
అన్నానగర్ : 16 ఏళ్ల బాలికకు ప్రేమ లేఖ ఇచ్చిన వృద్ధుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. వివరాలు.. కోవై పొత్తనూర్ భజన ఆలయ వీధికి చెందిన మహమ్మద్ బీర్ బాషా (66) 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆ బాలికకి ప్రేమలేఖ రాసి ఇచ్చాడు. ఇందులో ‘నాకు నువ్వు నచ్చావు, నీకు ఓకేనా’ అని రాసి ఉంది. బాలిక ఆ లేఖను తన తల్లికి ఇచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు బుధవారం మొ హమ్మద్ బీర్ బాషా మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment