మేషం : వీరు తమ ప్రతిపాదనలు అత్యంత ఇష్టమైన వ్యక్తులకు అందించేందుకు శుక్ర, ఆదివారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలివారు సానుకూలంగా స్పందించే వీలుంది. ప్రతిపాదనల సమయంలో మీరు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. ఇక మంగళ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.
వృషభం : మీ మనస్సులోని అభిప్రాయాలను మీరు ఇష్టపడే వ్యక్తులకు తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీకు అంతా శుభదాయకంగా ఉంటుంది. సానుకూల సమాచారం రావచ్చు. ఈరోజుల్లో మీరు రెడ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. శని, గురువారాలు మౌనం ఉత్తమం.
మిథునం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మీ ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు పంపేందుకు బుధ, గురువారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు అనుకూల సమాచారం పంపవచ్చు. ఈ సమయంలో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరించండి. ఇంటి నుంచి ఉత్తర ఈశాన్య దిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే, శుక్ర, సోమవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.
కర్కాటకం : మీ మనస్సులోని భావాలను ఇష్టమైన వారికి తెలియజేసేందుకు శుక్ర, బుధవారాలు శుభదాయకమైనవి. ఈరోజులలో మీ ప్రతిపాదనలపై అనుకూల స్పందనలు వచ్చే వీలుంది. అలాగే, ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరించడం మంచిది. ప్రతిపాదనల సమయంలో మీరు ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక ఆది, మంగళవారాలు ప్రతిపాదనలపై మౌన ం మంచిది.
సింహం : మీరు కోరుకున్న వ్యక్తులకు ప్రతిపాదనలు పంపేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ఈ సమయాల్లో మీరు వైట్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి మీ లక్ష్యం నెరవేరే అవకాశం. ఇక శని, బుధవారాలు మీ అభిప్రాయాలను వెల్లడించకపోవడమే ఉత్తమం.
కన్య : మీరు అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను శుక్ర, బుధవారాలు వెల్లడించడం ఉత్తమం. ఈ సమయంలో మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి ఊహించని రీతిలో సానుకూల సమాచారం అందవచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి విజయం సిద్ధిస్తుంది. ఇక ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.
తుల : మీ మనస్సులో అత్యంత ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు, ప్రతిపాదనలు చేసేందుకు శని, సోమవారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలపై అవతలి వారి నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. అలాగే, ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. అయితే, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉంటే మంచిది.
వృశ్చికం : మీరు అత్యంత ఇష్టపడే వారికి ప్రేమ ప్రతిపాదనలు తెలిపేందుకు శుక్ర, సోమవారాలు అనుకూలం. ఈ సమయంలో మీ సందేశాలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ప్రతిపాదనలు చేసే సమయంలో మీరు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్య దిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే, ఆది, బుధవారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమించండి.
ధనుస్సు : మీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను ఇష్టమైన వారికి అందించేందుకు శని, గురువారాలు విశేష లాభదాయకంగా ఉంటాయి. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి వారు అనుకూలంగా స్పందించే వీలుంటుంది. ఇటువంటి ప్రతిపాదనల సమయంలో పింక్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.
మకరం : మనస్సులో అత్యంత ఆరాధించే వారికి మీ ప్రతిపాదనలు తెలియజేసేందుకు ఆది, సోమవారాలు అనుకూలం. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు అనుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ సమయాలలో మీరు వైట్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి లక్ష్యాలు సాధిస్తారు. ఇక శుక్ర, బుధవారాలు మౌనం వహించడం మంచిది.
కుంభం : మీరు ఇష్టపడే వారికి మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు బుధ, గురువారాలు అత్యంత సానుకూలమైనవి. ఈ సమయంలో ప్రతిపాదనలు పంపితే అవతలి వారు కూడా సానూకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు గ్రీన్, బ్రౌన్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి ఉత్తరఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక శుక్ర, సోమవారాలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మీనం : మీరు కోరుకునే వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శని, గురువారాలు చాలా అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈసమయంలో మీ ప్రతిపాదనలపై అవతలి వారి నుంచి ఊహించని రీతిలో అనుకూల సమాచారం రావడం ఆశ్చర్యపరుస్తుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, ఎల్లోరంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment