
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు మా క్లాస్‌లో చిన్మయి అని ఓ అమ్మాయి ఉండేది. ఆమెను నేను చాలా ఇష్టపడ్డాను! అదే విషయాన్ని ఆమెకు చెప్పాను. తను సమాధానం ఇవ్వలేదు. అప్పటి వరకు మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ, నేను ప్రపోజ్ చేసిన తర్వాత రోజు తను నాతో క్లోజ్‌గా మాట్లాడింది. క్లాస్‌లో నా పక్క బేంచీలో వచ్చి కూర్చోవడం చేసేది. తర్వాత కొన్ని కారణాల వల్ల తను టెన్త్ క్లాస్‌లో స్కూల్ మారింది. ఆ తర్వాత మూడేళ్లు తను నాకు కనిపించలేదు, కాంటాక్ట్‌లో కూడా లేదు. 2014 అక్టోబర్‌లో దసరా సెలవులకి వాళ్ల తాతయ్య ఇంటికి వచ్చింది. రోడ్‌లో వెళుతుంటే నేను ఫాలో చేసి తనని ఫోన్ నెంబర్ అడిగా. తను ఫోన్ నెంబర్ ఇచ్చింది. 2014లో మేము బీటెక్! కానీ, వేరు వేరు కాలేజీలు. తను ఫోన్ నెంబర్ ఇచ్చినప్పటినుంచి మెసేజ్‌లు, అర్థరాత్రి వరకు ఫోన్‌లో మాట్లాడుకోవటం చేసేవాళ్లం.
తన రూం మేట్స్‌ని కూడా నాకు ఫోన్‌లో పరిచయం చేసింది. వాళ్లతో కూడా నేను ఫోన్‌లో మాట్లాడేవాడిని. రెండేళ్ల తర్వాత మా మధ్య అపార్ధాలు వచ్చి మాట్లాడుకోవటం మానేశాము. ఆ టైంలో నేను మెసేజ్‌లు, కాల్స్ చేస్తుంటే నా నెంబర్ బ్లాక్ చేసింది. ప్రతిరోజూ మా ఇంట్లో వాళ్ల నెంబర్‌తో టెలిగ్రామ్‌లో నా ఫ్రొఫైల్ పిక్ ఉంచి మెసెజ్ చేస్తున్నా. తను మెసేజ్ చదువుతుంది కానీ, రిప్లై ఇవ్వటం లేదు. నేను తనను మర్చిపోలేకపోతున్నాను.
- రవీంద్ర, కోవెలకుంట్ల(పేర్లుమార్చాం)
Comments
Please login to add a commentAdd a comment