Mike Tyson Repeatedly Punches Passenger on Plane at SFO, Watch Video - Sakshi
Sakshi News home page

Mike Tyson : కోపంతో ప్యాసింజర్‌ను చితక్కొట్టిన మైక్‌టైసన్‌

Published Fri, Apr 22 2022 6:24 PM | Last Updated on Fri, Apr 22 2022 7:59 PM

Mike Tyson Punches Passenger On US Plane - Sakshi

బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ 'లైగర్‌' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ- పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక టైసన్‌ బాక్సింగ్‌ పంచులకే కాక ఆయన సినిమాలకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. సాధారణంగానే సెలబ్రిటీలు అంటేనే క్రేజీ ఫాలోయింగ్‌ ఉంటుంది. వాళ్లు కనపడగానే ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్‌, గంటల వ్యవధిలోని ఆన్‌లైన్‌లో లీక్‌

కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్‌ చేసే అత్యుత్సాహం సెలబ్రిటీలకు విపరీతమైన కోపం తెప్పిస్తుంది. తాజాగా ఇలాంటి  పరిస్థితే బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌కు ఎదురైంది. దీంతో సహనం కోల్పోయిన టైసన్‌ సదరు యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్‌టైసన్‌ విమానంలో వెళ్తుండగా ఆయన వెనుక సీట్లో కూర్చున్న యువకుడు టైసన్‌ను చూసి తెగ ఎగ్జయిట్‌ అయ్యి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో టైసన్‌ కూడా అతనితో నవ్వుతూనే మాట్లాడాడు. కానీ సదరు యువకుడు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటంతో టైసన్‌ అభ్యంతరం చెప్పాడు.

కాసేపు సైలెంట్‌గా ఉండమని కోరాడు. అయినప్పటికీ అతను వినిపించుకోకుండా నస పెట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టైసన్‌ సీట్లో నుంచి లేచి వెనకున్న యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. టైసన్‌ పంచింగ్‌ పవర్‌కి సదరు యువకుడి తలకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: మీలో ఆ టాలెంట్‌ ఉంటే.. ప్రభాస్‌ సినిమాలో ఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement