
ప్రతీకాత్మక చిత్రం
చాలా కాలం క్రితం మా కుటుంబం ఓ మూడేళ్లు అనంతపురంలో ఉండింది. అప్పుడు నేను 8నుంచి 10వ తరగతి వరకు శారదా మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్‌లో చదివాను. చాలా కష్టపడి చదివేదాన్ని. చదువే నాలోకం. 8వ తరగతిలో రంగప్ప సార్ ట్యూషన్‌లో చేరాను. చాలా బిడియం, అమాయకత్వం, మగ పురుగును చూడటం కూడా తప్పు అనుకునేదాన్ని. నన్నో అబ్బాయి నాకు తెలియకుండా డైలీ చూసేవాడు. తొమ్మిదిలో ట్యూషన్ మానేసినా పదిలో మళ్లీ నా కోసమే చేరాడు. నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. మా స్కూల్ తరపున డ్రాయింగ్, సింగింగ్, అన్ని కాంపిటీషన్స్‌కు వెళ్లేదాన్ని. అతను కూడా నేను వెళ్లే ప్రతీ కాంపిటీషన్‌కు వచ్చేవాడు. వాళ్లది బాయ్స్ స్కూల్. అతను నన్ను డీప్‌గా ప్రేమిస్తున్నాడని నా ఫ్రెండ్స్ చెప్పేవరకు నాకు తెలియదు. ట్యూషన్ సోఫా మీద నా పేరు వందలసార్లు దిద్దేవాడు.
ఎప్పుడైనా అతను నా దగ్గరగా నిలబడినప్పుడు నేను చూస్తే చాలు అమ్మాయిలందరూ నన్ను ‘ చూసింది, చూసింది’ అని కామెంట్లు చేసేవారు. ఆ వెంటనే నేను తప్పు చేసినట్లు తలదించుకుని స్టడీస్‌పై శ్రద్ధ పెట్టేదాన్ని. సెలవులొస్తే మా వీధి చివర నిలబడి నేను కనపడేవరకు ఎదురు చూసేవాడు. నాకప్పుడు తెలియదు అతను నా కోసమే నిలబడ్డాడని. టెన్త్ ఫైనల్ ఎక్షమ్స్ అప్పుడు మా ఇద్దరి సెంటర్లు వేరు వేరు. పరీక్షల్లో ఏం రాసేవాడో కానీ, సైకిల్ మీద వచ్చేటప్పుడు , వెళ్లేటప్పుడు ఫాలో అయ్యేవాడు. లాస్ట్ డే రోజు నేను మిస్ అయ్యానని రొప్పుకుంటూ వచ్చాడు.
నాకు ఎన్నో లెటర్స్ రాశాడంట నాకు వినిపించాలని. హాలిడేస్‌లో మేము హైదరాబాద్ షిప్ట్ అయ్యాము. అతన్ని ఒక్కసారి కూడా చూడలేదు, మాట్లాడలేదు. కానీ, రీసెంట్‌గా స్వప్న మూవీలో లవ్ లెటర్స్ సాంగ్ చూశాక చాలా బాధపడ్డా. నేనెంత నిజమైన ప్రేమను మిస్ అయ్యానోనని. నేను దూరం అయ్యాక ఎలా తట్టుకున్నాడో, అసలు ఉన్నాడా అని అనుమానం. ఇది జరిగి 30 ఏళ్లు గడుస్తున్నా నా హార్ట్‌లో నిలిచిపోయే రిలేషన్. ఎక్కడున్నా నీకు సారీ చెప్పాలని, ఆ లెటర్స్ చదవాలని, నిన్ను చూడాలని ఉంది.
- శ్రీ గౌరీ, అనంతపురం
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment