేది. అలా మా క్లాస్‌కి సంబంధించి ఎదో ఒకటి షేర్ చేసుకునేది. దాన్ని నేను నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడికి ఒకసారి మాటల్లో చెప్పాను. వాడు దాన్ని ఒక గొడవ నుండి బయట పడటానికి వాడుకున్నాడు. దాని వల్ల తను నాతో చాలా రోజులు మాట్లాడలేదు. లాస్ట్ డేస్‌లో మళ్లీ మాట్లాడింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. దాన్ని అలానే కంటిన్యూ చేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ, కాలేజ్ అయిపోయిన ఒక రెండు నెలల తర్వాత ఎదో విషయం మళ్లీ ఎవరికో చెప్పానని మాట్లాడటం ఆపేసింది. చాలా బాధ పడ్డాను. తర్వాత మాట్లాదిద్ది అనుకున్నా. కానీ, 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎన్నో సార్లు మెసేజ్ చేసినా నో రిప్లై. నేను ఫారెన్ వెళ్లి సెటిల్ అయ్యాను. అయినా తన పుట్టినరోజు అప్పుడు న్యూ ఇయర్‌కి మెసేజెస్ చేస్తూనే ఉన్నాను. కానీ నో రెస్పాన్స్. తన రిప్లై కోసం ఎంత తపించానో నాకు తెలుసు. తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి నేను కూడా పెళ్లి చేసుకున్నా. కానీ, తనను నేను ఇంకా మిస్ అవుతున్నాను, ఒక మంచి ఫ్రెండ్‌లాగా తనతో మళ్లీ మాట్లాడాలని ఉంది కానీ ఏమీ చెయ్యలేకపోతున్నా. తనంటే నాకు చాలా ఇష్టం. తన క్యారెక్టర్ అంటే ఇష్టం! నా పట్ల తను చూపించే ప్రేమ, కేరింగ్ అంటే ఇష్టం. తనని ఎంత ఇష్టపడ్డా, ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు నేను, బస్‌లో కూడా అవకాశం వచ్చినా పక్కన కూర్చునే వాడిని కాదు. అందరూ తనని ఏం అనుకుంటారో అని. తనని చూడటం, తనతో మాట్లాడటం...ఇవే నాకు చాలా మ్యాజికల్ ఫీలింగ్స్ ఇచ్చేవి. తనని మిస్ అవ్వడమే నా జీవితంలో నేను ఎప్పటికి తిరిగి పొందలేనిది, ఎప్పటికి బాధ పడే విషయం. ఆమె ముందు అన్నీ చిన్నవే అనిపిస్తుంది, ఆద్య నన్ను ఒక్కసారి అయినా లవ్ చేసిందో లేదో తెలీదు. కానీ, నేను ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏం అనుకున్నా తను, ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. - చంద్రకాంత్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
చాలా సార్లు అనిపించింది! ధైర్యం చాల్లేదు..
నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో అభిని చూశాను. తను మా సీనియర్! చాలా అందంగా ఉండేవాడు. చూడగానే నచ్చేశాడు. ప్రతిరోజూ కాలేజీలో అతడ్ని చూసేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ అతడిమీద చాలా ఆశలు పెంచుకున్నాను. నా ప్రేమ సంగతి అతని చెబుదామని లెక్కలేనన్ని సార్లు అనిపించింది! ధైర్యం చాలక ఆగిపోయాను. తను కనిపించని రోజు చాలా బాధగా ఉండేది. వేసవి సెలవుల్లో అయితే ఇంకా కష్టంగా. అందరు సెలవుల కోసం ఎదురుచూస్తే.. నేను సెలవులు ఎప్పుడు అయిపోతాయా! అభిని ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసేదాన్ని. నేను సెకండ్ ఇయర్, తను థర్డ్ ఇయర్. తనతో ఒక్కసారైనా మాట్లాడే అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఓ రోజు తనే నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మాట్లాడింది రెండు మాటలే అయినా చాలా సంతోషంగా అనిపించింది. చూస్తుండగానే అతడి ఫైనల్ ఇయర్ ఎండింగ్‌కు వచ్చింది. ఫేరెవల్ పార్టీలో చివరిసారిగా అతడ్ని చూశాను. తర్వాత చూడలేదు. ఐదేళ్లు గడిచిపోయింది. అయినా అతడ్ని మర్చిపోలేకపోతున్నా. ప్రతిరోజూ అతడు గుర్తుకువస్తూనే ఉంటాడు. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. వచ్చే జన్మకైనా నా ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తూ.. - సణ్ముఖి, గోపల్లె చదవండి : అయ్యో! వాలెంటైన్స్ రోజు.. ఫీల్ పోయింది.. నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అమ్మ కోసం ఆమెను వదులుకున్నా! కానీ..
మొదటిసారి తనను ఒక కోచింగ్ సెంటర్లో చూశాను. తను యావరేజ్‌గా ఉన్నా ఎందుకో చూడగానే నచ్చేసింది. అక్కడ నన్ను ఇష్టపడేవారు ఎక్కువ ఉన్నా.. నేనెవరినీ పట్టించుకునేవాడినికాదు. అందరినీ చెల్లీ అంటూ పలకరించేవాడిని. కానీ, తనను మాత్రం పేరు పెట్టి పిలిచేవాడిని. అలా పిలవడంతోనే నా ప్రేమ విషయం అక్కడ ఉన్న అందరికీ తెలిసి పోయింది. తను కూడా నాతో చాలా బాగా మాట్లాడేది. అలా మొదలైన మా పరిచయం కోచింగ్ అయిపోగానే ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడేవరకు వచ్చింది. అలా ఒకరోజు తనే నాకు మెసేజ్ చేసి ప్రపోజ్ చేసింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. అలా మొదలైన మా ప్రేమ కథ ఐదేళ్లు కొనసాగింది. ఒక రోజు వాళ్ల ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసి తనను కొట్టారు. వాళ్ల నాన్న తనతో నాకు ఫోన్ చేయించారు. నేను వెంటనే వాళ్లింటికి వెళ్లాను. వాళ్లు మర్యాదగానే ‘నీకు నచ్చితే! మీరు ఒకరినిఒకరు ఒదిలి ఉండలేకపోతే పెళ్లి చేసుకోండి. ఇంటి దగ్గర ఒప్పించి రా’ అని నాకు చెప్పారు. దీంతో నేను మా వాళ్లను ఒప్పించే పనిలో పడ్డా. మా అమ్మకి అస్సలు ఇష్టం లేకపోవడంతో అదే విషయం వాళ్ల నాన్నకు కాల్ చేసి చెప్పా. ఆయన సింపుల్‌గా ‘సరే! ఇకనుంచి మా అమ్మాయిని మళ్లీ కలుసుకునే ప్రయత్నం చెయ్యెద్దు.’ అని చెప్పి తనను బెదిరించాడు. దాంతో క్లోజ్ అయిందనుకున్న నా ప్రేమ కథ తను మళ్లీ ఫోన్ చేసి‘ బ్రతికున్నంతకాలం ఇలానే ఉందాం!’ అని చెప్పేసరికి మళ్లీ మొదలైంది. అప్పటినుంచి మామూలుగా ఫోన్లలో మాట్లాడుకునేవాళ్లం. అలా మా ప్రేమ వ్యవహారం తను పెళ్లి చేసుకోవటంతో ముగిసింది. నేను మా అమ్మ తర్వాత అమ్మ అనుకున్న తను పెళ్లి అయ్యాక మళ్లీ ఫోన్ కూడా చేయకపోవటంతో నా బాధకు అవధులు లేకుండాపోయాయి. 18 నెలలుగా నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో చెప్పలేను. తను నా నుండి విడిపోయినప్పటికి నాతో మాట్లాడతానని చెప్పింది. కానీ, తను ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. కనీపెంచిన అమ్మను కాదనలేక నేను తనను వదులుకున్నా. ఇప్పుడు నేను మనో వేధనతో బాధపడుతున్నా. నరకం చూస్తున్నా. తనని మర్చిపోలేక, వేరే వాళ్లు నన్ను ఇష్టపడి ప్రపోజ్ చేసినా.. నా మనసు అంగీకరించక దూరం పెడుతూ వస్తున్నా. కానీ, నాకు మరో అమ్మవు అవుతావనుకున్న నువ్వు ఇలా మధ్యలో వదిలేస్తావనుకోలేదు బంగారం. నువ్వెక్కడున్నా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. - సురేష్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రేమించాడు! ఫోన్ చేస్తే అక్కా అన్నాడు
నేను హైదరాబాద్‌లోనే నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. కానీ, నాకు మా హాస్టల్, కాలేజీ తప్ప ఇంకేమీ తెలియదు. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితులు నాకు బాగా తెలుసు. అందుకని చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. ఆ తర్వాత నేను ఓ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అక్కడ లాస్ట్ బెంచ్‌లో కూర్చునేదాన్ని. జాయిన్ అయిన రోజు నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మా బెంచ్ వెనకాలే ఓ అబ్బాయి కూర్చునే వాడు. మొదట్లో పట్టించుకోకపోయే వాళ్లం. మా అల్లరి మాకు ఉండేది. కానీ, కొన్ని రోజులకు నాకంటే ముందే మా ఫ్రెండ్స్‌కు తెలిసి పోయింది. ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడని. నా ఫ్రెండ్స్ ఆ విషయం నాకు చెప్పారు. కానీ, చాలా చాలా లైట్‌గా తీసుకున్నా. ఇంట్లో సమస్యలు, ఇంకా నేను చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నాను. లేనిపోనివన్నీ ఎందుకని మిన్నకుండిపోయా. మా కోర్సులో అతడి వైపు చూడని వాళ్లు లేరు. మా కంటే ఏజ్‌లో పెద్ద వాళ్లు కూడా తనను చూసేవాళ్లు. ఒక మూడు రోజులు నేను క్లాస్‌కు వెళ్లలేదు. అప్పుడు తను చాలా ఏడ్చాడంట. క్లాస్ వినకుండా హాస్టల్‌కు వెళ్లిపోయేవాడంట. నేను ఇవన్నీ తను ఎదురుగా ఉన్నపుడు అస్సలు పట్టించుకోలేదు. కానీ, తను ఎక్షామ్ రాయటానికి ఇంటికి వెళ్లాడు. చాలా ఏడ్చాను. మా ప్రెండ్స్‌తో కాల్ చేయించాను! తను లిఫ్ట్ చేయలేదు. మళ్లీ ఎక్షామ్ రాసి వచ్చాక అసలు నేను తన కోసం ఒక్కదాన్నే వెనక బెంచీలో కూర్చునే దాన్ని. తను నాకోసం ఒక్కడే కూర్చునే వాడు. ఒక రోజు మా ఇంట్లో సమస్యలు మా ఫ్రెండ్‌కు చెప్పి చాలా ఏడ్చాను. తను ఏమనుకున్నాడో ఏమో మా మధ్య చాలా గ్యాప్ పెరిగింది. తను చూసినా చూపులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మా ఫ్రెండ్‌కు చెప్పా! వాళ్లు అతని నెంబర్ తీసుకుని నాకిచ్చారు. నేను ఫోన్ చేస్తే అక్కా అన్నాడు. అర్థం కాలేదు. అంత ప్రేమగా చూసిన చూపులు అబద్ధం అంటే నమ్మలేకపోతున్నా. నా కోసం ఏడ్చిన మనిషి అలా అన్నాడని ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కాలేదు.ఇప్పుడు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. తన గురించి తెలిసి అలాంటివన్నీ మర్చిపొమ్మని చెబుతున్నారు. కానీ, ఎందుకో మర్చిపోలేకపోతున్నా. దీని వల్ల నా లైఫ్‌లో జాబ్, ఫ్రెండ్స్ అందరికీ దూరం అయ్యాను. ఒంటరిగా ఉంటున్నా. నన్ను నన్నులా ఇష్టపడ్డ తనని మనసులో ఉంచుకుని ఇంకొకరితో జీవితాన్ని పంచుకోవటానికి మనసు ఒప్పుకోవటం లేదు. ఎందుకో కానీ, తప్పదు. అమ్మానాన్నల సంతోషం కోసం చేసుకుంటా. - సునీత లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
రెడ్ డ్రెస్‌లో బాగున్నావ్ అన్నాను.. అంతే!
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు చదువు, కెరీర్ తప్ప ఇంకో ఆలోచన లేదు. ప్లానింగ్ ప్రకారం డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించా. అలా హ్యాపీగా గడిచిపోతున్న నాలైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చింది. నేను అపెండిక్స్ ఆపరేషన్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నా పక్క పేషెంట్ వాళ్ల అక్క తను. నాకు ఆమె చాలా బాగా నచ్చింది. వాళ్ల తమ్ముడితో మాటలు కలిపి తెలుసుకున్నా.. వాళ్లు మా కులమే అని. వాళ్లది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక నాకు అడ్డు లేదు అనుకున్నా. డైలీ వాళ్ల తమ్ముడి కోసం టిఫిన్ తీసుకొచ్చేది. మెల్లగా మాటలు కలిపా. డిశ్చార్జ్ రోజు నెంబర్లు మార్చుకున్నాం. ఇంటికి చేరుకున్నాక‘ ఇంటికి క్షేమంగా చేరుకున్నారా?’ అని మెసేజ్ వచ్చింది. అలా ఒక నెల మాటలతో గడిపాం. నాకు రోజు రోజుకు తనపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఓ రోజు ఉండబట్టలేక ఫోన్లో నా ప్రేమ సంగతి చెప్పా. ‘ నువ్వు ఓకే అంటే మా పేరెంట్స్‌తో వచ్చి మీ పేరెంట్స్‌తో మాట్లాడతా’ అని. అప్పుడు తను ‘ నాకు ఇష్టం లేదు. ఆసక్తి ఉన్నపుడు తప్పక చెబుతా’ అని అంది. నేను ఊరుకోకుండా వాళ్ల ఊరికి వెళ్లి ఆమెను చూసి ‘ రెడ్ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావ్’ అని మెసేజ్ చేశా. తను భయపడి వాళ్ల మామయ్యకు చెప్పింది. అతన్ని కన్విన్స్ చేయటానికి చాలా ట్రై చేశాను కానీ, నా మాటవినలేదు. అలా కుదరదని మా బంధువులతో కలిసి వాళ్ల పేరెంట్స్ దగ్గరకు సంబంధం తీసుకెళ్లా. కానీ, ఆ విలేజ్‌కు హైదరాబాద్ చాలా దూరం అని పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. తర్వాత మా చుట్టాల అమ్మాయితో నా పెళ్లి అయిపోయింది. కానీ, తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. - వెంకట్, హైదరాబాద్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఫ్రెండ్స్ మధ్య వీడియో కాల్స్ ఎందుకు?
తన పేరు చిన్ని! మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైంది. ఫోన్లో బాగా మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఆమెకు ఎదురుపడి మాట్లాడటానికి నేను చాలా సిగ్గుపడేవాడిని. నేను చాలా పొసెసివ్! నాది అని అనుకుంటే దేన్నీ వదలను. కానీ, తను ఎప్పుడు చూసినా గంటలు గంటలు వేరేవాళ్లతో మాట్లాడేది. అయినప్పటికి నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఈ సమయంలోనే మా స్నేహం ప్రేమగా మారిపోయింది. దాదాపు 5నెలలనుంచి క్లోస్‌గా ఉంటున్నాం. ఈ మధ్యలో తను స్మార్ట్‌ఫోన్ కొన్నది కానీ, ఆ విషయం నాకు ఓ నెల తర్వాత చెప్పింది. అప్పటినుంచి తను నా చెయ్యి దాటిపోతోందని అనిపించింది. ఒక రోజు నాకో నిజం తెలిసింది. తను నాతోనే కాకుండా ఇంకో వ్యక్తితో మాట్లాడుతోందని. కొన్ని గంటలపాటు వీడియోకాల్స్ చేసేది. నేను తన ఫోన్ చూస్తానని అన్నీ డిలేట్ చేసేది. ఒక రోజు వాటిని డిలేట్ చేయటం మర్చిపోయింది. తనకు తెలియకుండా అతడికి ఫోన్ చేస్తే ‘మా ఇంట్లో ఒప్పించుకో నిన్ను చేసుకుంటాన’ని చెప్పిందంట. నేను ఆమెను అడిగితే ‘మేము మంచి ఫ్రెండ్స్! ఊరికే పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు. అందుకే ఇంట్లో అడుగు అన్నా.’ అని చెప్పింది. నేను ‘ఫ్రెండ్స్ మధ్య వీడియో కాల్స్ ఎందుకు’ అని అడిగా. ‘ఊరికే చేస్తున్నాడు’ అని అంది. ‘ ఊరికే ప్రేమించు అని అడిగితే ఒప్పుకుంటావా?’ అన్న ప్రశ్నకు తను సమాధానం చెప్పలేదు. తర్వాత ఏదో జరిగి వాడు మాట్లాడటం మానేశాడనుకుంటా. ఇంక ఎవరితోనూ మాట్లాడనని చెప్పింది. ‘మంచిదే ఇకపై నిజాయితీగా ఉందాం’ అనిచెప్పా. తను ఎఫ్బీలో ఇంకొకడితో చాటింగ్ మొదలుపెట్టింది. నన్ను అనుమానంగాడు అనుకోకండి. అమ్మాయిలు బాయ్స్‌తో మాట్లాడొచ్చు కానీ, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ముక్కుముఖం తెలియని వ్యక్తితో నేను ప్రేమించిన అమ్మాయి కొన్ని గంటలు వీడియో కాల్స్ చేసి మాట్లాడటం అనేది నాకు కరెక్ట్ కాదు అనిపించింది. తనను తప్పుగా అనుకోలేదు. అయితే నిజాలు మాత్రం చెప్పటంలేదనిపించింది. ఇక తననుంచి దూరం అవుదామనుకున్నా. 8 నెలలు గడిచింది. నా వల్లకావటం లేదు. అమ్మాయిని ఓ అబ్బాయి మోసం చేస్తే అన్ని చట్టాలు వారికి అనుకూలం. కానీ, ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయిని అందరూ వెధవలా చూస్తారు. నేను ఆ వెధవల్లో ఒకడినే. థాంక్యూ సో మచ్ చిన్ని! నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. - నాని, ఒంగోలు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అందుకే నేను, నా భార్య విడిపోయాం
మాది కరీంనగర్ జిల్లా. నా చిన్నప్పటి క్లాస్మేట్ పేరు వినీత. తనంటే నాకు చాలా ఇష్టం. తను మా ఇంటి ఎదురుగా ఉండేది. మా ఇద్దరి ఫాదర్స్ ఒకే కంపెనీలో జాబ్ చేసేవారు. అనుకోకుండా వాళ్లు పనిచేస్తున్న కంపెనీ షట్‌డౌన్ అయ్యింది. తర్వాత వాళ్లు ఊరు వదిలి పెట్టి హైదరబాద్ వెళ్లిపోయారు. తను ఎక్కడఉందో అని చాలా వెతికాను. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వాళ్ల నాన్న ఓ ఫంక్షన్‌కు వచ్చారు. అప్పుడు తన నెంబర్ తీసుకున్నా. తను అప్పుడు వేరే జిల్లాలో బీడీఎస్ చదువుతోంది. నెంబర్ తీసుకున్న వెంటనే తనకు కాల్ చేశా. ఆ ఆత్రుతలో తనను కలవటానికి ఆఫీసుకు లీవ్ పెట్టి మరీ అక్కడి వెళ్లాను. తనను చూశా! ఏదో చెప్పలేని సంతోషం. అలా చూస్తూ ఉండిపోయా. అలా రోజులు గడిచేకొద్ది నేను తనని కలవటానికి వెళ్లటం రొటీన్ అయ్యింది. ఈలోపు తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి హైదరబాద్ వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత నేను తనకు ప్రపోజ్ చేశా. మా కులాలు వేరు వేరు కావటంతో అందుకు తను స్పందించలేదు. కొన్ని రోజుల తర్వాత తను నాకు ఓకే చెప్పింది. ఇంక నా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. నా చిన్ననాటి స్నేహితురాలు నా జీవిత భాగస్వామి అవుతోందని. అలా రోజులు గడిచాక మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారు. నేను తనకు చెప్పి వాళ్ల ఇంట్లో వాళ్లతో మాట్లాడమన్నా. అదే సమయంలో వాళ్ల కజిన్ సిస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకోవటం వలన వాళ్లను కంప్లీట్ ఫ్యామిలీ దూరం పెట్టేశారు. తనకి ఆ భయం పట్టుకుంది. చాలా నరకం అనుభవించాం ఇద్దరం. కొద్దిరోజుల తర్వాత మా డాడీ ఫ్రెండ్ కూతురితో నాకు పెళ్లి నిశ్చయం అయ్యింది! నాకు ఇష్టం లేకుండానే. నా పెళ్లికి గంటముందు కూడా తనతో మాట్లాడా.. ఏమైనా పాజిటివ్‌గా స్పందిస్తుందేమోనని. కానీ, అలా ఏమీ జరగలేదు. ఇద్దరం చాలా ఏడ్చాము. తర్వాత నాకు పెళ్లైంది. పెళ్లైన ఒక నెల తర్వాత నా భార్య మాకు సంబంధించిన పాత మెసేజ్‌లు చదివింది. నాకు తెలియకుండా నా వైఫ్ ఆ అమ్మాయికి కాల్ చేసి తిట్టింది. తర్వాత ఆమెతో మాట్లాడటం మానేశాను. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. మా వైఫ్ వాళ్ల పేరెంట్స్ టార్చర్ వల్లే నేను నా భార్య విడిపోయాం. ఐదేళ్ల నుంచి కేసు కోర్టులో నడుస్తోంది . అనుకోకుండా ఓ రోజు వినీత పుట్టిన రోజు నాడు మా కామన్ ఫ్రెండ్ ఆమెను వాట్సాప్ గ్రూపులో ఆడ్ చేశాడు. నేను శుభాకాంక్షలు చెప్పినా నాకు సంతృప్తిగా అనిపించలేదు. ఫోన్ చేయాలా.. వద్దా.. అని డైలమాలో ఉండిపోయా. ఈవినింగ్ ఫోన్ చేసి విష్ చేశా. పది సంవత్సరాల తర్వాత ఫోన్ చేసినా తను నా వాయిస్‌ను గుర్తుపట్టింది. తనకి పెళ్లై ఒక పాప ఉంది. తను నా లైఫ్‌లో లేకపోయినా. అప్పుడప్పుడు తనతో మాట్లాడుతుంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతున్నట్లు అనిపిస్తుంది. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకునే వాడిలో నేను మొదటివాడ్ని. - వంశీధర్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నాకు ఫోన్ చేసి వెళ్లొద్దని ఏడ్చింది
ఓ రాంగ్ కాల్ ద్వారా తను నాకు పరిచయం అయ్యింది. వాట్సాప్‌లో తొమ్మిది రోజులు చాట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ కూడాఅయ్యాం. పదవ రోజు ఆ అమ్మాయి ఫోన్ పోయింది. నేను కాల్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. కాలేజ్ తెలీదు. ఫొటో కూడా చూడలేదు. అలానే ఒక నెల పాటు కాల్ చేశా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తర్వాత నేను కాల్ చేయటం మానేశా. తర్వాత మా ఫ్రెండ్ ‘ఫేస్బుక్లో నెంబర్‌తో ట్రై చేయ్’ అని చెప్పాడు. ఎనిమిది నెలల తర్వాత ఫేస్బుక్లో తన నెంబర్ టైప్ చేసి సెర్చ్ చేశా. ఏదో అబ్బాయి ఫ్రోఫైల్ ఓపెన్ అయ్యింది. అబ్బాయి ఫ్రెండ్ లిస్ట్‌లో తన పేరు సెర్చ్ చేశా! తన ఫ్రోఫైల్ దొరికింది. డైరెక్ట్ మెసేజ్ చేశా. ఎనిమిది నిమిషాల తర్వాత రిప్లై వచ్చింది. ‘కొన్ని నెలల క్రితం ఇద్దరం చాట్ చేసుకున్నాం’ అని ఆమెకు గుర్తుచేశా. తన పేరు చెప్పి నువ్వేకదా అని అడిగా. ‘అవును పిచ్చోడా! నా మొబైల్ పోయింది. నీ మెసేజ్ కోసం చాలా ఎదురు చూస్తున్నా. నీ నెంబర్ తెలీదు కానీ, మనం మళ్లీ కలుసుకుంటామని నాకు నమ్మకం ఉంది. అలా డైలీ చాటింగ్, కాల్స్ చేసుకునేవాళ్లం. రెండు నెలల తర్వాత తనకి ప్రపోజ్ చేశా. 23 రోజుల తర్వాత ఓకే చెప్పింది. అలా రెండేళ్లు మా మధ్య ప్రేమ హాయిగా నడిచింది. ప్రతిరోజూ ఆనందమే. గొడవలు అవుతుండేవి కానీ, వెంటనే కాంప్రమైజ్ అయ్యేవాళ్లం. లేవగానే మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడు పడుకుంటామో తెలీదు. అప్పుడే నాకు కోడలు పుట్టింది. కోడలి ఫంక్షన్లో మా విషయం ఇంట్లో చెప్పేస్తా అన్నా. మా ఇంట్లో అందరికి తెలుసు. కానీ, మా నాన్నకు తెలీదు. ఫంక్షన్లో చెబుదాం అనుకున్నా. ఆ అమ్మాయి మా విషయం వాళ్ల అమ్మతో చెప్పింది. దీంతో వాళ్లు చస్తామని బెదిరించారు. వెంటనే పెళ్లి చూపులు పెట్టారు. నేను వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లా.. వాళ్లు ఒప్పుకోలేదు. ఆర్థికంగా మేము బాగా ఉన్నాం. తనకు వచ్చిన సంబంధం ఆస్ట్రేలియానుంచి అందుకే నన్ను రిజెక్ట్ చేశారు. పెళ్లి అయిపోయింది. నేను పిచ్చోడిని అయిపోయా. డైలీ డ్రింక్ అండ్ స్మోక్ అలా నాలుగు నెలలు గడిపేశా. తర్వాత ఓ రోజు తనని ఓ బైక్‌పై చూశా. తను చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడు డిసైడ్ అయ్యా. నన్ను నేను మార్చుకోవాలని. గతంలో నేను ఆర్మీలో చేరాలని అనుకున్నాను. కానీ, తనకోసం నా ఆశయాన్ని మార్చుకున్నా. మళ్లీ ఆర్మీ ఈవెంట్స్‌కు హాజరై క్వాలిఫై అయ్యా. తనకు ఆ విషయం తెలిసి నాకు ఫోన్ చేసింది. వెళ్లొద్దని ఏడ్చింది. ప్రైవేట్ జాబ్ చేసుకోమంది. తన మాట కాదనలేకపోయా. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. అమ్మాయి ప్రేమ శాశ్వతం కాదు. తన సంతోషమే మన సంతోషం అనుకోవాలి. తనను లైఫ్ లాంగ్ ప్రేమిస్తా. ట్రూ లవ్ నెవర్ ఎండ్స్. - అజర్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రేమ, గొడవలు పీక్స్‌కు వెళ్లిపోయాయి
2017 మార్చిలో నాకు జాబ్ వచ్చింది. అమ్మకి నాన్నకు సహాయంగా ఉంటుందని మ్యారేజ్ చేసుకుందామనుకున్నాను. చాలా సంబంధాలు వచ్చాయి. నేను ఎవరినీ చూడటానికి వెళ్లలేదు. అమ్మాయిల ఫొటోలు కూడా చూడలేదు. ఎందుకంటే నాకు మొదట్లో ఒక మెయిల్ వచ్చింది! మ్యారేజ్ బ్రోకర్‌నుంచి. అందులో నాలుగు ఫొటోలు ఉన్నాయి. ఫస్ట్ ఓ ఫొటో ఓపెన్ చేసి చూశాను. తర్వాత ఫొటోలు చూడాలనిపించలేదు. తనే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయ్యా. ఇంట్లో కూడా చెప్పా తననే చేసుకుంటా ఇక ఏ సంబంధాలు చూడొద్దని. ఇంట్లో వాళ్లు కూడా సరే అని వాళ్లతో మాట్లాడారు. వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు. నేను నైట్ షిఫ్టులు చేస్తున్నానని. ఆమె ఫొటో చూడగానే నాకు బాగా నచ్చింది. అందుకే ఆ అమ్మాయి వాళ్లు రిజెక్ట్ చేసినా నాకు ఆమెపై మరింత ప్రేమ కలిగింది. తననే పెళ్లి చేసుకుంటా లేకపోతే లేదు అని నిర్ణయించుకున్నా. నాకు ఎక్కడో నమ్మకం తను మళ్లీ వస్తుందని. అది జరిగిన ఓ నెలకు మళ్లీ వాళ్లు మా ఫ్యామిలీని సంప్రదించారు. వాళ్ల మామయ్య నన్ను మా ఆఫీస్ దగ్గర కలిశాడు. నేను ఆ అమ్మాయికి కూడా నచ్చాను. ఆమెను లైవ్‌లో చూడటం ఎప్పుడా అని రెండు వారాలు ఎదురు చూశా. ఆ రోజు తనను చూడటానికి వెళ్లాను. వాళ్ల ఇంట్లో కూర్చుని ఉన్నా. తను నా ముందుకు రావటానికి ఇంకో ఐదు నిమిషాలు ఆగాలి అన్నారు. నాకు ఎవరి మాటలు వినపడలేదు. తను ఎప్పుడు వస్తుందా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత నా ఏంజల్ వచ్చేసింది. తనే నా వైఫ్ అని, నా బెట్టర్ హాఫ్ అని ఫిక్స్ అయ్యా. అప్పుడే తనకు ప్రపోజ్ చేద్దామనుకున్నా. కానీ, నేనంటే ఏంటో తెలియని అమ్మాయికి సడెన్‌గా ప్రపోజ్ చేయటం కరెక్ట్ కాదని అనిపించింది. ఫస్ట్ నేనే చెబుదాం అనుకునే లోపు తనే షాకింగ్ న్యూస్ చెప్పింది. మీరు బాగున్నారు అంది. అప్పుడు ఏమి మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అక్కడే డ్యాన్స్ చేద్దాం అనుకున్నా. రూములో ఉన్నంత సేపు తనను సరిగ్గా చూడలేదు. నేను బాగున్నానని తను చెప్పేసరికి నా ముఖాన్ని నేను సెల్‌ఫోన్ ఓ సారి చూసుకున్నా. నిజంగా అంత బాగున్నానా అని. అక్కడినుంచి అస్సలు వెళ్లాలనిపించలేదు. నా వైపునుంచి 1000 శాతం ఒప్పుకున్నా. ఎలాగైనా మ్యారెజ్ జరగాలని మా ఫ్యామిలీతో చెప్పా. వాళ్లు మా ఇంటికి వచ్చారు. పెళ్లి ఖాయం చేయటానికి. పెళ్లి ఫిక్స్ అయ్యాక మాట్లాడదామని ఫోన్ నెంబర్ అడిగితే ‘ నిశ్చితార్థం అయ్యాక’ అంది వాళ్ల అత్తయ్య. నిశ్చితార్థం రోజు వరకు వేయిట్ చేసి ఆ రోజు నేను మొదటిసారి ఆమెకు చెప్పిన మాట ‘ఐ లవ్ యూ’. ఆ తర్వాత మా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. నా పుట్టిన రోజునాడే మా పెళ్లి జరిగింది. అప్పుడప్పుడు మా మధ్య గొడవలు జరిగేవి, పట్టించుకునే వాళ్లం కాదు. కొద్దిరోజులకే మా మధ్య ప్రేమ, గొడవలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఒక రోజు చిన్న గొడవ పెద్దది అయ్యింది. నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అలా ఓ సంవత్సరం గడిచింది. నేను మాత్రం తన ఆలోచనలతోనే బ్రతుకుతున్నా. భౌతికంగా నా దగ్గర లేకపోవచ్చు కానీ, నా హృదయంలో ఉంది తను. అది తనకు ఎప్పుడు అర్థం అవుతుందో ఏమో. మేము ఇంతలా విడిపోవటానికి కారణం మా ప్రేమ. నేను ఏమీ అనక ముందే నేను కట్టిన తాళి తెంపేసిందని నేను.. సూసైడ్ అటెంప్ట్ చేస్తే నేను వెళ్లలేదని తను. తన గురించే ఆలోచించి ఎప్పటికైనా తనే తిరిగొస్తుందని ఎదురు చూస్తున్నా. కనీసం కోర్టులోనైనా కలవొచ్చననుకుంటే అక్కడికి కూడా రావటం లేదు. తను కచ్చితంగా వస్తుందని నా నమ్మకం.. ఎందుకంటే? నేను తనని ప్రేమిస్తున్నాను గనుక. - స్పందన్ బాబు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
వాడితో క్లోజ్‌గా ఉండకు, మంచోడు కాదు
లవ్ ఆట్ ఫస్ట్ సైట్ అంటే ఏదో అనుకున్నా కానీ, తనను చూసే వరకు తెలియదు. ఫస్ట్ టైమ్ నా అమ్మూని చూడగానే ఎందుకో తెలియదు.. ఊపిరి ఆడలేదు! హార్ట్ బీట్ ఎక్కువైంది. అప్పుడే మనసులో అనుకున్నా ‘ఈ అమ్మాయే నా వైఫ్ కావాలి’ అని. తనకోసం రెండు సంవత్సరాలు వేయిట్ చేశా. తర్వాత నాకు ఓకే చెప్పింది. అలా 8 ఏళ్లు మేము ప్రేమించుకున్నాం. నేను బెంగళూరులో జాబ్ చేసే వాడిని తనకోసం బెంగళూరు నుంచి మా ఊరు వచ్చేవాడిని. జస్ట్ చూడటానికి. ఎందుకంటే తను కాలేజ్ హాస్టల్.. ఔటింగ్ ఉండదు. కానీ, నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఒకసారి చూస్తే చాలు ఆనందంతో ఆకలి వేసేది కాదు. మేము చాలా హ్యపీగా ఉండేవాళ్లం. మా మధ్యలోకి చాలా మంది వచ్చేవారు. తనకు ప్రపోజ్ చేసేవాళ్లు. వాళ్లు ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్లు నాకు ఇచ్చి ‘వాళ్లకు కాల్ చేయ్ ఏమంటారో విందాం’ అనేది. నా ముందే చాలా మంది తనకు ప్రపోజ్ చేశారు. కానీ, ఏ రోజూ నా బుజ్జిని నేను అనుమానించలేదు. ఏ రోజూ తనకు ఇలా ఉండు అలా ఉండు అని నిబంధనలు పెట్టలేదు. తన ఇష్టానికి వదిలేశా! ఓ ఫ్రీ బర్డ్లాగా. తను లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నా ఎందుకంటే తనంటే నాకు పిచ్చి. ఎంతంటే తన కోసం నాకిష్టమైన, నా గోల్ ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయినా కూడా తను వద్దు అన్నందుకు వదిలేశా. తనకు నేనంటే ఇష్టం ‘నీలా నన్ను ఎవరూ చూసుకోలేరు. నిన్ను వదులుకుంటే నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు’ అనేది. కానీ, ఇంతలో మా మధ్యలోకి ఓ శత్రువు వచ్చాడు. వాడు నా బుజ్జికి స్కూల్ డేస్‌లో క్లాస్ మేట్స్. ఎఫ్బీలో పరిచయం అయ్యాడు. వాడికి నెంబర్ కూడా ఇచ్చింది. రోజూ మాట్లాడుకునేవాళ్లు. అడిగితే జస్ట్ ఫ్రెండ్ అనేది. ఒకసారి తనను బయటకు తీసుకెళటానికి ప్రయత్నించాడు. ఆ విషయం నాకు వాళ్ల ఫ్రెండ్ ద్వారా తెలిసింది. తనను అడిగితే ‘వాడు ఓన్లీ ఫ్రెండ్ ఊరికే అడుగుతున్నాడు బయటకెళదామని’ అనేది. ‘వాడితో క్లోజ్‌గా ఉండకు, మంచోడు కాదు’ అని చెబితే నాతో గొడవపడేది. ఇంక నాతో విషయాలను షేర్ చేసుకోవటం మానేసింది. తనకు కాల్ చేస్తే వేయిటింగ్ కాల్ వచ్చేది. తర్వాత అడిగితే నాన్న కాల్ చేశారు, ఫ్రెండ్ ఫోన్ చేసింది అనేది. తనపై నాకు ఏరోజూ సందేహం రాలేదు. ఒకసారి తన ఫ్రెండ్ కాల్ చేసింది. అప్పుడు నేను ఫోన్ల గురించి అడిగాను‘ ఏంటి అన్న తను నాకు అస్సలు ఫోన్ చేయటం లేదు’ అని చెప్పింది. అంతకు రెండు రోజుల ముందే నేను తనకు ఫోన్ చేసినపుడు వేయిటింగ్ కాల్ వచ్చింది. అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పింది. అలా నన్ను లవ్ చేస్తూనే వాళ్ల క్లాస్‌మేట్‌ను కూడా ప్రేమించింది. ఇద్దరు కలిసి బయటకు కూడా వెళ్లేవాళ్లు. ఔటింగ్ ఇస్తే వాడికి ఫోన్ చేసి రమ్మనేది. నేను అడిగితే ఔటింగ్ ఇవ్వలేదు అనేది. హాస్టల్నుంచి కలిసి వచ్చేటప్పుడు కూడా వాడు బుజ్జి కలిసే వచ్చేవాళ్లు. నా బుజ్జి వాడిని లవ్ చేస్తోందని నాకు తెలుసు. గట్టిగా అడిగితే ఏమంటుందోనన్న భయంతో అడగలేదు. బుజ్జి వాడిని లవ్ చేసేది నాకు తెలుసని తెలిసి ఏడ్చింది. నాకు వాడు వద్దు నువ్వే కావాలి అని ఏడ్చింది. మళ్లీ మా లవ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. వాడు బుజ్జిని బ్లాక్ మేయిల్ చేయటం ప్రారంభించాడు. కాల్ రికార్డ్స్, ఫొటోలు ఉన్నాయని. తను నాకు ఫోన్‌చేసి చెప్పింది. నేను వాడికి ఫోన్ చేసి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాను. వాడు ఆమె జోలికి రాలేదు అప్పటినుంచి. తనకు జాబ్ రాగానే నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే‘ నువ్వు వద్దు నాకు’ అని చెప్పింది. అన్ని విధాలుగా నన్ను దూరం పెట్టింది. ఫోన్ నెంబర్లు కూడా మార్చింది. ఓ రోజు కొత్త నెంబర్‌కు ఫోన్ చేస్తే చెడామడా తిట్టింది నన్ను. నా స్నేహితుల దగ్గర నన్ను చెడ్డొడిని చేసింది. అయినా తనకోసం నేను వేయిట్ చేస్తూనే ఉన్నాను,ఉంటాను. తనను నేను ఇబ్బంది పెట్టడం లేదు. తన దగ్గర నా ఫోన్ నెంబర్ ఒకటి సేవ్‌లో ఉంది. దాంతో వాట్సాప్‌లో లాస్ట్ సీన్ చూసుకుంటూ ఉంటాను. నా చేతిలో మొబైల్ ఉన్నపుడల్లా తను ఒక్కరోజు ఆన్‌లైన్‌లోకి రాకపోయినా నాకు చాలా భయమేస్తుంది. వెంటనే తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి అడుగుతా ఎందుకు తను ఆన్‌లైన్‌లోకి రాలేదని. వాళ్లు ఆమెకు క్యాజువల్‌గా కాల్ చేసి మాట్లాడి నాకు చెబుతారు. అప్పటి వరకు నాకు ప్రాణం నిలబడదు. నా బ్యాడ్‌లక్ ఇప్పుడు తన లాస్ట్ సీన్ కూడా హైడ్ చేసింది. తనని చూడక ఇప్పటికి 2 ఏళ్లు. ఒక్కసారి అయినా కాల్ చేయకపోదా అని ఎదురుచూస్తున్నా. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. బుజ్జి లవ్యూ రా.. లవ్ యూ సో మచ్. ఎప్పటికీ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా. - ప్రదీప్ రెడ్డి, కర్నూలు -
కాళ్లు పట్టుకుని అడిగినా కనికరించలేదు
మాది విజయనగరం జిల్లా. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నపుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. తను అప్పటికి ఇంకా ఫర్ట్ ఇయర్. ఒక రోజు తనకు లాబ్ జరుగుతుండగా కలిశాం. అప్పటినుంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నేను రిలీవ్ అయ్యాక కూడా తను నాతో టచ్‌లో ఉండేది. జనరల్‌గా మాట్లాడుకునే వాళ్లం. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక తను నాకు ప్రపోజ్ చేసింది. నేను ఒప్పుకోలేదు! ఒకసారి లవ్ ఫేయిల్ అయితే మా ఫ్రెండిషిప్ పోతదని నేను రిప్లై ఇవ్వలేదు. తర్వాత కొన్నాళ్లకు ‘లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్లను’ అని చెప్పింది. నేను కూడా ప్రపోజ్ చేశా. బాగానే కలిసుండేవాళ్లం. సినిమాలకు వెళ్లేవాళ్లం. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలీదు.. వెళ్లిపోయింది. కాళ్లు పట్టుకుని అడిగినా కనికరించలేదు. నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పినా నన్ను కాదని వెళ్లిపోయింది. రెండేళ్లు గడిచిపోయాయి. అయినా తన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. - దినేష్ రెడ్డి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ రోజు ధైర్యం చేసుంటే ఇలా అయ్యిండేది కాదు!
నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులవి! మా కాలేజీలో ఓ అమ్మాయిని నన్ను ప్రతి రోజూ చూస్తూ ఉండేది. ఆ అమ్మాయి డిప్లమో థర్డ్ ఇయర్. వాళ్ల ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తోందని. నాకు కూడా ఆమె మీద మీద ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ, నా ఫీలింగ్ చెప్పేలోపే ఆ అమ్మాయి తన డిప్లమో కోర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్లిపోయింది. నేను తనకు నా లవ్ ప్రపోజ్ చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అది నా చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ. నేను మూడవ తరగతి చదువుతున్న రోజుల్లో కొత్తగా ఓ అమ్మాయి మా క్లాస్‌లో జాయిన్ అయింది. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చడంతో ఓ లవ్ లెటర్ రాశాను. ఆమె ఆ తర్వాతి రోజు వాళ్ల వాళ్లను తీసుకొచ్చింది. వాళ్ల నాన్న నన్ను ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. దాంతో చాలా పెద్ద గొడవ అయింది. మా ప్రిన్సిపల్ మా పేరెంట్స్‌ని పిలిపించారు. అంతే! అప్పటినుంచి ఏ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయలేదు. మనసులో ప్రేమ ఉన్నా కానీ సైలెంట్‌గా ఉండేవాడిని. ఆ కారణం వల్లే నన్ను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయలేకపోయాను. ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే నాలా భయపడకండి.. భయపడి బాధపడకండి. - శ్రీరామ్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మోసం చేశాడు.. అంత అర్హత లేదు
గుడిమెట్లు ఎక్కుతుంటే మనసులో చిన్న అలజడి మొదలైంది. మనసు భారమవ్వసాగింది. ఎందుకో అర్థం కాలేదు. అక్కడే నిలబడిపోయి చుట్టూ చూశాను. దూరంగా అమ్మ! బాగా చిక్కిపోయింది. ఏదో పిచ్చి చీర కట్టుకుంది. తననలా చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. పరిగెత్తుకుపోయి తనను వాటేసుకోవాలని, తన గుండెపై తలవాల్చి భోరున ఏడవాలని అనిపించింది. కానీ ఆ ధైర్యం చేయలేకపోయాను. ఎలా చేస్తాను? తను అలా అయిపోవడానికి కారణమే నేను. పెళ్లైన పదేళ్లకు పుట్టాను అమ్మానాన్నలకి నేను. పైగా డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది అయ్యిందట. ఒక ప్రాణమే దక్కుతుంది అని డాక్టర్లు అంటే, ‘నా బిడ్డనే బతికించండి’ అందట అమ్మ. అలాంటి అమ్మని బతికుండగానే చంపేశాను నేను. ఆ రోజు పురుట్లో నేనే చనిపోయినా బాగుండేదేమో. కళ్లలో పెట్టుకుని పెంచారు నన్ను. ఆడింది ఆట, పాడింది పాట. దాంతో గారం ఎక్కువైంది. ప్రతిదానికీ మారాం చేయడం అలవాటైంది. ఆ మారాం కాస్తా మొండితనమై కూర్చుంది. అందుకే, కృష్ణతో ప్రేమలో పడినప్పుడు అమ్మ వారిస్తే వినిపించుకోలేదు. ఆ అబ్బాయి గురించి ఎంక్వయిరీ చేశాను, అంత మంచివాడు కాదని తెలిసింది అని నాన్న మొత్తుకున్నా చెవికెక్కించు కోలేదు. పైగా వాళ్ల అంగీకారం లభించదని అర్థమై ఓ అర్ధరాత్రి పూట చెప్పకుండా కృష్ణ దగ్గరకు వెళ్లిపోయాను. రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నాను. నాలుగు నెలల పాటు అతని ప్రేమలో మునిగి తేలాను. ఆ మత్తులో అమ్మానాన్నల్ని పూర్తిగా మర్చిపోయాను. ఓరోజు బయటకు వెళ్లి వస్తానన్న కృష్ణ ఎంతకీ తిరిగి రాలేదు. రాత్రయింది. ఉదయం అయ్యింది. మళ్లీ రాత్రి అయ్యింది. అలా ఎన్ని రాత్రులో, ఎన్ని ఉదయాలో! అతను మాత్రం రాలేదు. అతని ఫ్రెండ్స్ దగ్గర ఎంక్వయిరీ చేస్తే... ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసింది. నాతో పెళ్లయిన సంగతి ఎవరికీ చెప్పనేలేదని అర్థమైంది. మోసపోయాను. ఎవరికీ ముఖం చూపించలేకపోయాను. స్నేహితుల దగ్గర చిన్నబోయాను. చివరికి అమ్మానాన్నలు ఎదురుపడినా పలకరించే అవకాశం లేకుండా చేసుకున్నాను. ప్రేమలో పడి చదువు కూడా మధ్యలోనే ఆపేశానేమో, మంచి ఉద్యోగం కూడా దొరకలేదు. ఓ చిన్న స్కూల్లో టీచరుగా పని చేస్తూ కడుపు నింపుకుంటున్నాను. అమ్మానాన్నల దగ్గరకు వెళ్తే ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. కానీ ఆ పని చేసే ధైర్యం మాత్రం లేదు. అంత అర్హతా లేదు. అమ్మానాన్నల అనురాగాన్ని కాలదన్నుకుని వెళ్లిపోయే ఏ అమ్మాయికి ఆ అర్హత ఉంటుంది చెప్పండి! - సంధ్య, తెనాలి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నేను ప్రేమిస్తున్న అమ్మాయే తన ప్రేమని..
తన పేరు జ్ఞాపిక నాకు మంచి స్నేహితురాలు! చాలా అందంగా ఉంటుంది. దీంతో ఆమెను చాలా మంది ఇష్టపడి వెంటపడేవారు. కానీ ఆమె ఎవరినీ అంతగా పట్టించుకునేది కాదు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మార్చి-2018లో తను మళ్లీ లైబ్రరీ ముందు తారసపడింది. మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే తన 'లవ్-ఫెయిల్యూర్' గురించి నాతో చెబుతూ కంటతడి పెట్టింది. తను నాకు చాలా ఏళ్ల నుండి పరిచయం ఉన్నప్పటికీ నాకు తెలిసి ఆమెను అలా ఏడుస్తూ బాధతో చూడటం అదే మొదటిసారి. ఆ క్షణాన ఆమె కళ్లలో తన ప్రేమ తాలూకు నిజాయితీ చూసి ఆశ్చర్యం, అలాగే తనపై జాలీ కూడా కలిగింది. అదే విధంగా తనపైన, తన ప్రేమపైన పూర్తి గౌరవం పెరిగింది. అలా తను అప్పుడప్పుడు (చాలా తక్కువ సార్లు) కలిసేది. తన ప్రేమ కష్టాలను నాతో మాటల్లోనూ అలాగే మెసేజ్‌లోనూ పంచుకునేది. కొద్దినెలల తర్వాత( అక్టోబర్-2018లో) ఆమెతో నా చనువు తనపట్ల ఇష్టాన్ని కలగచేసింది. అయినా నేను తనతో అలాగే స్నేహంగా మెలిగేవాన్ని. ఆమెకు తెలుసు తన 'లవ్-ఫెయిల్యూర్' సంపూర్ణమని! కానీ, నెలలు గడుస్తున్నా ఆ భావన నుంచి బయటకు రాలేకపోయింది. అలా రోజులు గడిచేకొద్దీ తనతో నా స్నేహ ప్రయాణము (ఫిబ్రవరి-2019 నాటికి) ప్రేమగా మారింది. ఇక అప్పటినుండి తనతో ఉండాలని, మాట్లాడాలని నా ప్రేమను తనతో చెప్పాలని ఉండేది కానీ, చెప్పలేక పోయాను. నేను ఆమెతో ఉన్న ప్రతిక్షణం ఒక మధురమైన జ్ఞాపకంగా భావిస్తే తను మాత్రం అనుక్షణం తన (మాజీ) ప్రియుడి గురించి తన జ్ఞాపకాల గురించి నాతో చెప్పేది. అలా నేను ప్రేమిస్తున్న అమ్మాయే తన ప్రేమని నాతో ఒక స్నేహితుడిగా పంచుకోవడంతో నాకు ఏమీ తోచేదికాదు. కానీ, ఇలా అయినా ఆమెతో నేను ఉండొచ్చు, మాట్లాడొచ్చు అని తను ఏమి చెప్పినా ఓపికగా వినేవాన్ని. మొన్న (28 సెప్టెంబర్-2019) తనకు ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళ్తుంటే నాలో ఆ ప్రేమ తాలూకు ఎమోషన్స్ ఎక్కువై తను ఎయిర్-పోర్ట్‌కి వెళ్తుంటే తట్టుకోలేక ఫోన్ చేసి మాట్లాడాను. తనకి విషయం అర్థం అయ్యింది. నేను తనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని. ఇక అప్పటినుండి నన్ను దూరంగా ఉంచుతోంది. తను ఇంటికి వెళ్లినప్పటినుండి ఫోన్ కాల్ లేదు, నేను మెసేజ్ చేస్తే చిరాకు పడటం మొదలుపెట్టింది. దానికి కారణం ఆమె ఇంట్లో ఉండటం ఐతే సరే, కానీ కావాలని నన్ను దూరంగా పెడితేనే తట్టుకోలేను. ఈ ఎనిమిది సంవత్సరాల క్యాంపస్ జీవితములో నాకు సన్నిహితంగా ఉన్న ఒకే ఒక్క అమ్మాయివి నువ్వు. అలాంటి నువ్వే నాకు ఒక పది నిమిషాల సమయం ఇవ్వకపోవటం చాలా బాధగా ఉంది జ్ఞాపిక. ఇప్పటికీ నేను అడిగేది ఒక్కటే నాలో ఉన్న ప్రేమని తెలిపేందుకు నాకు కేవలం పది నిమిషాల సమయం మాత్రమే ఇవ్వు. ఇందులో వ్యక్తపరచిన నా భావాలు కేవలం సంక్షిప్తం మాత్రమే, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. నీ రాకకై వేయికళ్లతో ఎదురుచూస్తున్నా. - నీ ప్రియ-స్నేహితుడు శేషు, న్యూఢిల్లీ.( పేర్లు మార్చాం) లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది
నేను పదవ తరగతి చదువుతున్న రోజుల్లో నా క్లాస్మేట్ సరళ నన్ను చూసేది. ఇప్పట్లోలా కాదు అప్పుడు! ఏమైనా చెప్పాలంటే చాలా భయం. పరీక్షలకు మూడు నెలల ముందు ఓ లెటర్లో ‘నాకు నువ్వంటే ఇష్టం’ అని రాసిచ్చింది. ఆ తర్వాతనుంచి ఇద్దరము చూసుకోవటం నవ్వుకోవటం చేసేవాళ్లమే కానీ, ఏనాడు దగ్గరగా వచ్చింది లేదు. అయినా మా మధ్య ప్రేమ పెరిగింది. పరీక్షలు అయిపోయాయి. స్టడీ కోసం అక్కడినుంచి గుడివాడ వచ్చేశాము. మా అక్కకు మధ్యమధ్యలో లెటర్లు రాసి అందులో నా గురించి ప్రస్తావించేది. దురదృష్టవశాత్తు వాళ్ల మేనత్త చనిపోతే ఆమెను వాళ్ల మామకు ఇచ్చి పెళ్లి చేశారు. 8 ఏళ్ల తర్వాత వాళ్ల అమ్మతో గుడివాడలో కనిపించింది. బస్టాండ్‌లో కలిసి కొంచెం సేపు మాట్లాడాను. మనసులో చెప్పలేని ఆనందం. తను హ్యాపీగా ఉంది అని ఫీల్ అయ్యేలోపు ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేపర్లో చదివా. చెప్పలేని బాధ వేసింది. ఆరేళ్ల తర్వాత నాకు పెళ్లైన కొత్తలో భార్యతో కలిసి ఆటోలో వెళుతుంటే దారి మధ్యలో సరళ మా ఆటోను ఆపింది. ఆటోలో నా పక్కనే కూర్చుంది. తన చేతిలో నోకియా ఎన్70 ఫోన్ ఉంది. మాట్లాడదామా, పలకరిద్దామా అన్న సంశయంలో ఉండిపోయాను. కొత్తగా పెళ్లైంది, నా భార్య ఏమైనా అనుమానిస్తుందేమో అని ఆలోచించేలోపే తను గుడివాడ ఆర్సీఎమ్ ఆసుపత్రి దగ్గర దిగేసింది. నేను ఇంటి దగ్గర ఆటో దిగి, బండివేసుకుని వెనక్కు వెళ్లి ఆ చుట్టుపక్కల వెతికా కనిపించలేదు. అలా చాలా రోజులు వెతికా సంవత్సరాల తరబడి. అది జరిగి 11ఏళ్లు అయిపోయింది. ఒకే ఒక్కసారి కనపడితే బాగుండు అని ఎదురు చూస్తూనే ఉన్నా. కనపడ్డపుడు పలకరించలేకపోయానే అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించకపోతుందా అని ఎదురు చూస్తున్నా. - నాగేంద్ర ప్రసాద్, గుడివాడ( పేర్లు మార్చాం) లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మెసేజ్‌లు చదువుతోంది.. రిప్లై ఇవ్వటం లేదు
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు మా క్లాస్‌లో చిన్మయి అని ఓ అమ్మాయి ఉండేది. ఆమెను నేను చాలా ఇష్టపడ్డాను! అదే విషయాన్ని ఆమెకు చెప్పాను. తను సమాధానం ఇవ్వలేదు. అప్పటి వరకు మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ, నేను ప్రపోజ్ చేసిన తర్వాత రోజు తను నాతో క్లోజ్‌గా మాట్లాడింది. క్లాస్‌లో నా పక్క బేంచీలో వచ్చి కూర్చోవడం చేసేది. తర్వాత కొన్ని కారణాల వల్ల తను టెన్త్ క్లాస్‌లో స్కూల్ మారింది. ఆ తర్వాత మూడేళ్లు తను నాకు కనిపించలేదు, కాంటాక్ట్‌లో కూడా లేదు. 2014 అక్టోబర్‌లో దసరా సెలవులకి వాళ్ల తాతయ్య ఇంటికి వచ్చింది. రోడ్లో వెళుతుంటే నేను ఫాలో చేసి తనని ఫోన్ నెంబర్ అడిగా. తను ఫోన్ నెంబర్ ఇచ్చింది. 2014లో మేము బీటెక్! కానీ, వేరు వేరు కాలేజీలు. తను ఫోన్ నెంబర్ ఇచ్చినప్పటినుంచి మెసేజ్‌లు, అర్థరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుకోవటం చేసేవాళ్లం. తన రూం మేట్స్‌ని కూడా నాకు ఫోన్లో పరిచయం చేసింది. వాళ్లతో కూడా నేను ఫోన్లో మాట్లాడేవాడిని. రెండేళ్ల తర్వాత మా మధ్య అపార్ధాలు వచ్చి మాట్లాడుకోవటం మానేశాము. ఆ టైంలో నేను మెసేజ్‌లు, కాల్స్ చేస్తుంటే నా నెంబర్ బ్లాక్ చేసింది. ప్రతిరోజూ మా ఇంట్లో వాళ్ల నెంబర్‌తో టెలిగ్రామ్‌లో నా ఫ్రొఫైల్ పిక్ ఉంచి మెసెజ్ చేస్తున్నా. తను మెసేజ్ చదువుతుంది కానీ, రిప్లై ఇవ్వటం లేదు. నేను తనను మర్చిపోలేకపోతున్నాను. - రవీంద్ర, కోవెలకుంట్ల(పేర్లుమార్చాం) -
ఆమె మాటలే మెడిసిన్‌లా పని చేస్తాయి
నేను పది పాసై ఇంటర్ కాలేజీలో జాయిన్ అవుతున్న రోజులు. కాలేజీలో జాయిన్ అవ్వటానికి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అప్లికేషన్ పట్టుకొని లైన్లో నుంచున్నా. జెంట్స్ అంతా ఒక లైన్లో ఉంటే లేడీస్ అంతా మరో లైన్లో ఉన్నారు. ఎక్కడినుండి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు! నా పక్కన ఉన్న లేడీస్ లైన్లోకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆమెను చూడగానే నన్ను నేను మర్చిపోయాను. ఆఖరికి అప్లికేషన్ ఇవ్వడం కూడా మర్చిపోయా. అంతలోనే ఆమె అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంటికెళ్లేవరకు ఆమె నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఆ నైట్ నిద్ర పట్టలేదు. ఆమె రూపమే నా కళ్లముందు కదలాడసాగింది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ముఖం, నవ్వితే నన్ను నేను మర్చిపోయేంత అందమైన చిరునవ్వు. మొత్తానికి కాలేజీలో సీట్ వచ్చింది! సీఈసీ గ్రూప్‌లో. ఆమెకోసం మొదటి రోజు కాలేజీ మొత్తం వెతికా ఎక్కడా కనపడలేదు. అన్ని గ్రూప్స్‌లోనూ వెతికినా ప్రయోజనం లేకపోయింది. వారం రోజులు వెతికిన తర్వాత నేను ఆమెను మర్చిపోయా. ‘మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే దాన్ని దేవుడు మనకిస్తాడు’ అన్నట్టు వారం గడిచిన తరవాత ఆమెను నా గ్రూప్‌లోనే జాయిన్ చేశాడు. అప్పటినుంచి నేను దేవుడిని నమ్మడం ప్రారంభించా. నిత్యం ఆమెని చూసే అదృష్టం నాకు ఇచ్చినందుకు రోజూ దేవుడికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పేవాడినో. అలా ఆమెని చూడగానే ప్రేమలో పడ్డా కానీ, ప్రేమను తెలియచేసే దైర్యం నాకు రాలేదు. ఆమె నాతో ఉంటే సంతోసించేవాడిని.. ఏడిపించేవాడిని, నవ్వించేవాడిని కానీ, నా ప్రేమ విషయం చెప్పలేకపోయా. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని నా మనసుకు అనిపించేది. కానీ, ఆ వయస్సు ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని వయస్సు అని నా మనసుకు అనిపించేది. ఆమె నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటానని మాత్రం అనిపిస్తుంది. ఆ ఆలోచనలతోనే ఇంటర్ పూర్తి అయింది. కానీ నా ప్రేమని తెలియచేయలేకపోయా. పదేళ్లు గడిచింది. నా జాబ్‌తో నేను బిజీగా ఉన్నాను. ప్రస్తుతం పెళ్లై ఒక పాప కూడా ఉంది. కానీ ఆమెకి ‘‘ఐ లవ్ యూ కారుణ్య’’ అని చెప్పలేకపోయానన్న బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. 11 ఏళ్లు గడిచాయి. ఒక రోజు నా ఫేస్బుక్ అకౌంట్‌కి హాయ్ అని మెసెజ్ వచ్చింది. చూడగానే ఎగిరి గంతేసేంత సంతోషం. కళ్లలో నీళ్లు తిరిగాయ్. నా ఏజ్ మర్చిపోయా.. నా స్టేటస్ మర్చిపోయా , ఆ ఒక్క మెసెజ్ చూడగానే నేను చెప్పాలనుకున్నది చెప్పేశా ‘‘ఐ లవ్ యూ కారుణ్య’’ అని. ‘‘ఇన్ని ఇయర్స్ నన్ను వదిలేసి ఎలా ఉన్నావ్ ’’ అని ముహమాటం లేకుండా అడిగేశా. కాల్ చేయమని నెంబర్ ఇచ్చింది. వెంటనే కాల్ చేశా. మాటలు రావట్లేదు. కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయ్! మాట కూడా బరువుగా ఉంది. బట్ హార్ట్ మాత్రం వెయిట్ తగ్గింది! ఆ ఒక్క మాటతో. ఆమె లవ్ చేస్తున్నదా లేదా అని ఎపుడూ ఆలోచించలేదు. కానీ, నేను చెప్పాలనుకున్నది చెప్పేశా. కానీ చెప్పే ఏజ్‌లో చెప్పలేకపోయినందుకు ఆమె నా లైఫ్‌లో నాతో లేదు. ఆమెని నేను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా. ఐ లవ్ యు ఫర్ ఎవర్. ఆమె కూడా ప్రేమని అర్ధం చేసుకుంది. ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది. తన ప్రేమని నాకు వివరించింది. ప్రేమకి వయసు ఉండదు. దూరంగా ఉన్నా ఎప్పటికీ దగ్గరగానే ఉంటాం. లైఫ్ లాంగ్ ఆమె కూడా నన్ను మిస్ అవుతుంది. నాకు ఫీవర్ వచ్చినపుడు ఆమెతో మాట్లాడితే.. ఆమె మాటలే నాకు మెడిసిన్‌లా పనిచేస్తాయి. రియల్లీ షీ ఈజ్ మై సోల్... - సునీల్ బాబు, హైదరాబాద్ ( పేర్లు మార్చాం) లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
‘నువ్వు నన్ను మోసం చేసి ఎనిమిదేళ్లు’
తొలి ప్రేమను ఎప్పుడూ మర్చిపోరని అంటారు! నా లైఫ్‌లోనూ అలానే జరిగింది. మా మామయ్య కూతురు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటినుంచి అందరూ చెబుతూ ఉండేవారు ‘చిట్టి నీ భార్యరా’ అని బహుశా అది నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందనుకుంటా. తనను చూడటానికే వాళ్ల ఇంటికి వెళ్లే వాడిని. కాలేజ్ కూడా వాళ్ల ఊరిలోనే జాయిన్ అయ్యా. తనని రోజూ చూస్తున్నానని చాలా హ్యాపీగా ఫీలయ్యేవాడిని. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని నా మైండ్‌లో చాలా బలంగా ఫిక్సయ్యాను. ఏ చిన్న జాతరకు వెళ్లినా నా మైండ్‌లో వచ్చే మొదటి ఆలోచన తనకు ఏదో ఒకటి తీసుకోవాలని. మొదటిసారి తనకు గాజులు కానుక ఇవ్వటం నాకు ఇప్పటికీ గుర్తుకు ఉంది. నీకు గుర్తుకు ఉందో లేదో తెలియదు! నీ బుక్ మీద ఏదో చిన్న బొమ్మ గీస్తే నువ్వు నన్ను కొట్టింది. నన్ను కొట్టింది నా మరదలే కదా అని నేను కోప్పడలేదు. కేవలం నీ కోసమే చాలా చిన్న వయస్సులో గల్ఫ్‌కు వెళ్లి చాలా కష్టపడ్డాను. నా మరదలు నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండాలని ఎంతో శ్రమించాను. అంత దూరం పోయినా నీ గురించే ఆలోచనలు. నీ వాయిస్ వినకపోతే ఏదోలా అనిపించేది. నువ్వు కూడా నేను ఒక్కరోజు మాట్లాడకపోతే ఏడ్చేదానివి. కానీ, నీ మనసులో వేరే అతను ఉన్నాడన్న విషయం నాకు తెలియలేదు. నేను ఎపుడు కాల్ చేసినా ఫోన్ బిజీ వస్తే ఎందుకు అని కూడా అడగలేదు. నువ్వంటే నాకు పిచ్చి కాబట్టే ‘నా మరదలు నన్ను మోసం చేయదు’ అన్న గుడ్డి నమ్మకం. నాకు, నీకు పెళ్లి ఓకే చేశారని తెలియగానే ఎంత హ్యాపీగా ఫీలయ్యానో తెలియదు బంగారం. రెండేళ్ల తర్వాత ఇండియాకు వస్తున్నా అని మనసులో హ్యాపీ. నిన్ను చూస్తానని ఎంతో ఖుషీ. నేను దేశంలో అడుగుపెట్టగానే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్! బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోవటం. ఆ సమయంలో నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా? నీ గురించి ఎంత ఆలోచించానో నాకు తెలుసు. నువ్వు నన్ను మోసం చేసి 8 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ నువ్వు ప్రతిరోజూ గుర్తుకు వస్తావు బంగారం. నిన్ను మరిచిపోలేక నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా నీ ఆలోచనలలో ఉన్నాను. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బు చూశావు.. మంచి ఇళ్లు చూశావు.. కానీ, లవ్ చూడలేదని అర్థం అవుతోంది. నువ్వు అంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నావో నాకు తెలియదు. కానీ, నా చిన్ని ఇంట్లో నువ్వే నా రాణివి బంగారం. 8 సంవత్సరాలనుంచి ఒక్కసారైనా నిన్ను చూడలేదు కానీ నీ రూపం నా కళ్ల ముందు ఎప్పటికి అలానే ఉంటుంది. - చంద్రశేఖర్ (పేర్లు మార్చాం) లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి