Liger: Vijay Devarakonda Shares Photo With Mike Tyson - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: మైక్‌ టైసన్‌తో విజయ్‌ దేవరకొండ

Published Tue, Nov 16 2021 11:42 AM | Last Updated on Tue, Nov 16 2021 1:41 PM

Liger : Vijay Devarakonda Shares Photo With Mike Tyson - Sakshi

Vijay Devarakonda Shares Photo With Mike Tyson : డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌- విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్‌.  బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా షెడ్యూల్‌లో మైక్‌టైసన్‌ని కలుసుకున్న విజయ్‌ దేవరకొండ ఆయనతో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.ఐరన్‌ మ్యాన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..ఈ మెమోరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటాన‌ని పేర్కొన్నాడు. 

ఈ షెడ్యూల్‌లో లైగర్‌ మూవీ క్లైమాక్స్‌ను షూట్ చేయనున్నట్టు సమాచారం. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీని పూరి కనెక్ట్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement