ప్రతీకాత్మక చిత్రం
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు చదువు, కెరీర్ తప్ప ఇంకో ఆలోచన లేదు. ప్లానింగ్ ప్రకారం డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఎంఎన్‌సీలో జాబ్ సంపాదించా. అలా హ్యాపీగా గడిచిపోతున్న నాలైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చింది. నేను అపెండిక్స్ ఆపరేషన్ కోసం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. నా పక్క పేషెంట్ వాళ్ల అక్క తను. నాకు ఆమె చాలా బాగా నచ్చింది. వాళ్ల తమ్ముడితో మాటలు కలిపి తెలుసుకున్నా.. వాళ్లు మా కులమే అని. వాళ్లది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక నాకు అడ్డు లేదు అనుకున్నా. డైలీ వాళ్ల తమ్ముడి కోసం టిఫిన్ తీసుకొచ్చేది. మెల్లగా మాటలు కలిపా. డిశ్చార్జ్ రోజు నెంబర్లు మార్చుకున్నాం.
ఇంటికి చేరుకున్నాక‘ ఇంటికి క్షేమంగా చేరుకున్నారా?’ అని మెసేజ్ వచ్చింది. అలా ఒక నెల మాటలతో గడిపాం. నాకు రోజు రోజుకు తనపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఓ రోజు ఉండబట్టలేక ఫోన్‌లో నా ప్రేమ సంగతి చెప్పా. ‘ నువ్వు ఓకే అంటే మా పేరెంట్స్‌తో వచ్చి మీ పేరెంట్స్‌తో మాట్లాడతా’ అని. అప్పుడు తను ‘ నాకు ఇష్టం లేదు. ఆసక్తి ఉన్నపుడు తప్పక చెబుతా’ అని అంది. నేను ఊరుకోకుండా వాళ్ల ఊరికి వెళ్లి ఆమెను చూసి ‘ రెడ్ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావ్’ అని మెసేజ్ చేశా.
తను భయపడి వాళ్ల మామయ్యకు చెప్పింది. అతన్ని కన్విన్స్ చేయటానికి చాలా ట్రై చేశాను కానీ, నా మాటవినలేదు. అలా కుదరదని మా బంధువులతో కలిసి వాళ్ల పేరెంట్స్ దగ్గరకు సంబంధం తీసుకెళ్లా. కానీ, ఆ విలేజ్‌కు హైదరాబాద్ చాలా దూరం అని పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. తర్వాత మా చుట్టాల అమ్మాయితో నా పెళ్లి అయిపోయింది. కానీ, తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను.
- వెంకట్, హైదరాబాద్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment