
ప్రతీకాత్మక చిత్రం
నేను నా స్కూల్ డేస్‌నుంచి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. చాలా సైలెంట్. ఇంటర్ కాలేజ్ అంతా వైజాగ్ గర్ల్స్ హాస్టల్‌లోనే. ఆ తర్వాత డిగ్రీలోకి వచ్చిన తర్వాత మధ్యలో తను పరిచయం అయ్యాడు. తనొక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్! నిజానికి నేనే తనకి మెసేజ్ చేశా. అలా మేము బాగా మాట్లాడుకునేవాళ్లం. తను నాతో రిలేషన్ కావాలని అడిగాడు. నేను సరే అన్నాను. అలా నాకు తెలియకుండానే నేను తనని చాలా ప్రేమించా. చాలా సార్లు తనకు చెప్పాలనుకున్నా. కానీ, భయం వేసింది. ఏమైనా అనుకుంటాడేమో అని అప్పుడు చెప్పలేదు. కానీ, తనకు నేను ప్రేమిస్తున్నానని తెలుసు! కావాలని నన్ను దూరం పెట్టాడు. తను గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పటికీ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. ఈ విషయాలు అన్నీ తెలిసికూడా నేను తనని ప్రేమించా.
తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని అనుకునేదాన్ని. తను నన్ను ప్రేమించకపోయినా పర్లేదు గానీ, నాతో మాట్లాడితే చాలని అనుకునేదాన్ని. కానీ, తను నాతో మాట్లాడటం మానేశాడు. తనకోసం ఏడవని రోజు లేదు. తన ఫొటో చూసుకుని, పాత మెసేజ్‌లు చదువుతూ అలా బ్రతికేస్తున్నా. తనంటే అంత పిచ్చి నాకు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మంటూ ఉంటే తను ప్రేమించే అమ్మాయి నేనే కావాలని కోరుకుంటున్నాను. నేను నిన్ను ఈ జన్మలో మర్చిపోను.
- గీత, విశాఖపట్నం
చదవండి : అమ్మ కోసం ఆమెను వదులుకున్నా! కానీ..
అతడికి ఫోన్ చేస్తే మేము చస్తాం!
Comments
Please login to add a commentAdd a comment