‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ షూటింగ్‌కు రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్‌ఫైర్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఏప్రిల్‌లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.
ముందుగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట ప్రశాంత్ నీల్. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment