హలో ప్రేమపక్షులారా.. ఈ యాప్‌ మీకోసమే.. | How to Use ChatGPT To Write Love Letters | Sakshi
Sakshi News home page

ChatGPT: ప్రపోజ్‌ చేసేందుకు రెడీ అయ్యారా? అయితే ఇది మీకోసమే!

Published Sat, Feb 3 2024 3:51 PM | Last Updated on Sat, Feb 3 2024 4:10 PM

How to Use ChatGPT To Write Love Letters - Sakshi

కాలం మారినా కవితలతో ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులు ఇంకా ఉన్నారు. అయితే కవితల కోసం కవితాత్మక ఆలోచనలు అందరికి రావు, రావాల్సిన అవసరమూ లేదు. అలాంటి వాటికి ChatGPT చాలా ఉపయోగపడుతుంది. ఈ కథనంలో చాట్‌జీపీటీ ద్వారా ప్రేమలేఖలు ఎలా రాయాలి, కవితల కోసం ఎక్కడ సర్చ్ చేయాలనే మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం.

ముందుగా మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లో చాట్‌జీపీటీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ పూర్తిగా ఉచితం, దీనికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ మెయిల్ లేదా ఫేస్‌బుక్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు.

చాట్‌జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత టెక్స్ట్/సర్చ్ బాక్స్ కనిపిస్తుంది, అందులో మీరు అడగాల్సిన ప్రశ్నను టైప్ చేయాలి. మీరు టెక్స్ట్ బాక్స్‌లో టైప్ చేసిన ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది. లవ్ లెటర్ కావాలని సర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే.. వెంటనే పైన మీకు ఒక లెటర్ సమాధానం రూపంలో కనిపిస్తుంది.

లెటర్ మాత్రమే కాకుండా మీరు ప్రేమించే అమ్మాయి లేదా అబ్బాయి కోసం కవితలు కావాలనుకుంటే కూడా సర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే.. కవితలు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. చాట్ జీపీటీ ఇచ్చిన ఫలితాల్లో మీకు అవసరమైన కంటెంట్ తీసుకుని, మీకు నచ్చినట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!

చాట్‌జీపీటీ ఇచ్చిన కంటెంట్‌ను లేదా సమాధానాలను జాగ్రత్తగా పరిశీలించాలి.. ఎందుకంటే ఆ కంటెంట్‌లో చిన్న పొరపాట్లు జరిగిన పదాలకు అర్థాలు మారిపోతాయి, తరువాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైన కంటెంట్ ఉంచి, అనవసరమైన కంటెంట్ తీసివేసి సొంతంగా తయారు చేసుకోవడం ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement