
ప్రతీకాత్మక చిత్రం
లవ్ ఆట్ ఫస్ట్ సైట్ అంటే ఏదో అనుకున్నా కానీ, తనను చూసే వరకు తెలియదు. ఫస్ట్ టైమ్ నా అమ్మూని చూడగానే ఎందుకో తెలియదు.. ఊపిరి ఆడలేదు! హార్ట్ బీట్ ఎక్కువైంది. అప్పుడే మనసులో అనుకున్నా ‘ఈ అమ్మాయే నా వైఫ్ కావాలి’ అని. తనకోసం రెండు సంవత్సరాలు వేయిట్ చేశా. తర్వాత నాకు ఓకే చెప్పింది. అలా 8 ఏళ్లు మేము ప్రేమించుకున్నాం. నేను బెంగళూరులో జాబ్ చేసే వాడిని తనకోసం బెంగళూరు నుంచి మా ఊరు వచ్చేవాడిని. జస్ట్ చూడటానికి. ఎందుకంటే తను కాలేజ్ హాస్టల్.. ఔటింగ్ ఉండదు. కానీ, నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఒకసారి చూస్తే చాలు ఆనందంతో ఆకలి వేసేది కాదు. మేము చాలా హ్యపీగా ఉండేవాళ్లం. మా మధ్యలోకి చాలా మంది వచ్చేవారు. తనకు ప్రపోజ్ చేసేవాళ్లు. వాళ్లు ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్లు నాకు ఇచ్చి ‘వాళ్లకు కాల్ చేయ్ ఏమంటారో విందాం’ అనేది.
నా ముందే చాలా మంది తనకు ప్రపోజ్ చేశారు. కానీ, ఏ రోజూ నా బుజ్జిని నేను అనుమానించలేదు. ఏ రోజూ తనకు ఇలా ఉండు అలా ఉండు అని నిబంధనలు పెట్టలేదు. తన ఇష్టానికి వదిలేశా! ఓ ఫ్రీ బర్డ్‌లాగా. తను లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నా ఎందుకంటే తనంటే నాకు పిచ్చి. ఎంతంటే తన కోసం నాకిష్టమైన, నా గోల్ ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయినా కూడా తను వద్దు అన్నందుకు వదిలేశా. తనకు నేనంటే ఇష్టం ‘నీలా నన్ను ఎవరూ చూసుకోలేరు. నిన్ను వదులుకుంటే నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు’ అనేది. కానీ, ఇంతలో మా మధ్యలోకి ఓ శత్రువు వచ్చాడు. వాడు నా బుజ్జికి స్కూల్ డేస్‌లో క్లాస్ మేట్స్. ఎఫ్‌బీలో పరిచయం అయ్యాడు. వాడికి నెంబర్ కూడా ఇచ్చింది. రోజూ మాట్లాడుకునేవాళ్లు. అడిగితే జస్ట్ ఫ్రెండ్ అనేది. ఒకసారి తనను బయటకు తీసుకెళటానికి ప్రయత్నించాడు.
ఆ విషయం నాకు వాళ్ల ఫ్రెండ్ ద్వారా తెలిసింది. తనను అడిగితే ‘వాడు ఓన్లీ ఫ్రెండ్ ఊరికే అడుగుతున్నాడు బయటకెళదామని’ అనేది. ‘వాడితో క్లోజ్‌గా ఉండకు, మంచోడు కాదు’ అని చెబితే నాతో గొడవపడేది. ఇంక నాతో విషయాలను షేర్ చేసుకోవటం మానేసింది. తనకు కాల్ చేస్తే వేయిటింగ్ కాల్ వచ్చేది. తర్వాత అడిగితే నాన్న కాల్ చేశారు, ఫ్రెండ్ ఫోన్ చేసింది అనేది. తనపై నాకు ఏరోజూ సందేహం రాలేదు. ఒకసారి తన ఫ్రెండ్ కాల్ చేసింది. అప్పుడు నేను ఫోన్ల గురించి అడిగాను‘ ఏంటి అన్న తను నాకు అస్సలు ఫోన్ చేయటం లేదు’ అని చెప్పింది. అంతకు రెండు రోజుల ముందే నేను తనకు ఫోన్ చేసినపుడు వేయిటింగ్ కాల్ వచ్చింది. అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పింది. అలా నన్ను లవ్ చేస్తూనే వాళ్ల క్లాస్‌మేట్‌ను కూడా ప్రేమించింది. ఇద్దరు కలిసి బయటకు కూడా వెళ్లేవాళ్లు. ఔటింగ్ ఇస్తే వాడికి ఫోన్ చేసి రమ్మనేది.
నేను అడిగితే ఔటింగ్ ఇవ్వలేదు అనేది. హాస్టల్‌నుంచి కలిసి వచ్చేటప్పుడు కూడా వాడు బుజ్జి కలిసే వచ్చేవాళ్లు. నా బుజ్జి వాడిని లవ్ చేస్తోందని నాకు తెలుసు. గట్టిగా అడిగితే ఏమంటుందోనన్న భయంతో అడగలేదు. బుజ్జి వాడిని లవ్ చేసేది నాకు తెలుసని తెలిసి ఏడ్చింది. నాకు వాడు వద్దు నువ్వే కావాలి అని ఏడ్చింది. మళ్లీ మా లవ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. వాడు బుజ్జిని బ్లాక్ మేయిల్ చేయటం ప్రారంభించాడు. కాల్ రికార్డ్స్, ఫొటోలు ఉన్నాయని. తను నాకు ఫోన్‌చేసి చెప్పింది. నేను వాడికి ఫోన్ చేసి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాను. వాడు ఆమె జోలికి రాలేదు అప్పటినుంచి. తనకు జాబ్ రాగానే నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే‘ నువ్వు వద్దు నాకు’ అని చెప్పింది. అన్ని విధాలుగా నన్ను దూరం పెట్టింది. ఫోన్ నెంబర్లు కూడా మార్చింది. ఓ రోజు కొత్త నెంబర్‌కు ఫోన్ చేస్తే చెడామడా తిట్టింది నన్ను.
నా స్నేహితుల దగ్గర నన్ను చెడ్డొడిని చేసింది. అయినా తనకోసం నేను వేయిట్ చేస్తూనే ఉన్నాను,ఉంటాను. తనను నేను ఇబ్బంది పెట్టడం లేదు. తన దగ్గర నా ఫోన్ నెంబర్ ఒకటి సేవ్‌లో ఉంది. దాంతో వాట్సాప్‌లో లాస్ట్ సీన్ చూసుకుంటూ ఉంటాను. నా చేతిలో మొబైల్ ఉన్నపుడల్లా తను ఒక్కరోజు ఆన్‌లైన్‌లోకి రాకపోయినా నాకు చాలా భయమేస్తుంది. వెంటనే తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి అడుగుతా ఎందుకు తను ఆన్‌లైన్‌లోకి రాలేదని. వాళ్లు ఆమెకు క్యాజువల్‌గా కాల్ చేసి మాట్లాడి నాకు చెబుతారు. అప్పటి వరకు నాకు ప్రాణం నిలబడదు. నా బ్యాడ్‌లక్ ఇప్పుడు తన లాస్ట్ సీన్ కూడా హైడ్ చేసింది. తనని చూడక ఇప్పటికి 2 ఏళ్లు. ఒక్కసారి అయినా కాల్ చేయకపోదా అని ఎదురుచూస్తున్నా. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. బుజ్జి లవ్‌యూ రా.. లవ్ యూ సో మచ్. ఎప్పటికీ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా.
- ప్రదీప్ రెడ్డి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment