
చెన్నై: నాకు వచ్చిన మొదటి ప్రేమలేఖను అమ్మకు ఇచ్చాను అని చెప్తోంది హీరోయిన్ అదితిరావ్ హైదరి. మణిరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు హైదరాబాద్ బ్యూటీ. ఈ మధ్య తెలుగులో సమ్మోహనం చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న అదితిరావ్ ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా సైకో చిత్రంలో నటిస్తోంది. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది.
ఇటీవల ఈ బ్యూటీ తన ప్రేమ వ్యవహారం గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్ ప్రేమలేఖను రాశాడని చెప్పింది. అప్పుడు తన వయసు 9 ఏళ్లు అని పేర్కొంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతను రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్లి గర్వంగా తన తల్లికి ఇచ్చానని చెప్పింది. అంతే వేగంతో తనను బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారని తెలిపింది. ఇంతకీ ఆ లేఖలో అతను రాసిందేమిటంటే నువ్వు చాలా అందంగా ఉన్నాను.. లాంటి ఏవేవో రాతలు రాశాడని చెప్పింది. తనకు 21 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, ఎలా డేటింగ్ చేయాలో కూడా తెలియలేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయాను అని నటి అదితిరావ్ పేర్కొంది. గ్లామర్ విషయంలో పరిమితులు లేవనే విధంగా నటించడానికి రెడీ అనే అదితిరావ్ కారణాలేమైనా ఎక్కువ చిత్రాల్లో చిత్రాల్లో కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment