
ప్రతీకాత్మక చిత్రం
ఓ రాంగ్ కాల్ ద్వారా తను నాకు పరిచయం అయ్యింది. వాట్సాప్‌లో తొమ్మిది రోజులు చాట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ కూడాఅయ్యాం. పదవ రోజు ఆ అమ్మాయి ఫోన్ పోయింది. నేను కాల్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. కాలేజ్ తెలీదు. ఫొటో కూడా చూడలేదు. అలానే ఒక నెల పాటు కాల్ చేశా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తర్వాత నేను కాల్ చేయటం మానేశా. తర్వాత మా ఫ్రెండ్ ‘ఫేస్‌బుక్‌లో నెంబర్‌తో ట్రై చేయ్’ అని చెప్పాడు. ఎనిమిది నెలల తర్వాత ఫేస్‌బుక్‌లో తన నెంబర్ టైప్ చేసి సెర్చ్ చేశా. ఏదో అబ్బాయి ఫ్రోఫైల్ ఓపెన్ అయ్యింది. అబ్బాయి ఫ్రెండ్ లిస్ట్‌లో తన పేరు సెర్చ్ చేశా! తన ఫ్రోఫైల్ దొరికింది. డైరెక్ట్ మెసేజ్ చేశా. ఎనిమిది నిమిషాల తర్వాత రిప్లై వచ్చింది. ‘కొన్ని నెలల క్రితం ఇద్దరం చాట్ చేసుకున్నాం’ అని ఆమెకు గుర్తుచేశా. తన పేరు చెప్పి నువ్వేకదా అని అడిగా. ‘అవును పిచ్చోడా! నా మొబైల్ పోయింది. నీ మెసేజ్ కోసం చాలా ఎదురు చూస్తున్నా. నీ నెంబర్ తెలీదు కానీ, మనం మళ్లీ కలుసుకుంటామని నాకు నమ్మకం ఉంది. అలా డైలీ చాటింగ్, కాల్స్ చేసుకునేవాళ్లం.
రెండు నెలల తర్వాత తనకి ప్రపోజ్ చేశా. 23 రోజుల తర్వాత ఓకే చెప్పింది. అలా రెండేళ్లు మా మధ్య ప్రేమ హాయిగా నడిచింది. ప్రతిరోజూ ఆనందమే. గొడవలు అవుతుండేవి కానీ, వెంటనే కాంప్రమైజ్ అయ్యేవాళ్లం. లేవగానే మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడు పడుకుంటామో తెలీదు. అప్పుడే నాకు కోడలు పుట్టింది. కోడలి ఫంక్షన్‌లో మా విషయం ఇంట్లో చెప్పేస్తా అన్నా. మా ఇంట్లో అందరికి తెలుసు. కానీ, మా నాన్నకు తెలీదు. ఫంక్షన్‌లో చెబుదాం అనుకున్నా. ఆ అమ్మాయి మా విషయం వాళ్ల అమ్మతో చెప్పింది. దీంతో వాళ్లు చస్తామని బెదిరించారు. వెంటనే పెళ్లి చూపులు పెట్టారు. నేను వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లా.. వాళ్లు ఒప్పుకోలేదు. ఆర్థికంగా మేము బాగా ఉన్నాం. తనకు వచ్చిన సంబంధం ఆస్ట్రేలియానుంచి అందుకే నన్ను రిజెక్ట్ చేశారు.
పెళ్లి అయిపోయింది. నేను పిచ్చోడిని అయిపోయా. డైలీ డ్రింక్ అండ్ స్మోక్ అలా నాలుగు నెలలు గడిపేశా. తర్వాత ఓ రోజు తనని ఓ బైక్‌పై చూశా. తను చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడు డిసైడ్ అయ్యా. నన్ను నేను మార్చుకోవాలని. గతంలో నేను ఆర్మీలో చేరాలని అనుకున్నాను. కానీ, తనకోసం నా ఆశయాన్ని మార్చుకున్నా. మళ్లీ ఆర్మీ ఈవెంట్స్‌కు హాజరై క్వాలిఫై అయ్యా. తనకు ఆ విషయం తెలిసి నాకు ఫోన్ చేసింది. వెళ్లొద్దని ఏడ్చింది. ప్రైవేట్ జాబ్ చేసుకోమంది. తన మాట కాదనలేకపోయా. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. అమ్మాయి ప్రేమ శాశ్వతం కాదు. తన సంతోషమే మన సంతోషం అనుకోవాలి. తనను లైఫ్ లాంగ్ ప్రేమిస్తా. ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.
- అజర్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment