
ప్రతీకాత్మక చిత్రం
నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులవి! మా కాలేజీలో ఓ అమ్మాయిని నన్ను ప్రతి రోజూ చూస్తూ ఉండేది. ఆ అమ్మాయి డిప్లమో థర్డ్ ఇయర్. వాళ్ల ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తోందని. నాకు కూడా ఆమె మీద మీద ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ, నా ఫీలింగ్ చెప్పేలోపే ఆ అమ్మాయి తన డిప్లమో కోర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్లిపోయింది. నేను తనకు నా లవ్ ప్రపోజ్ చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అది నా చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ.
నేను మూడవ తరగతి చదువుతున్న రోజుల్లో కొత్తగా ఓ అమ్మాయి మా క్లాస్‌లో జాయిన్ అయింది. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చడంతో ఓ లవ్ లెటర్ రాశాను. ఆమె ఆ తర్వాతి రోజు వాళ్ల వాళ్లను తీసుకొచ్చింది. వాళ్ల నాన్న నన్ను ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. దాంతో చాలా పెద్ద గొడవ అయింది. మా ప్రిన్సిపల్ మా పేరెంట్స్‌ని పిలిపించారు. అంతే! అప్పటినుంచి ఏ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయలేదు. మనసులో ప్రేమ ఉన్నా కానీ సైలెంట్‌గా ఉండేవాడిని. ఆ కారణం వల్లే నన్ను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయలేకపోయాను. ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే నాలా భయపడకండి.. భయపడి బాధపడకండి.
- శ్రీరామ్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment