
ప్రతీకాత్మక చిత్రం
మాది విజయనగరం జిల్లా. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నపుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. తను అప్పటికి ఇంకా ఫర్ట్ ఇయర్. ఒక రోజు తనకు లాబ్ జరుగుతుండగా కలిశాం. అప్పటినుంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నేను రిలీవ్ అయ్యాక కూడా తను నాతో టచ్‌లో ఉండేది. జనరల్‌గా మాట్లాడుకునే వాళ్లం. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక తను నాకు ప్రపోజ్ చేసింది. నేను ఒప్పుకోలేదు! ఒకసారి లవ్ ఫేయిల్ అయితే మా ఫ్రెండిషిప్ పోతదని నేను రిప్లై ఇవ్వలేదు.
తర్వాత కొన్నాళ్లకు ‘లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్లను’ అని చెప్పింది. నేను కూడా ప్రపోజ్ చేశా. బాగానే కలిసుండేవాళ్లం. సినిమాలకు వెళ్లేవాళ్లం. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలీదు.. వెళ్లిపోయింది. కాళ్లు పట్టుకుని అడిగినా కనికరించలేదు. నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పినా నన్ను కాదని వెళ్లిపోయింది. రెండేళ్లు గడిచిపోయాయి. అయినా తన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా.
- దినేష్ రెడ్డి
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment