
ప్రతీకాత్మక చిత్రం
తన పేరు చిన్ని! మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైంది. ఫోన్‌లో బాగా మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఆమెకు ఎదురుపడి మాట్లాడటానికి నేను చాలా సిగ్గుపడేవాడిని. నేను చాలా పొసెసివ్! నాది అని అనుకుంటే దేన్నీ వదలను. కానీ, తను ఎప్పుడు చూసినా గంటలు గంటలు వేరేవాళ్లతో మాట్లాడేది. అయినప్పటికి నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఈ సమయంలోనే మా స్నేహం ప్రేమగా మారిపోయింది. దాదాపు 5నెలలనుంచి క్లోస్‌గా ఉంటున్నాం. ఈ మధ్యలో తను స్మార్ట్‌ఫోన్ కొన్నది కానీ, ఆ విషయం నాకు ఓ నెల తర్వాత చెప్పింది. అప్పటినుంచి తను నా చెయ్యి దాటిపోతోందని అనిపించింది. ఒక రోజు నాకో నిజం తెలిసింది. తను నాతోనే కాకుండా ఇంకో వ్యక్తితో మాట్లాడుతోందని. కొన్ని గంటలపాటు వీడియోకాల్స్ చేసేది. నేను తన ఫోన్ చూస్తానని అన్నీ డిలేట్ చేసేది. ఒక రోజు వాటిని డిలేట్ చేయటం మర్చిపోయింది.
తనకు తెలియకుండా అతడికి ఫోన్ చేస్తే ‘మా ఇంట్లో ఒప్పించుకో నిన్ను చేసుకుంటాన’ని చెప్పిందంట. నేను ఆమెను అడిగితే ‘మేము మంచి ఫ్రెండ్స్! ఊరికే పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు. అందుకే ఇంట్లో అడుగు అన్నా.’ అని చెప్పింది. నేను ‘ఫ్రెండ్స్ మధ్య వీడియో కాల్స్ ఎందుకు’ అని అడిగా. ‘ఊరికే చేస్తున్నాడు’ అని అంది. ‘ ఊరికే ప్రేమించు అని అడిగితే ఒప్పుకుంటావా?’ అన్న ప్రశ్నకు తను సమాధానం చెప్పలేదు. తర్వాత ఏదో జరిగి వాడు మాట్లాడటం మానేశాడనుకుంటా. ఇంక ఎవరితోనూ మాట్లాడనని చెప్పింది. ‘మంచిదే ఇకపై నిజాయితీగా ఉందాం’ అనిచెప్పా. తను ఎఫ్‌బీలో ఇంకొకడితో చాటింగ్ మొదలుపెట్టింది. నన్ను అనుమానంగాడు అనుకోకండి.
అమ్మాయిలు బాయ్స్‌తో మాట్లాడొచ్చు కానీ, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ముక్కుముఖం తెలియని వ్యక్తితో నేను ప్రేమించిన అమ్మాయి కొన్ని గంటలు వీడియో కాల్స్ చేసి మాట్లాడటం అనేది నాకు కరెక్ట్ కాదు అనిపించింది. తనను తప్పుగా అనుకోలేదు. అయితే నిజాలు మాత్రం చెప్పటంలేదనిపించింది. ఇక తననుంచి దూరం అవుదామనుకున్నా. 8 నెలలు గడిచింది. నా వల్లకావటం లేదు. అమ్మాయిని ఓ అబ్బాయి మోసం చేస్తే అన్ని చట్టాలు వారికి అనుకూలం. కానీ, ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయిని అందరూ వెధవలా చూస్తారు. నేను ఆ వెధవల్లో ఒకడినే. థాంక్యూ సో మచ్ చిన్ని! నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను.
- నాని, ఒంగోలు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment