ప్రతీకాత్మక చిత్రం
2014లో ఓ పెళ్లికి వెళ్లా! అక్కడ ఓ అమ్మాయి చాలా చలాకీగా తిరుగుతూ కనపడింది. ఎవరు అని అడిగితే.. వరుసకు నాకు మరదలు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత తనను ఆటపట్టించటం మొదలుపెట్టా. అలా పెళ్లి అయిపోయే వరకు తన వెంట తిరగటం, తనని ఆటపట్టించటం చేసేవాడిని. ఫంక్షన్ అయిపోయింది. నేను తన నెంబర్ అడుగుదామనుకున్నాను. కానీ, తను ఏమనుకుంటుందోనని అడగటం మానేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేశా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెకు చెప్పలేదు. రెండు రోజుల తర్వాత ఒక కాల్ వచ్చింది. ‘హాయ్ బావా!’ అని వినపడింది. ‘ఎవరు’ అని అడిగా. నేను షాక్ అయ్యాను! తనే.
‘ ఈ నెంబర్ నీకు ఎలా తెలిసింది. ఎవరిచ్చారు.’ అని అడిగా. మా బంధువులు తనకు బంధువులు అట, వరుసకు అక్క అవుతదంట. తన దగ్గర ఈ నెంబర్ తీసుకుంది. అప్పటినుంచి ప్రతి రోజూ ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం, మెసేజ్‌లు చేసుకునే వాళ్లం. ఓ రోజు ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ పెట్టా. తను ‘ ఏప్రిల్ కాదు కదా బావ!’ అని రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత‘ ఏప్రిల్ ఫూల్ అవటానికి ప్రేమ ఏంటి బావ. మన మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే’ అంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. తర్వాతనుంచి మెసేజ్‌లు చేయటం మానేశా. ఆ తర్వాత తనతో ఏమీ చెప్పలేకపోయా. తనకు మ్యారేజ్ అయింది. ఇది ఈ రవి గాడి ప్రేమ కథ!
- రవి, వైజాగ్
చదవండి : అది తెలిసినా ఆమెతో ప్రేమలో పడ్డా!
ఆమె ఎప్పటికీ నాకు ప్రాణం! అందుకోసమే..
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment