Hero Gopichand started news movie shooting with Director Srivas- Sakshi
Sakshi News home page

Gopichand: గోపీచంద్‌-శ్రీవాస్ కాంబోలో మూడో సినిమా.. అంతకుమించి..

Published Sat, Dec 25 2021 8:47 AM | Last Updated on Sat, Dec 25 2021 9:27 AM

Hero Gopichand And Director Srivas New Movie Shooting Begun - Sakshi

Hero Gopichand And Director Srivas New Movie Shooting Begun: ‘లక్ష్యం, లౌక్యం’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్‌ శ్రీవాస్‌ కాంబినేషన్‌లో మూడో సినిమాకి శ్రీకారం జరిగింది. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాజకీయ, పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేష్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్‌ శ్రీవాస్‌ మాట్లాడుతూ ‘‘గోపీచంద్‌ కెరీర్‌లో 30వ సినిమా ఇది. భూపతి రాజా కథ మీద చాలా వర్క్‌ చేశాం. ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలను మించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘సంక్రాంతి పండగ తర్వాత మా సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల. గోపీచంద్‌ మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ, హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. మంచి కథకు మంచి ఆర్టిస్ట్‌లు దొరికారు’’ అని తెలిపారు. ఈ సినిమాకు కెమెరామేన్‌ వెట్రి పళనీ స్వామి, రచయిత భూపతి రాజా. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు.   



ఇదీ చదవండి: వెబ్‌ సిరీస్‌లలోకి అడుగు పెట్టిన హీరోయిన్లు వీళ్లే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement