
నాటి ప్రఖ్యాత హాలీవుడ్ నటి, మోడల్, గాయని మార్లిన్ మన్రో (1926–62) చిత్రాన్ని క్రిస్టీ సంస్థ మేలో వేలానికి పెట్టనుంది. పాప్ గాయకుడు ఆండీ వార్హోల్ గీసిన ఈ అరుదైన చిత్రం రూ.1521 కోట్లు పలుకుతుందని అంచనా. అదే జరిగితే 20వ శతాబ్దంలోనే అతి ఖరీదైన చిత్రంగా చరిత్రలో నిలుస్తుందని క్రిస్టీ తెలిపింది.
ఇదిలా ఉండగా, హలీవుడ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ ప్రముఖ తారలు వాడిన వస్తువులను వేలానికి పెడుతుంటుంది. అలా, ఇప్పటివరకు పలుమార్లు మన్రో వాడిన వస్తువులను అడపా దడపా వేలానికి పెట్టారు. ఇటీవలే మరికొన్ని మన్రో వస్తువులను వేలానికి పెట్టారు. వీటిలో మన్రో మాజీ భర్త జో డిమాగ్గియో ఆమెకు రాసిన ప్రేమలేఖ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆర్థర్ మిల్లర్ రాసిన ప్రేమలేఖ కూడా ఉన్నాయి. డిమాగ్గియో రాసిన ప్రేమలేఖ దాదాపు 48 లక్షలు సాధించగా, ఆర్థర్ రాసిన ప్రేమలేఖ 28 లక్షలకు అమ్ముడుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment