ప్రేమించాడు! ఫోన్‌ చేస్తే అక్కా అన్నాడు | Breakup Love Stories In Telugu : Sunitha Sad Love | Sakshi
Sakshi News home page

ప్రేమించాడు! ఫోన్‌ చేస్తే అక్కా అన్నాడు

Published Fri, Dec 27 2019 10:15 AM | Last Updated on Fri, Dec 27 2019 10:39 AM

Breakup Love Stories In Telugu : Sunitha Sad Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేను హైదరాబాద్‌లోనే నా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. కానీ, నాకు మా హాస్టల్‌, కాలేజీ తప్ప ఇంకేమీ తెలియదు. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితులు నాకు బాగా తెలుసు. అందుకని చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. ఆ తర్వాత నేను ఓ కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ లాస్ట్‌ బెంచ్‌లో కూర్చునేదాన్ని. జాయిన్‌ అయిన రోజు నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌ పరిచయం అయ్యారు. మా బెంచ్‌ వెనకాలే ఓ అబ్బాయి కూర్చునే వాడు. మొదట్లో పట్టించుకోకపోయే వాళ్లం. మా అల్లరి మాకు ఉండేది. కానీ, కొన్ని రోజులకు నాకంటే ముందే మా ఫ్రెండ్స్‌కు తెలిసి పోయింది. ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడని. నా ఫ్రెండ్స్‌ ఆ విషయం నాకు చెప్పారు. కానీ, చాలా చాలా లైట్‌గా తీసుకున్నా. ఇంట్లో సమస్యలు, ఇంకా నేను చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నాను. లేనిపోనివన్నీ ఎందుకని మిన్నకుండిపోయా.

మా కోర్సులో అతడి వైపు చూడని వాళ్లు లేరు. మా కంటే ఏజ్‌లో పెద్ద వాళ్లు కూడా తనను చూసేవాళ్లు. ఒక మూడు రోజులు నేను క్లాస్‌కు వెళ్లలేదు. అప్పుడు తను చాలా ఏడ్చాడంట. క్లాస్‌ వినకుండా హాస్టల్‌కు వెళ్లిపోయేవాడంట. నేను ఇవన్నీ తను ఎదురుగా ఉన్నపుడు అస్సలు పట్టించుకోలేదు. కానీ, తను ఎక్షామ్‌ రాయటానికి ఇంటికి వెళ్లాడు. చాలా ఏడ్చాను. మా ప్రెండ్స్‌తో కాల్‌ చేయించాను! తను లిఫ్ట్‌ చేయలేదు. మళ్లీ ఎక్షామ్‌ రాసి వచ్చాక అసలు నేను తన కోసం ఒక్కదాన్నే వెనక బెంచీలో కూర్చునే దాన్ని. తను నాకోసం ఒక్కడే కూర్చునే వాడు. ఒక రోజు మా ఇంట్లో సమస్యలు మా ఫ్రెండ్‌కు చెప్పి చాలా ఏడ్చాను. తను ఏమనుకున్నాడో ఏమో మా మధ్య చాలా గ్యాప్‌ పెరిగింది.

తను చూసినా చూపులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మా ఫ్రెండ్‌కు చెప్పా! వాళ్లు అతని నెంబర్‌ తీసుకుని నాకిచ్చారు. నేను ఫోన్‌ చేస్తే అక్కా అన్నాడు. అర్థం కాలేదు. అంత ప్రేమగా చూసిన చూపులు అబద్ధం అంటే నమ్మలేకపోతున్నా. నా కోసం ఏడ్చిన మనిషి అలా అన్నాడని ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కాలేదు.ఇప్పుడు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. తన గురించి తెలిసి అలాంటివన్నీ మర్చిపొమ్మని చెబుతున్నారు. కానీ, ఎందుకో మర్చిపోలేకపోతున్నా. దీని వల్ల నా లైఫ్‌లో జాబ్‌, ఫ్రెండ్స్‌ అందరికీ దూరం అయ్యాను. ఒంటరిగా  ఉంటున్నా. నన్ను నన్నులా ఇష్టపడ్డ తనని మనసులో ఉంచుకుని ఇంకొకరితో జీవితాన్ని పంచుకోవటానికి మనసు ఒప్పుకోవటం లేదు. ఎందుకో కానీ, తప్పదు. అమ్మానాన్నల సంతోషం కోసం చేసుకుంటా.
- సునీత


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement