వాలెంటైన్స్‌ డే జోష్‌! చాట్‌జీపీటీతో ప్రేమ లేఖలకు సిద్ధపడ్డ లవ్‌ బర్డ్స్‌ | Indians most likely to use ChatGPT for Valentines Day love letters | Sakshi
Sakshi News home page

వాలెంటైన్స్‌ డే జోష్‌! చాట్‌జీపీటీతో ప్రేమ లేఖలకు సిద్ధపడ్డ లవ్‌ బర్డ్స్‌

Published Mon, Feb 13 2023 5:45 AM | Last Updated on Mon, Feb 13 2023 11:43 AM

Indians most likely to use ChatGPT for Valentines Day love letters - Sakshi

న్యూఢిల్లీ: వాలెంటైన్స్‌ డే వచ్చేస్తోంది. ప్రేమికులంతా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి కొత్త జోష్‌తో ఉన్నారు. మనసులో ప్రేమ భావనలు ఉప్పొంగుతున్నా వాటిని చక్కగా కాగితంపై పెట్టలేని వారు చాట్‌జీపీటీ సాయంతో ప్రేమలేఖలు రాయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు!

62% మంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్‌డేకి చాట్‌జీపీటీ సాయంతో తమ మనసులో ఉన్న మాటల్ని రాస్తామని ఒక సర్వేలో వెల్లడించారు. 30% మంది తమ లవర్‌కి ఈ టూల్‌ సాయంతో ప్రేమలేఖ రాస్తామని చెప్పారు. మోడరన్‌ లవ్‌ రీసెర్చ్‌ తొమ్మిది దేశాల్లో 5 వేల మందిని ప్రశ్నించి ఒక నివేదిక రూపొందించింది. సహజసిద్ధంగా పుట్టే ప్రేమను వ్యక్త పరచడానికి కృత్రిమ మేధపై ఆధారపడతామని చెప్పిన వారిలో అత్యధికులు భారతీయులే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement